ఎస్. ఎస్. రాజమౌళి
ఎస్.ఎస్. రాజమౌళి | |
---|---|
![]() ముంబైలో జరిగిన బాహుబలి సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో ఎస్. ఎస్. రాజమౌళి | |
జననం | 1973,అక్టోబర్ 10![]() | 1973 అక్టోబరు 10 /
వృత్తి | సినిమా దర్శకుడు,సినిమా నిర్మాత |
వేతనం | దాదాపు చిత్రానికి 12 కోట్లు |
జీవిత భాగస్వామి | రమా రాజమౌళి. |
పిల్లలు | కార్తికేయ/మయూశ |
వెబ్ సైటు | ss-rajamouli.com ss ఈగ సినిమా |
ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత[1]. ఎన్.టి.ఆర్ (జూనియర్)తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.రాజమౌళి తీసిన బాహుబలి(ది బిగినింగ్) మరియు బాహుబలి(ది కంక్లూజన్)సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.బాహుబలి(ది కంక్లూజన్) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్షరాలా1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం.
విషయ సూచిక
రాజమౌళి చిత్రాలు[మార్చు]
సంవత్సరం | చిత్రం | నటీనటులు | విశేషాలు |
---|---|---|---|
2001 | స్టూడెంట్ నంబర్ 1 | జూనియర్ ఎన్.టి.ఆర్., గజాలా, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు | |
2003 | సింహాద్రి | జూనియర్ ఎన్.టి.ఆర్., భూమిక, అంకిత, నాజర్, ముఖేష్ రిషి | |
2004 | సై | నితిన్, జెనీలియా, శశాంక్, రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్ | |
2005 | ఛత్రపతి | ప్రభాస్, శ్రియా, భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్ | |
2006 | విక్రమార్కుడు | రవితేజ, అనుష్క శెట్టి, అజయ్, వినీత్ కుమార్, బ్రహ్మానందం | |
2007 | యమదొంగ | జూనియర్ ఎన్.టి.ఆర్., ప్రియమణి, మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం | |
2009 | మగధీర | రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్ | |
2010 | మర్యాద రామన్న | సునీల్, సలోని, నాగినీడు, సుప్రీత్, వేణుగోపాల్ | |
2011 | రాజన్న | అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ అన్నీ | పోరాట సన్నివేశాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు |
2012 | ఈగ | నాని, సమంత, సుదీప్ | తమిళంలో నాన్ ఈ పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది |
2015 | బాహుబలి :ది బిగినింగ్ | ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా | 2015 జూలై 10 విడుదలైనది |
2017 | బాహుబలి: ది కంక్లూషన్ | ప్రభాస్, అనుష్క శెట్టి, దగ్గుబాటి రానా | 2017 ఏప్రెల్ 28న విడుదలైంది |
2019 | ఆర్.ఆర్.ఆర్ | జూ ఎన్టీఆర్,రాం చరణ్,
ఆలియా భట్, ఎడ్గార్ జోన్స్ ||నిర్మాణ దశలో ఉంది |
పురస్కారాలు[మార్చు]
- పద్మశ్రి
- జాతీయ పురస్కారాలు
- ఉత్తమ తెలుగు చిత్రం - ఈగ
- జాతీయ ఉత్తమ చిత్రం - బాహుబలి: ది బిగినింగ్
- నంది పురస్కారాలు
- ఉత్తమ దర్శకుడు - మగధీర
- దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్
- ఉత్తమ తెలుగు దర్శకుడు - మగధీర
- సినీ"మా" అవార్డ్
- ఉత్తమ దర్శకుడు -మగధీర
- ఇతర అవార్డులు
- స్టార్ వరల్డ్ ఇండియా - ఉత్తమ చిత్రం - ఈగ
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
- Articles using infobox person with unsupported parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- తెలుగు సినిమా దర్శకులు
- 1973 జననాలు
- నంది ఉత్తమ దర్శకులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా దర్శకులు