గ్యాంగ్ (2018 సినిమా)
గ్యాంగ్ | |
---|---|
దర్శకత్వం | విఘ్నేష్ శివన్ |
దీనిపై ఆధారితం | స్పెషల్ 26 ఆధారంగా |
నిర్మాత | కే. ఈ. జ్ఞానవేల్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | దినేష్ కృష్ణన్ |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థలు | స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 12 జనవరి 2018 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | 90 కోట్లు |
గ్యాంగ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లపై జ్ఞానవేల్ నిర్మించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. సూర్య , కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తిక్, బ్రహ్మానందం, నంద, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది.[1]
కథ
[మార్చు]తిలక్ (సూర్య), బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా, నకిలీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా రైడ్స్ చేస్తూ అవినీతి పరులకు వద్ద ఉండే బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీరి ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- సూర్య
- కీర్తి సురేష్
- రమ్యకృష్ణ
- ఆర్జే బాలాజీ
- కార్తిక్
- బ్రహ్మానందం
- నంద
- శివ శంకర్ మాస్టర్
- సుధాకర్
- కలైయరసన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్
- నిర్మాత: జ్ఞానవేల్
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విఘ్నేష్ శివన్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
- పాటలు: కె.కృష్ణకాంత్, శ్రీమణి, రామజోగయ్య శాస్త్రి
- గాయకులు: రేవంత్, రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర, శ్రీనిధి వెంకటేష్
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
- కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2018). "Gang Movie: Showtimes". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
- ↑ The Times of India (2018). "Gang Movie Review {3.5/5}: Critic Review of Gang". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
- ↑ Sakshi (12 January 2018). "మూవీ రివ్యూ: సూర్య 'గ్యాంగ్'". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.