కనబడుటలేదు
కనబడుటలేదు | |
---|---|
దర్శకత్వం | ఎం.బాలరాజు |
నిర్మాత | సాగర్ మాచనూరు సతీష్ రాజు దిలీప్ కూరపాటి డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు దేవీప్రసాద్ బలివాడ |
తారాగణం | సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్ వీరెల్ల, హిమజ |
ఛాయాగ్రహణం | సందీప్ బద్దుల |
కూర్పు | రవితేజ కూర్మన |
సంగీతం | మధు పొన్నస్ |
నిర్మాణ సంస్థలు | ఎస్.ఎస్ ఫిల్మ్స్ శ్రీ పాద క్రియేషన్స్ షేడ్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 13 ఆగస్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కనబడుటలేదు 2021లో విడుదల కానున్న క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా.సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ బ్యానర్లపై సాగర్ మాచనూరు, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు, దేవీప్రసాద్ బలివాడ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎం.బాలరాజు దర్శకత్వం వహించాడు. సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్ వీరెల్ల, హిమజ ప్రధాన పాతరాల్లో నటించారు. ఈ సినిమాట్రైలర్‌ను 2021 ఆగష్టు 8న విడుదల చేసి,[1] సినిమాను ఆగష్టు 13న విడుదల చేయనున్నారు.
కథ
[మార్చు]శిశిత, సూర్య ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే శిశితను ఆదిత్య అనే మరో అబ్బాయి ప్రేమిస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ సంగతి కుటుంబంతో పాటు ఆదిత్యకు తెలుస్తోంది. దీంతో ఓ రోజు శిశిత, సూర్య ఇద్దరు ఇంటి నుంచి పారిపోదామని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే శిశిత రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. ఇంటి నుంచి బయలు దేరిన సూర్య మాత్రం స్టేషన్‌కు చేరుకోడు. ఆ రోజు నుంచి సూర్య కనబడకుండా పోతాడు. దీంతో ఈ కేసు మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ఛేదనలో డిటెక్టివ్ రామకృష్ణ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?? సూర్య ఆచూకీని డిటెక్టివ్ రామకృష్ణ కనుగొన్నాడా ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- సునీల్ - డిటెక్టివ్ రామ కృష్ణ
- వైశాలి రాజ్ - శశిధ[2]
- సుక్రాంత్ వీరెల్ల- సూర్య, శశి ప్రేమికుడు
- హిమజ- శశి వదిన
- యుగ్ రామ్ - ఆదిత్య, శశి భర్త
- ప్రవీణ్
- రవి వర్మ - నిఖిల్
- కిరీటి దామరాజు
- కంచరపాలెం కిషోర్
- కంచరపాలెం సుబ్బారావు - మావయ్య
- కిషోర్ కుమార్ పొలిమెర - సీఐ విక్టర్ రాజు
- శశిత్ కోన
- నీలిమ పాలిశెట్టి
- సౌమ్య శెట్టి
- ఉమా మహేశ్వర రావు
- కంచరపాలెం శ్యామ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.ఎస్ ఫిల్మ్స్
శ్రీ పాద క్రియేషన్స్
షేడ్ స్టూడియోస్ - నిర్మాతలు: సాగర్ మాచనూరు
సతీష్ రాజు
దిలీప్ కూరపాటి
డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు
దేవీప్రసాద్ బలివాడ - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాలరాజు
- సినిమాటోగ్రఫీ:సందీప్ బద్దుల
- ఎడిటింగ్: రవితేజ కూర్మన
- పాటలు: చంద్ర బోస్, మధు నందన్ బి.పూర్ణ చారి
- సంగీతం: మధు పొన్నస్
సౌండ్ ట్రాక్
[మార్చు]మధు పొన్నాస్ సంగీతం అందించారు.
సం. | పాట | పాట రచయిత | సింగర్(లు) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తొలిసారి నేనే" | చంద్రబోస్ | హరిచరణ్ | 4:42 |
2. | "అమ్మమో ఏం అమ్మాయో" | మధు నందన్ బి. | గోల్డ్ దేవరాజ్ | 4:18 |
3. | "మామా మామా" | మధు నందన్ బి. | రాహుల్ నంబియార్ | 4:05 |
4. | "ఎదకేమై ఉంటుందే" | పూర్ణ చారి | కార్తీక్ | 4:09 |
5. | "ప్రేమే లేదు" | మధు నందన్ బి. | రాహుల్ సిప్లిగంజ్, రవిప్రకాశ్ చోడిమల్ల | 4:41 |
విడుదల
[మార్చు]ఈ చిత్రం మొదట 2021 ఏప్రిల్ 14 న విడుదల కావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[3] విడుదల తేదీని 13 ఆగస్టు 2021 గా రీషెడ్యూల్ చేశారు, కానీ 2021 ఆగస్టు 19 కు వాయిదా వేశారు.[4]
రిసెప్షన్
[మార్చు]క్రైమ్ థ్రిల్లర్ మైనస్ థ్రిల్స్ గా తెరకెక్కిన ఈ సినిమాకు 5కి 2 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు శ్రావణ్ వనపర్తి. వనపర్తి ఇలా వ్రాశాడు: "కథ కాగితం మీద బలంగా అనిపించినా, కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తించడంతో, ఎగ్జిక్యూషన్ లోపించింది." ఈనాడుకు చెందిన ఒక సమీక్షకుడు సునీల్, వైశాలి రాజ్ ల నటనను మెచ్చుకున్నప్పటికీ కథ, స్క్రీన్ ప్లేను విమర్శించాడు. ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్ క్రిటిక్ సూర్య కుమార్ జోష్యుల ఈ సినిమాలో సునీల్ ను తక్కువగా వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. డైరెక్షన్ పార్ట్స్ లో ఆకట్టుకోగా, ఓవరాల్ గా కథన శైలి సినిమాను కిందికి లాగిందని జోష్యుల తెలిపారు. 123telugu.com తన సమీక్షను ఇలా ముగించారు: "మొత్తం మీద, మంచి కథాంశం ఉన్నప్పటికీ, కొన్ని నిరాశపరిచే ఎగ్జిక్యూషన్, అధ్వాన్నమైన డబ్బింగ్ వల్ల చెడగొట్టబడింది కనబడుటలేదు. సెకండాఫ్ లో సునీల్ కాస్త అర్థవంతంగా కనిపిస్తాడు కానీ సినిమా చెడిపోకుండా కాపాడటానికి అది సరిపోదు" అన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (10 August 2021). "Kanabadutaledu: ఈ కథలో హీరోల్లేరు అందరూ విలన్లే..! - telugu news kanabadutaledu trailer out now". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
- ↑ Mana Telangana (17 August 2021). "పక్కింటి అమ్మాయి పాత్రలో నటించా". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ Rao, Samba Siva (2021-03-31). "April Release Movies: ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే." HMTV.
- ↑ "'Kanabadutaledu': Release date postponed". NTV. 2021-08-11. Archived from the original on 2021-09-25. Retrieved 2023-12-06.