Jump to content

వెయ్ దరువెయ్

వికీపీడియా నుండి
వెయ్ దరువెయ్
దర్శకత్వంనవీన్ రెడ్డి
కథనవీన్ రెడ్డి
నిర్మాతదేవరాజు పొత్తూరు
తారాగణం
ఛాయాగ్రహణంముత్యాల సతీష్
కూర్పుఎస్ బి ఉద్దవ్
సంగీతంభీమ్స్
నిర్మాణ
సంస్థ
సాయి తేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
15 మార్చి 2024 (2024-03-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

వెయ్ దరువెయ్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సాయి తేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దేవ్ రాజ్ పోతూరు నిర్మించిన ఈ సినిమాకు నవీన్ రెడ్డి  ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.[1] సాయిరామ్ శంకర్, యష శివకుమార్, సునీల్, హెబ్బా పటేల్, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 16న విడుద‌ల చేయగా[2] సినిమాను 2024 మార్చి 5న విడుదల చేశారు.

కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్ (సాయిరామ్ శంకర్) ఉద్యోగం కోసం హైదరాబాద్‌లోని తన మామ (సత్యం రాజేష్)తో కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ సరదాగా గడిపేస్తూ ఉంటాడు. అయితే అతనికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ లేకపోవడంతో ఏదైనా డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ ను తీసుకొని జాబ్ చేయాలనుకుంటాడు. అలా ఫేక్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తుండగా శృతి (యషా శివకుమార్) పరిచయమై అది ప్రేమగా మారుతుంది. శృతి కూడా ఫేక్ సర్టిఫికేట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సంపాధిస్తుంది. కామారెడ్డి శంకర్ ఆ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం సంపాధించారా ? అసలు శంకర్ సిటీకి వచ్చింది ఉద్యోగం కోసమా ? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

షూటింగ్

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో 2022 జూన్ 24న ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్‌ క్లాప్‌నిచ్చారు. అల్లరి నరేష్‌ స్విచ్చాన్‌ చేయగా, విశ్వక్‌సేన్‌ గౌరవ దర్శకత్వం వహించాడు.[4] 'వెయ్ దరువెయ్' సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను నటుడు నాగ చైతన్య విడుదల చేయగా,  నటుడు సాయిధరమ్ తేజ్  టీజర్‌ను విడుదల చేశాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సాయి తేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: దేవరాజు పొత్తూరు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ రెడ్డి[7]
  • సంగీతం: భీమ్స్
  • సినిమాటోగ్రఫీ: ముత్యాల సతీష్
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: జనగాని కార్తీక్‌, శ్రీపాల్‌ చొల్లేటి

మూలాలు

[మార్చు]
  1. NAMASTE TELANAGAN (25 December 2022). "క్రిస్మస్ విషెస్‌తో సాయిరాంశంకర్ వెయిదరువెయ్‌ అప్‌డేట్‌". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  2. 10TV Telugu (16 February 2023). "'వెయ్ దరువేయ్' టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న సాయిరామ్ శంకర్." (in Telugu). Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. 10TV Telugu (15 March 2024). "'వెయ్ దరువెయ్' మూవీ రివ్యూ.. సాయిరామ్ శంకర్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉంది?" (in Telugu). Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. NTV Telugu (24 June 2022). "'వెయ్ దరువెయ్' అంటున్నసాయిరామ్ శంకర్". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
  5. Sakshi (17 February 2023). "దరువెయ్‌ బాగా వచ్చింది – సాయిరామ్‌ శంకర్‌". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
  6. Eenadu (14 March 2024). "మంచి ఆలోచనతో తెరకెక్కిన చిత్రమిది". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
  7. Chitrajyothy (11 March 2024). "రెండున్నర గంటల ఎంటర్టైనర్‌". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.