నికితా నారయణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికితా నారయణ్

నికితా నారయణ్, ప్రముఖ భారతీయ నటి, మోడల్. తన 10వ ఏట నుంచీ మోడల్ గా పని చేస్తోంది ఆమె. 2011లో ఇట్స్ మై లవ్ స్టోరీ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది నికితా. ఆమె ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని, గెలిచింది.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం

[మార్చు]

కర్ణాటకలోనిబెంగళూరులో 19 మే 1992న కన్నడ కుటుంబంలో జన్మించింది ఆమె. నికితా తండ్రి ప్రకటనల, కార్పొరేట్ కమ్యూనికేషన్  ఫీల్డ్ లో పనిచేస్తాడు. ఆమె తల్లి ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకొంది. కానీ గృహిణిగానే ఉంది. నికితా ఒక చెల్లెలు కూడా ఉంది.[1]

హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేసింది నికితా.[2] బెంగుళూరులోని గోల్డ్ మాన్ సాచెస్ లో వ్యాపార విశ్లేషణలో కోర్సు చేసింది నికితా. ఆ తరువాత ఫేస్ బుక్ లో ఉద్యోగం చేసింది ఆమె. నికితా తన మొదటి సినిమా పూర్తయిన తరువాత, ఎమెజాన్.కాంలో పని చేసింది.[3]

బెంగుళూరు, మైసూరుచెన్నైవైజాగ్హైదరాబాదుల్లో పెరిగి, చదువుకుంది ఆమె. ఆమె బహు భాషా ప్రవీణురాలు. ఇంగ్లీష్హిందీ, కన్నడతెలుగుతమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నికితా.

కెరీర్

[మార్చు]

మోడలింగ్

[మార్చు]

నికితా తన 10వ ఏట మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. ప్రముఖ యాడ్ డైరెక్టర్ రాజీవ్ మీనన్ దర్శకత్వంలో అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు యాడ్ లో మొదటిసారి మోడల్ గా పని చేసింది ఆమె.[4] ఆ తరువాత ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ వంటి ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. 2009లో డాబర్ మిస్ ఫ్రెష్ ఫేస్ హైదరాబాద్ గా ఎంపికైంది. 2010లో మిస్ సౌత్ ఇండియా పోటీలో రెండో రన్నర్ అప్ గా గెలిచింది నికితా. 

మూలాలు

[మార్చు]
  1. "Nikitha Narayan | Unique Times Magazine". Uniquetimes.org. 2011-10-19. Retrieved 2015-02-17.
  2. "Nikitha Narayan". Business of Tollywood. 2011-07-19. Archived from the original on 2015-03-04. Retrieved 2015-02-17.
  3. "'I'd like to do a high-fashion film' - Rediff.com Movies". Rediff.com. 2015-02-06. Retrieved 2015-02-17.
  4. "Tryst with beauty". The Hindu. 2010-11-11. Retrieved 2015-02-17.