కృష్ణాష్టమి (సినిమా)
కృష్ణాష్టమి | |
---|---|
దర్శకత్వం | వాసు వర్మ |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | సునీల్ నిక్కీ గల్రానీ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
సంగీతం | దినేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 19 ఫిబ్రవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణాష్టమి 2016, ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, నిక్కీ గల్రానీ, డింపల్ చొపడా ప్రధాన పాత్రల్లో నటించగా, దినేష్ సంగీతం అందించాడు.[1]
కథా సారాంశం
[మార్చు]చిన్నప్పటి నుంచి తన కుటుంబానికి దూరంగా ఉన్న కృష్ణవరప్రసాద్ (సునీల్) అమెరికాలోనే చదువుకుని అక్కడే పెద్దవాడవుతాడు. కృష్ణవరప్రసాద్ భారతదేశానికి రాకుండా అమెరికాలోనే ఉండేందుకు కృష్ణ పెళ్లి కూడా అక్కడే చేయాలనుకుంటారు. కానీ, కృష్ణ అక్కడినుండి భారతదేశానికి బయల్దేరుతాడు. దారి మధ్యలో కలిసిన పల్లవి (నిక్కి గల్రాని)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇక్కడికి రాగానే కృష్ణ మీద అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన అజయ్ (అజయ్) ని ఇంటికి తీసుకుని వెళ్లగా, ఆ ఇంటివారే తన మీద అటాక్ చేయించాడని కృష్ణకు తెలుస్తుంది. అసలు, కృష్ణ మీద ఎందుకు అటాక్ చేశారు, అతణ్ని అమెరికాలోనే ఎందుకు చదివించాల్సివచ్చింది, ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- సునీల్ (కృష్ణ వర ప్రసాద్)
- నిక్కీ గల్రానీ (పల్లవి)
- డింపల్ చొపడా (ప్రియ)
- అశుతోష్ రాణా
- ముకేష్ రుషి
- పవిత్ర లోకేష్
- తులసి
- పోసాని కృష్ణ మురళి
- బ్రహ్మానందం
- సప్తగిరి
- పృథ్వీ
- హర్ష
- అజయ్
- చందు తుములూరు
- శివన్నారాయణ నారిపెద్ది
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వాసు వర్మ
- నిర్మాత: దిల్ రాజు
- సంగీతం: దినేష్
- ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
- నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పాటలు
[మార్చు]రాజమండ్రిలో ఉన్న గోదావరి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన మైత్రీ వారికోత్సవంతో ఈ చిత్ర పాటలు, ట్రైలర్ విడుదల చేయబడింది.[2]
పాట | గాయకులు[3] |
---|---|
గోకుల తిలకా | రేవంత్ |
లవ్ ఈజ్ ట్రూ | అద్నాన్ సమీ |
బావా బావా పన్నీరు | ధనుంజయ్, రమ్య బెహరా |
నువ్వు నేను అంతే | విజయ్ ప్రకాష్, రమ్య బెహరా |
కృష్ణాష్టమి | రేవంత్, నోయిల్, రోహిత్ పరిటాల |
లెఫ్టో పంజాబి డ్రెస్సు | దివ్య కుమార్, మమతా శర్మ |
వసూళ్ళు
[మార్చు]భారతదేశంలో
[మార్చు]ఈ చిత్రంలో తొలిరోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 3.5 కోట్లు వసూలు చేసి, సునీల్‌కు మర్యాద రామన్న సినిమా తర్వాత అత్యధిక వసూళ్ళు చేసిన రెండవ ఉత్తమచిత్రంగా నిలిచంది. ఈ చిత్రం తొలివారంలో రూ. 6 కోట్లు వసూలు చేసింది.[4]
విదేశాల్లో
[మార్చు]తొలివారంలో యునైటెడ్ లో బాక్సాఫీస్ 29,382 డాలర్లు వసూలు చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle, Entertainment (30 January 2016). "Sunil's next pushed further" (in ఇంగ్లీష్). Suresh Kavirayani. Retrieved 26 December 2019.
- ↑ "Krishnashtami theatrical trailer impresses - Times of India". The Times of India. Retrieved 26 December 2019.
- ↑ "Krishnashtami Songs (2016)". AllIndiaSongs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-09. Archived from the original on 1 October 2018. Retrieved 26 December 2019.
- ↑ "Krishnashtami' box office collections rise to Rs 6 crore in opening weekend and ended up with 10 crore gross". financial express news. 22 February 2016.
- ↑ Krishnashtami US box office collection