Jump to content

కె.శివ శంకర్

వికీపీడియా నుండి
కె .శివశంకర్
జననం (1948-12-07) 1948 డిసెంబరు 7 (వయసు 76)
మరణం28 నవంబర్ 2021
వృత్తినృత్య దర్శకుడు, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1975 - 28 నవంబర్ 2021
జీవిత భాగస్వామిసుగణ్యా
పిల్లలువిజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్
తల్లిదండ్రులుకల్యాణ సుందరం
కోమల ఆమల్

కె.శివ శంకర్ (శివశంకర్ మాస్టర్) భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు. శివశంకర్‌ మాస్టర్‌ భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన ఆయన 2009లో విడుదలైన మగధీర సినిమాలోని ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆయన 2003లో ఆలయ్‌ తమిళ సినిమాతో నటుడిగా పరిచమై తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి, టీవీ షోల్లో పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుండి జాతీయ అవార్డు అందుకుంటూ

జననం

[మార్చు]

శివశంకర్‌ 7 డిసెంబరు 1948న చెన్నైలో కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ దంపతులకు జన్మించాడు.

సినీ జీవితం

[మార్చు]

శివశంకర్ 1975లో ‘పాట్టు భరతమమ్‌’ సినిమాతో సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించి, 1977లో ‘కురువికూడు’ సినిమాతో నృత్య దర్శకుడిగా మారాడు. ఆయన దాదాపు 40 ఏళ్ళ సినీ రంగంలో తెలుగు, తమిళ సహా 10 భారతీయ భాషల్లో 800 లకు పైగా సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 28 నవంబర్ 2021న మరణించాడు.[1][2][3]

నృత్య దర్శకత్వం వహించిన పలు సినిమాలు

[మార్చు]

నటుడిగా తెలుగులో నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 November 2021). "ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత". Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
  2. TV9 Telugu (28 November 2021). "సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత." Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (29 November 2021). "ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూత - telugu news dance choreographer sivasankar is no more". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.