బ్రోకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రోకర్
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.పి.పట్నాయక్
నిర్మాణం మద్దినేని రమేష్
కథ ఆర్. పి. పట్నాయక్
చిత్రానువాదం ఆర్. పి. పట్నాయక్
తారాగణం ఆర్.పి.పట్నాయక్, గొల్లపూడి మారుతీరావు, శ్రీహరి, సురేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాసరావు
సంగీతం ఆర్. పి. పట్నాయక్
నేపథ్య గానం శ్రీరామచంద్ర, హేమచంద్ర, సింహ, గీతామాధురి, ప్రియా సుబ్రహ్మణ్యం
నృత్యాలు రఘు
గీతరచన చైతన్య ప్రసాద్
ఛాయాగ్రహణం శరత్ మండవ
విడుదల తేదీ 31 డిసెంబర్ 2010
భాష తెలుగు
పెట్టుబడి 15 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బ్రోకర్ (Broker) 2010 లో విడుదలైన సందేశాత్మక చిత్రం. దీనిని ఆర్. పి. పట్నాయక్ రచించి, బ్రోకర్ గా నటించి, దర్శకత్వం కూడా వహించాడు.

కథా సంగ్రహం[మార్చు]

ఇదొక బ్రోకర్ కథ. గణపతి (ఆర్. పి.పట్నాయక్) బ్రోకర్ గా ఎన్నో పెద్ద కేసుల్ని పరిష్కరించి, చాలామంది గొప్పవారికి సహాయం చేస్తుంటాడు. ఇతనికి ఒక భార్య, ఒక కొడుకు. ఇతని గురువు గొల్లపూడికి పెన్షన్ డబ్బు కొన్ని నెలలు రాకపోయినా గణపతి సహాయం చేస్తానన్నా తిరస్కరిస్తాడు. అతనికి తెలియకుండా సహాయం చేసి పెన్షన్ వచ్చినట్లుగా చేస్తే అతన్ని దెబ్బలాడి చెక్ చింపేస్తాడు. తర్వాత రోజే అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. తాను బ్రోకర్ గా కుదిర్చిన కంట్రాకర్ కడుతున్న వంతెన కూలిపోయి స్వంత కొడుకు చనిపోతాడు. అప్పుడయినా మారతాడని చూస్తున్న భార్య కూడా తను ఇక మారడని పుట్టింటికి వెళిపోతుంది. చివరికి శ్రీహరి తనను మారుస్తాడు. ఒకసారి అన్యాయంగా ఎన్నో కోట్లు సంపాదించిన శ్రీహరి విమానంలో ప్రయాణం చేస్తుండగా అది కూలిపోబోతున్నదని పైలట్ చెప్తాడు. అప్పుడు తాను చేసిన పాపపు పనులన్నీ ఒక్కొక్కటీ అతనికి జ్ఞాపకం వస్తుంటాయి. ఒక్క మంచిపని కూడా గుర్తుకురాదు. తాను చేస్తున్న తప్పుల్ని తెలుసుకున్న శ్రీహరి ప్రమాదంలో క్షేమంగా బయటపడి, పూర్తిగా ప్రజాసేవా కార్యక్రమల్లో పాల్గొని ఎందరికో ప్రాణదానం చేస్తాడు. తనవలన బ్రతికి బయటపడ్డ వ్యక్తులు ఏడుస్తూ చెప్పే కృతజ్ఞతలు ఎన్నో కోట్ల కన్నా విలువైనవని బ్రోకర్ కి చెబుతాడు. ఒక టి.వి. ఛానల్ వారికి తాను సహాయపడిన వారందరి పేర్లు బయటపెడతానని లైవ్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తాడు. అయితే ఒకటి రెండు కేసులు బయటపెట్టిన తర్వాత అతనికి ఆ సమస్య ఎంత క్లిష్టమైనదో అర్థమై తప్పుత్రోవలో నడచి ధనార్జన చేస్తున్న వారందరికీ ఒక ఛాన్స్ ఇస్తాడు. టి.వి.ఛానల్ వారితో ఛాలెంజ్ చేయగా శ్రీహరి మొదటగా ఫోన్ లో తన నేరాన్ని ఒప్పుకొని బ్రోకర్ ని గెలిపిస్తాడు. అలా తప్పు మార్గంలో కోటీశ్వరులైన ఎంతోమందికి మారడానికి అవకాశమిస్తాడు. ముఖ్యమంత్రి వారందరిపై కేసుల్లేకుండా మన్నిస్తామని హామీ ఇస్తాడు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అటు వంగపాదు - గీతా మాధురి
  2. కుక్క తోక వంకర - సింహా
  3. పురుడు పోస్తే లంచం; బొడ్డు కోస్తే లంచం (టైటిల్ సాంగ్) - ప్రియా సుబ్రమణియన్
  4. బోలో జై జై జై గణపతి - హేమచంద్ర
  5. సారే జహాసే అచ్ఛా - శ్రీరామచంద్ర

పురస్కారాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బ్రోకర్&oldid=3466060" నుండి వెలికితీశారు