Jump to content

శ్రీనివాస మూర్తి

వికీపీడియా నుండి
ఎ. శ్రీనివాస మూర్తి
జననం
మరణం2023 జనవరి 27
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తిడబ్బింగ్‌ ఆర్టిస్ట్‌
క్రియాశీల సంవత్సరాలు1990 - 2023
తల్లిదండ్రులు
  • ఎ.వి.ఎన్.మూర్తి (తండ్రి)

శ్రీనివాస మూర్తి భారతీయ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. ఆయన ఆంగ్ల సినిమాలను దక్షిణాదిలోని భాషల్లోకి డబ్బింగ్ చెప్పేవాడు. అలాగే తమిళం, హిందీ, కన్నడ వంటి ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదమయ్యే చిత్రాల హీరోలకు డబ్బింగ్‌ చెప్పేవాడు. తెలుగు సినిమాల్లో ప్రతి నాయకులకు కూడా గాత్రం అందించి మెప్పించాడు.

వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పిన ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, కార్తి‌, విక్రమ్‌.. ఇలా మరెందరో స్టార్ హీరోలకు పనిచేసాడు. బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లకు కూడా ఆయన గొంతు బాగా సరిపోయేది. 1998లో వచ్చిన శివయ్య సినిమాలో రాజశేఖర్‌కు డబ్బింగ్‌ చెప్పాడు. ఈ సినిమాకు గాను ఆయనకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు వరించింది. సహాయనటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించాడు.

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, ఉయ్ కొడతారా? ఉలిక్కి పడతారా? తమిళ డబ్బింగ్ చిత్రాలకు శ్రీనివాస మూర్తి గాత్రం అందించాడు. అమితాబ్ బచ్చన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తెలుగు చిత్రానికి కూడా ఆయన డబ్బింగ్ చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జన్మించిన ఆయన తెలుగుతో పాటు ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. శ్రీనివాస మూర్తి తండ్రి ఎ.వి.ఎన్.మూర్తి కూడా ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు.

సినిమాలు

[మార్చు]
  • వివేకం
  • ఆశ ఆశ ఆశ
  • ఎంత వాడు గాని
  • గ్యాంబ్లర్‌
  • ఆవేశం
  • వాలి
  • రెడ్‌
  • ఆట
  • ఆరంభం
  • సింగం
  • సింగమ్‌ 2
  • సింగం 3
  • రాక్షసుడు
  • 24
  • వీడొక్కడే
  • ఆరు
  • నువ్వు నేను ప్రేమ
  • అపరిచితుడు
  • స్వామి 2
  • మల్లన్న
  • ఇంకొకడు
  • శివ తాండవం
  • మా ఆయన బంగారం
  • సింహరాశి
  • ఆయుధం
  • మా అన్నయ్య
  • శివయ్య
  • శేషు
  • పీఎస్‌వీ గరుడ వేగ
  • సూర్యుడు
  • మెకానిక్‌ అల్లుడు

మరణం

[మార్చు]

52 ఏళ్ల శ్రీనివాస మూర్తి 2023 జనవరి 27న చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూత". web.archive.org. 2023-01-27. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)