అడివి శేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడివి శేష్
మేజర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా శేష్ 2022
జననం
అడివి శేష్ సన్నీ చంద్ర

(1985-12-17) 1985 డిసెంబరు 17 (వయసు 38)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణా)
విద్యాసంస్థశాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం

అడివి శేష్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. మరో దర్శకుడు అడివి సాయికిరణ్ కు తమ్ముడి వరస అవుతాడు.[1] ప్రముఖ రచయిత అడివి బాపిరాజు ఇతనికి ముత్తాత.

జీవితం[మార్చు]

అడివి శేష్ డిసెంబరు 17, 1985 లో ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదులో జన్మించాడు. అమెరికాలోని బర్కిలీ, కాలిఫోర్నియాలో పెరిగాడు. బర్కిలీ హైస్కూల్ లో చదువుకున్నాడు. ఉన్నత విద్య శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ విశ్వవిద్యాలయంలో చదివాడు.[2]

కెరీర్[మార్చు]

2002 లో విడుదలైన సొంతం సినిమాలో ఒక అతిథి పాత్ర ద్వారా అతని నట ప్రస్థానం ప్రారంభమైంది. 2010లో విడుదలైన కర్మ అనే సినిమా అతని కెరీర్ లో మొదటి ముఖ్యమైన చిత్రం. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి.[3] 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. తర్వాత బలుపు (2013) సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించాడు. తర్వాత స్వీయ దర్శకత్వంలో కిస్ అనే సినిమా చేశాడు. ఇది సరిగా ప్రేక్షకాదరణ పొందలేదు. 2015 లో లేడీస్ అండ్ జెంటిల్మన్, దొంగాట, బాహుబలి చిత్రాల్లో నటించాడు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర సహనటులు భాష గమనిక
2002 సొంతం వెంకట్ ఆర్యన్ రాజేష్, నమిత
2010 కర్మ: డు యు బిలీవ్? దేవ్ జేడ్ టేలర్ తెలుగు దర్శకుడు, రచయిత కూడా
తమిళం
2011 పంజా మున్నా పవన్ కల్యాణ్ తెలుగు
2013 బలుపు రోహిత్ రవితేజ తెలుగు
2013 కిస్ సన్నీ ప్రియా బెనర్జీ తెలుగు దర్శకుడు కూడా
2014 రన్ రాజా రన్ నయీమ్ బాషా శర్వానంద్ తెలుగు
2015 లేడీస్ అండ్ జెంటిల్ మెన్ రాహుల్ నికితా నారాయణ్ తెలుగు
2015 బాహుబలి భద్ర ప్రభాస్, తమన్నా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి తెలుగు
2015 తమిళం
2015 దొంగాట వెంకట్ మంచు లక్ష్మి తెలుగు
2015 సైజ్ జీరో శేఖర్ ఆర్య, అనుష్క శెట్టి తెలుగు అతిథి పాత్ర
2015 ఇంజి ఇడుపళగి తమిళం
2016 క్షణం రిషి అదా శర్మ తెలుగు సహ రచయిత కూడా
2016 ఊపిరి అభినవ్ అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా తెలుగు అతిథి పాత్ర
2016 తొళ తమిళం అతిథి పాత్ర
2017 అమీ తుమీ అనంత్ ఈషా రెబ్బ‌ తెలుగు
2018 గూఢచారి దులిపల శొబిత తెలుగు
2019 ఓ బేబీ సావిత్రి భర్త తెలుగు అతిథి పాత్ర
ఎవరు విక్రం వాస్‌దేవ్ తెలుగు
2022 మేజర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తెలుగు
హిట్ 2 కృష్ణదేవ్ ఐపీఎస్ "కేడీ" మీనాక్షి చౌదరి, రావు రమేశ్ తెలుగు

మూలాలు[మార్చు]

  1. Filmi, beat. "Profile of Adivi Sesh". Filmibeat. Oneindia. Retrieved 22 May 2016.
  2. "Happy birthday Adivi Sesh! Here is all you need to know about the underrated Telugu actor". The New Indian Express. 17 December 2018. Archived from the original on 24 ఆగస్టు 2019. Retrieved 24 August 2019.
  3. "Karma is for a niche audience". Rediff. Retrieved 29 November 2010.