బాహుబలి:ద బిగినింగ్

వికీపీడియా నుండి
(బాహుబలి (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాహుబలి
దర్శకత్వం ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత శోభు యార్లగడ్డ
ప్రసాద్ దేవినేని
కె. రాఘవేంద్రరావు
(సమర్పణ)
రచన విజయేంద్ర ప్రసాద్
తారాగణం ప్రభాస్
రానా దగ్గుబాటి
అనుష్క
తమన్నా భాటియా
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం కె. కె. సెంథిల్ కుమార్
స్టూడియో ఆర్కా మీడియా వర్క్స్
పంపిణీదారు ఆర్కా మీడియా వర్క్స్
విడుదలైన తేదీ 2015 (2015)
దేశం భారత దేశం
భాష తెలుగు
తమిళం
పెట్టుబడి INR250 కోట్లు[1]

తెలుగు సినిమా కి టెక్నాలజీ పరంగా కొత్త హంగులు దిద్దిన దర్శక ధీర ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రూపు దిద్దుకుంటున్న చిత్రం బాహుబలి. ఈ సినిమాని దర్శకేంద్రులు కె.రాఘవేంద్ర రావు సమర్పించగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా వర్క్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఏక కాలంలొ తెలుగు మరియు తమిళం భాషలలొ చిత్రీకరించుచున్నరు. అంతే గాకా ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషలలోను ఇంకా హిందీ భాషలోను అనువదించుచున్నారు.ఈ చిత్రానికి సంగీతాన్ని రాజమౌళి ఆస్థాన సంగీత విద్వాంసుడు అయిన ఎం.ఎం.కీరవాణి అందించగా జాతీయ అవార్డు గ్రహీత అయిన సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్నారు.

ప్రధాన తారాగణం[మార్చు]

సినిమా ప్రచారం[మార్చు]

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెకిస్తున్న ఈ చిత్రరాజాన్ని మొదులు పెట్టిన నాటి నుంచి ఈ సినిమాని నిత్యం ప్రచార మాద్యమాలలో ఎల్లప్పుడు కానవస్తూనే వున్నది. ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలని అచరణలో ఉంచారు ఈ చిత్ర నిర్మాతలు. మొదట ప్రభాస్ జన్మదినం సందర్భంగా సినిమా యొక్క మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు అది మొదలుకొని నిత్యం ఏదో ఒక సందర్భన్ని పురస్కరించుకొని సినిమా ని జనాన్ని అనుసందానిస్తూనే వున్నారు చిత్ర నిర్మాతలు. ఆ తరువాత అనుష్క జన్మదినం సందర్భంగా ఒక వీడియో, రానా జన్మదినం సందర్భంగా ఒక వీడియో [2][3][4][5][6][7] , తమన్నా జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్, ఇంకా దేశ రాజధానిలో జరిగిన ప్రఖ్యాత "కామిక్ కాన్" సమ్మేళనంలో బాహుబలి మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది[8][9].

తారాగణం[మార్చు]

 • కథ: విజయేంద్రప్రసాద్
 • కళ: సాబు సిరిల్
 • కెమెరా: సెంథిల్ కుమార్
 • సంగీతం: ఎంఎం కీరవాణి
 • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
 • పోరాటాలు: పీటర్ హెయిన్స్
 • సమర్పణ: కె రాఘవేంద్రరావు
 • నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 • కథనం, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

బాల్యంలో చదువుకున్న చందమామ కథతో మస్తిష్కంలో మెదిలిన ఊహాలోకాన్ని తెరపై ఆవిష్కరించేందుకు -దర్శకుడు రాజమౌళి పడిన రేయింబవళ్ల తపన. రెండు గంటల దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించేందుకు వందల నిపుణులు అహరహం శ్రమించిన -రెండేళ్ల కష్టం. ప్రపంచస్థాయి సినిమాతో పోటీ పడే దమ్ము, దస్కం తెలుగు పరిశ్రమకూ ఉన్నాయని నిరూపించేందుకు నిర్మాతలద్వయం చేసిన -ప్రయత్నం. ఒక అద్భుత ఆవిష్కరణలో భాగస్వామ్యం కోసం కాల్షీట్ల లెక్కలు చూసుకోకుండా -రెండేళ్ల కాలాన్ని కేటాయించిన నటబృందం. రాజమౌళి ప్రాజెక్టు కోసం రీళ్లెత్తిన కూలీలంతా -తామూ బాహుబలులే అన్నంతగా లీనమైన వైనం. ఇదంతా -ప్రేక్షకుడి నేత్రద్వయానికి రాజరికపు విందు అందించాలన్న ఆలోచనే.ఈ అంచనాలే -ప్రాజెక్టుపై ఆశల్ని శిఖరాల అంచులకు చేర్చింది. మునె్నన్నడూ లేని రీతిలో సినీ ప్రేక్షకుడికి ఊపిరాడకుండా చేసింది. బాహుబలిని అక్కున చేర్చుకోకుంటే -తెలుగు సినిమాకే ద్రోహం చేసినవాళ్లం అవుతామేమోనన్నంత సీరియస్‌గా ఆలోచనల్ని రేకెత్తించింది. వీటన్నింటినీ -బాహుబలి సంతృప్తిపర్చాడా? పరిమితుల్లేకుండా పెంచుకున్న నమ్మకానికి నిలువెత్తు దన్నునిచ్చాడా?

నాయకుడు నేలకొరిగితే -సేన చెదిరిపోతుంది. రాజమౌళి సైతం నమ్మిన యుద్ధతంత్రమిది. కానీ -సేన స్వతంత్రంగా బలపడితే నాయకుడిని నిర్వీర్యం చేసేస్తుంది. ఇదీ కుతంత్ర పోరాటపాఠమే. కాకపోతే రాజమౌళి ఈ పాఠాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ నాయకుడు -బాహుబలి కథ. సేన -కథలోని పాత్రలు. బాహుబలిలో పాత్రలు కండపుష్టితో కనిపించాయి. భుజబలాన్ని ప్రదర్శించాయి. స్వతంత్రంగా వ్యవహరించాయి. ఫలితంగా -నాయకుడిగా ఉండాల్సిన కథను నిర్వీర్యం చేసేశాయి. అంచనాల మేరకు ప్రేక్షకుడిని సంతృప్తిపర్చలేకపోయాయి. తెలుగు సినీ పరిశ్రమలో బాహుబలిది ప్రత్యేక అధ్యాయమే. ఇలా చెప్పుకోడానికి ఎలాంటి సంకోచాలూ అక్కర్లేదు. కాకపోతే -‘ప్రత్యేక’ అన్న పదాన్ని కొన్ని అంశాలకే పరిమితం చేయాల్సి ఉంటుంది. ‘కళ్లు’చెదిరే అద్భుతం బాహుబలి అనడంలోనూ సందేహాలు ఉండవు. విజువల్ ఫీస్ట్‌ను వండి వండించటంలో దర్శకుడు రాజమౌళి టీం ఎక్కడా నిరాశపర్చలేదు. కాకపోతే -కథను భావోద్వేగాల గమనంతో చెప్పే రాజమౌళి సిగ్నేచర్‌ను బాహుబలిలో వెతుక్కుంటే నిరాశపడక తప్పదు. అలాంటి సినిమాగా తోచదు కూడా. కారణం -హంగులను నమ్ముకున్నంత అతిగా కథను నమ్మలేకపోయాడు. పాత్రలను ఊహించుకున్నంత గొప్పగా -వాళ్లు సంచరించాల్సిన కథా ప్రాసాదాన్ని నిర్మించలేకపోయాడు. వాస్తవాన్ని విస్మరించి డ్రామకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేశాడు. (ఈ విషయంలో ‘ఈగ’ విజయం కూడా రాజమౌళిని తప్పుదోవ పట్టించిందని అనుకోవాలేమో).

కథను చెప్పడంలోను.. కథనాన్ని బలంగా నడిపించడంలోనూ -రాజమౌళి నేర్పరితనాన్ని, తెంపరితనాన్ని ఎవ్వరూ సందేహించరు. ఈ విషయంలో అతని స్టాండ్ ఎంత బలంగా ఉంటుందో ప్రూవ్ చేసుకున్నాడు కనుక. కాకపోతే, బాహువును మార్చుకున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజమౌళి కచ్చితంగా తప్పటడుగులు వేశాడు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు పెట్టిన కష్టం -ఎంచుకున్న కథకు ఆత్మను ఆపాదించడంలో పెట్టలేకపోయాడు. అందుకే -కొన్ని సన్నివేశాల్లో కాలయాపన కనిపిస్తుంది. మరికొన్ని సన్నివేశాల అవసరమే లేదనిపిస్తుంది. ఇంకొన్నిచోట్ల కథ బిగుసుకు పోయినట్టు అనిపిస్తుంది. ఇదంతా -చందమామ కథను చెప్పడంలో హిట్టయిన పాత ఫార్మాట్‌కు భిన్నమైన గమనాన్ని ఎత్తుకోవడం వల్ల ఎదురైన ఇబ్బంది అనుకోవాలి. ఆద్యంతాలు సుఖప్రదం, శుభప్రదంగా చూపించినపుడే -ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. బాహుబలి బిగినింగ్‌కు శుభప్రదమైన ‘కన్‌క్లూజన్’ లేని వెలితి కొట్టొచ్చినట్టు కనిపించింది. బాహుబలి (ప్రభాస్) భల్లాలదేవుని చేతిలో చనిపోయాడన్న విషయాన్ని ట్రెయిలర్స్‌లో రిజిస్టర్ చేసి -కట్టుబానిస కట్టప్ప నిజాయితీ వెన్నుపోటుకు బలైన దృశ్యాన్ని తెరపై ఆవిష్కరించడం పెద్ద కన్ఫ్యూజన్‌కు కారణమైంది. నిడివి పెద్దదైనా -బాహుబలి కన్‌క్లూజన్ కూడా బిగినింగ్ పార్టులోనే చూపించివుంటే ఫలితం ‘రెండు ముక్క’లయ్యేది కాదేమో. ప్రస్తుతం అందుకున్న ఫలితం కంటే కాస్త ఎక్కువే ఉండేదేమో.

పాత్రలు స్వరూపాన్ని, ప్రవర్తనను కథకుడు విజయేంద్రప్రసాద్ నిర్దేశించుకున్న తరువాత -ఆ ఆలోచనలకు అనుగుణంగా అల్లుకున్న కథ బాహుబలి అంటూ అనేక సందర్భాల్లో రాజమౌళి ప్రస్తావించడం కూడా ఒక మైనస్ పాయింట్. పాత్రల ధీరోదాత్తతకు భంగం వాటిల్లకుండా సన్నివేశాలు అల్లుకున్నారు. సన్నివేశాలు బలోపేతమైపోవడంతో -బలిష్టమైన కథ బలహీనపడినట్టు అనిపించింది. అందుకే సన్నివేశాలను విడివిడిగా చూస్తే భళా! అనిపించినా -కథాక్రమంలో చూస్తే మాత్రం ‘సోల్’ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. మహా శివలిగాన్ని ఉత్తిచేతులతో పెళ్ళగించి జలపాతం కిందకు చేర్చినపుడు.. వందడుగుల భల్లాలదేవ బంగరు విగ్రహాన్ని నిలబెడుతున్నపుడు.. అది నేలకొరుగుతున్న సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు శివుడు ప్రదర్శించిన బాహుబలం.. కాలకేయులతో యుద్ధ ఘట్టాలు.. -లాంటి సన్నివేశాలు గొప్పవే. అయినా వాటిలోని డ్రామా డామినేట్ చేసి ఆత్మావిష్కరణకు అడ్డుపడ్డాయి. అలాంటి సన్నివేశాలు బాహుబలి తెరనిండా పరుచుకున్నా -ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకున్న క్షణాలు లేవు. ఉత్కంఠ రేకెత్తించిన నిమిషాలూ మిస్సయ్యాయి. అకుంఠిత ప్రయత్నంతో శివుడు (ప్రభాస్) జలపాతాన్ని దాటినా.. సీన్ మొత్తం ఆర్ట్ఫిషియల్ అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్ కోసం అమితంగా కష్టపడ్డారనిపిస్తుంది. ఎవరికోసం అంత తపనపడి శివుడు నీటికొండను దాటాడో.. అక్కడ అతనికి ఎదురైన అవంతిక (తమన్నా) పాత్ర చిత్రణ, ఆమెని పరిచయం చేసిన తీరు.. శివుడి పరిచయంతో ఆమెలో వచ్చిన మార్పులు కృతకంగా తోస్తాయి. అయితే, ప్రేక్షకుల నాడి తెలిసిన తెలివైన దర్శకుడు కనుక -గ్యాప్పులు దాటే టైంలోనే మెరుపులు మెరిపించి ప్రేక్షకులకు ఒకింత సంతృప్తి అందించాడు. శివుడు తనెవరో తెలుసుకునే ఘట్టం.. దానికి ముందు పోరాట సన్నివేశం.. భద్రుడి తల నరికే దృశ్యం.. కట్టప్ప (సత్యరాజ్) చిన్నప్పుడు శివుడి పాదాల్ని తన తలపై పెట్టుకున్న దృశ్యాన్ని, ఒక వీరోచిత సందర్భంలో పెద్దయిన శివుడి పాదాన్ని తలపై ఉంచుకునే షాట్‌తో సింక్‌చేసి దర్శకుడిగా టాలెంట్ నిరూపించుకున్నాడు. బాహుబలి గాడిలో పడిందనుకుని ప్రేక్షకుడు కుదురుగా కూర్చునే సమయానికే -మళ్లీ ఎదురైన కొన్ని నీరసమైన సన్నివేశాలు అసంతృప్తికి కారణమయ్యాయి. అనవసరమైన ఐటెమ్ సాంగ్‌తో విసుగుకు గురయ్యాడు. కాలకేయులతో యుద్ధ ఘట్టంలో హాలీవుడ్ ఫ్రేమ్స్ కనిపించినా, తెలుగు సినిమా కోసం ఇంతటి తెగువ చూపిన దర్శకుడు లేడన్న ప్రశంసా రాజమౌళికి దక్కుతుంది. అలాగే, బాహుబలి బిగినింగ్ చూసిన తరువాత -కన్‌క్లూజన్‌లో రాచరికపు ఎమోషనల్ డ్రామా ఎక్కువేనన్న విషయం అర్థమవుతుంది. సో.. కన్‌క్లూజన్ చూస్తేగానీ బాహుబలి స్టామినా, స్థాయ ఏమిటన్నది కచ్చితంగా చెప్పలేం.

సగం కథతో సంతృప్తిపర్చాలంటే ఎవరికైనా కష్టమే. కొంత బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించినా -రాజమౌళి సంయమనంతో సాహసమే చేశాడు. కానీ -అసలు పాత్రలకంటే కథలోని సపోర్టింగ్ పాత్రలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే -శివగామి (రమ్యకృష్ణ), కట్టప్ప (సత్యరాజ్) పాత్రలకే ముందు బాహుబలి, భల్లాలదేవ పాత్రలు తేలిపోయినట్టు అనిపిస్తుంది. తారల ప్రతిభ: పాత్రలకు తగ్గట్టుగా ప్రభాస్ మెప్పించాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి నమ్మశక్యం కాని ఫీట్లు చేయించినా, ఆ ప్రభావం ప్రేక్షకుడిపై పడకుండా జాగ్రత్తపడ్డాడు. రాణా విలనీకి మంచి మార్కులు ఇవ్వొచ్చు. రాజమౌళి విలనిజం డిజైన్ రాణాలో కనిపించకున్నా -తనువున్న ప్రతి సీన్‌లోనూ ఒకే అనిపించుకున్నాడు. ఇక మొదటిపార్టును భుజస్కందాలపై మోసిన అసలు బాహుబలి -శివగామి. రమ్యకృష్ణ హైలెట్‌గా నిలవడమే కాదు, అభినయంతో నిండుదనాన్ని అందించింది. దేవసేన పాత్రతో అనుష్క ప్రేక్షకులకు బలంగా కనెక్టయిన సన్నివేశం ఒక్కటీ లేదు. కట్టప్పగా -జానపద చిత్రానికి తగిన మెరుగు అందించాడు సత్యరాజ్. తమన్నా క్యారెక్టర్ కాస్త బ్యాలెన్స్ తప్పింది. అవంతిక పాత్రతో ఆకట్టుకోలేకపోయింది. నాజర్, ప్రభాకర్ -ప్రేక్షకుడిని సంతృప్తిపర్చినట్టే. సాంకేతిక నైపుణ్యం: కంటికింపైన దృశ్యాలు అందించిన సాంకేతిక నిపుణులే -బాహుబలికి నిజమైన హీరోలు. విస్మయపర్చే సిజె వర్క్‌తో సినిమా స్థాయి పెంచేశారు. శ్రీనివాస మోహన్ విజువల్ ఎఫెక్ట్.. సెంథిల్‌కుమార్ ఫ్రేమింగ్ స్టయిల్.. సాబు సిరిల్ కళాత్మకత.. -వెరసి అద్భుతమైన మాహిష్మతి రాజ్యం ఆవిష్కృతమైంది. ఈ అద్భుతానికి కీరవాణి నేపథ్య సంగీతం అదేస్థాయిలో తోడైవుంటే -బాహుబలి రిపోర్టు కచ్చితంగా వేరుగా ఉండేది. ఈ విషయంలో కీరవాణి ఒకింత నిరాశపర్చాడు. చివరిగా... బాహుబలిలో ఎత్తిచూపే లోపాలన్నీ -కోడిగుడ్డుపై ఈకలు పీకడంలాంటివే. రెండేళ్ల కష్టాన్ని వెండితెరపై చూసి తీరాలన్న లక్షణాలకు బాహుబలిలో ఏమాత్రం లోటు కనిపించదు. అద్భుతమైన గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ సినిమాలకు ఎగబడుతున్న సినీ ప్రేక్షకులు -అంతటి గ్రాఫిగ్జాలాన్ని అందించిన బాహుబలిని అక్కున చేర్చుకోవచ్చు. భుజానికెత్తుకోవచ్చు. దానికి సంసిద్ధులమేనని ఆడియన్స్ ఇప్పటికే నిరూపిస్తున్నారు కూడా. అందుకే -బాహుబలికి బాక్సాఫీస్ దగ్గర సంకెల పడలేదు. రికార్డుల మోతలు ఆగలేదు. ఐదురోజుల కాలానికి 215 కోట్ల వసూలు దాటిసిందంటే.. -రాజమౌళి బాహుబలిని జనం బాహువుల్లోకి తీసుకున్నట్టే.

మూలాలు[మార్చు]

 1. Baahubali budget to go beyond 175 cr. - The Times of India Retrieved 8 September 2014
 2. "Watch: The making of SS Rajamouli's 'Baahubali'". CNN-IBN. 23 October 2013. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 3. Karthik, Pasupulate (14 December 2013). "Rana Baahubali making video goes viral". The Times of India. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 4. Shekhar (6 February 2014). "Baahubali New Video: Rajamouli Teaches How To Climb Elephant". entertainment.oneindia.in. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 5. Karthik, Pasupulate (23 October 2013). "Prabhas Bahubali first look goes viral". The Times of India. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 6. Sangeetha, Seshagiri (19 March 2014). "'Baahubali' Team's Video on Exam Tips Goes Viral". 
 7. Sangeetha Seshagiri (7 November 2013). "Anushka Shetty Gets 'Baahubali' Making Trailer, 'Rudhramadevi' First Look as Birthday Gifts [VIDEO+POSTER]". International Business Times. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 8. "Baahubali Motion Print". reveye.in. 7 February 2014. Retrieved 21 March 2014. 
 9. "IF ONLY YOU WERE A ‘BAAHUBALI’". wowsomeapp.com.