కె.కె.సెంథిల్ కుమార్
కె. కె. సెంథిల్ కుమార్ | |
---|---|
![]() కె.కె.సెంథిల్ కుమార్ చిత్రం | |
జననం | |
విద్యాసంస్థ | ఫిల్ం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
వృత్తి | ఛాయాగ్రహణం |
బిరుదు | ఇండియన్ సొసైటీ ఫర్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) |
కె.కె.సెంథిల్ కుమార్ భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.
జీవిత విశేషాలు[మార్చు]
కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. కపిల్ దేవ్ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. అతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో అతను ఒకరు.[1]
అతను పూణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఛాయాగ్రహణంలో డిగ్రీ పొందాడు.[2]
తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. అతనికి సినీరంగ నేపథ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.
అతడు అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన ప్రేమకు వేళాయెరా. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. అతడు టెలివిజన్ సీరియల్ అమృతం లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.[1]
అతడు 2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఐతే ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా ఎస్. ఎస్. రాజమౌళి తన సినిమా సైలో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
అతనికి ఎక్కువగా ఎస్. ఎస్. రాజమౌళి చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన సై (2004), ఛత్రపతి (2005), యమదొంగ (2007), మగధీర (2009), ఈగ (2012), బాహుబలి:ద బిగినింగ్ (2015) లలో పనిచేసాడు.[3] 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన ఈగ సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది.[4][5] జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
అతడు తెలంగాణ లోని బొల్లారం,సికింద్రాబాదులో జన్మిచాడు. అతనికి గల ముగ్గురు సహోదరులలో అతడు పెద్దవాడు. అతని తండ్రి కృష్ణమూర్తి. అతడు యోగా బోధకురాలైన "రుచి"ని 2009 జూన్ 25 న వివాహమాడాడు. ఆమె హైదరాబాదు డివిజన్ లో భారత్ ఠాకూర్ యోగా తరగతులను నిర్వహిస్తుంది. వారికి ఇద్దరు కుమారులు.
సినిమాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు |
---|---|---|---|
2003 | ఐతే | తెలుగు | చంద్రశేఖర్ యేలేటి |
2004 | సై | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2005 | ఛత్రపతి | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2006 | అశోక్ | తెలుగు | సురేందర్ రెడ్డి |
2007 | యమదొంగ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2008 | త్రీ | తెలుగు | శేఖర్ సూరి |
2009 | అరుంధతి | తెలుగు | కోడి రామకృష్ణ |
2009 | మగధీర | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2010 | తకిట తకిట | తెలుగు | శ్రీహరినాయుడు |
2011 | గోల్కొండ హైస్కూల్ | తెలుగు | ఇంద్రగంటి మోహన కృష్ణ |
2012 | ఈగ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2013 | రఫ్ | తెలుగు | సి.హెచ్.సుబ్బారావు |
2015 | బాహుబలి:ద బిగినింగ్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2017 | బాహుబలి ద కంక్లూజన్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2018 | మామాంకం | మలయాళం | సంజీవ్ పిళ్లై |
2019 | కర్ణన్ | మలయాళం | ఆర్.ఎస్.విమల్ |
పురస్కారాలు[మార్చు]
- దక్షిణ భారతదేశ అంతర్జాతీయ సినిమా పురస్కారాలు
- సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - ఈగ (2012)
- సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - బాహుబలి: ది బిగినింగ్ (2015)
- సైమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
- ఫిలింఫేర్ పురస్కారం - దక్షిణం
- విజేత— బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - మగధీర (2010)
- విజేత— బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - బాహుబలి:ద బిగినింగ్ (2015)
- సిని'మా' పురస్కారాలు
- సిని'మా' అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - మగధీర (2010)
- సిని'మా' అవార్డు ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - యమదొంగ (2008)
- ప్రెంచ్ పురస్కారం
- ఫ్రెంచి సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‍మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (AFFECT) వారు అందించే రవి కె.పోట్డార్ అవార్డును ఈ సారి సెంథిల్ కుమార్ అందుకున్నారు. 2015 అక్టోబరు 13న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఇండియన్ సినిమా పరిశ్రకు విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు అందజేసారు. గతంలో గోవింద నిహలానీ, ఆర్ ఎం. రావు లాంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.[6]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Senthil Kumar interview - Telugu Cinema interview - Telugu film cinematographer". www.idlebrain.com. Retrieved 2018-03-30.
- ↑ "Telugu Cinematographer K K Senthil Kumar | Nettv4u". nettv4u. Retrieved 2018-03-30.
- ↑ "KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net". cinegoer.net. Archived from the original on 2016-03-04. Retrieved 2018-03-30.
- ↑ "SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news". idlebrain.com.
- ↑ "'Eega is one of the most difficult films I have shot'". Rediff. 5 July 2012. Archived from the original on 6 ఏప్రిల్ 2016. Retrieved 30 మార్చి 2018.
- ↑ "'బాహుబలి' సినిమాటోగ్రాఫర్‌కు ఫ్రెంచి పురస్కారం". telugu.filmibeat.com. 2015-10-16. Retrieved 2018-03-30.