మేజర్ (సినిమా)
మేజర్ | |
---|---|
దర్శకత్వం | శశి కిరణ్ తిక్కా |
స్క్రీన్ ప్లే | అడివి శేష్ |
Dialogue by | అబ్బూరి రవి (Telugu) అక్షత్ అజయ్ శర్మ (హిందీ) |
కథ | అడివి శేష్ |
నిర్మాత | మహేష్ బాబు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వంశీ పట్చిపులుసు |
కూర్పు | వినయ్ కుమార్ సిరిగినీది కోదాటి పవన్ కళ్యాణ్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు | సోనీ పిక్చర్స్, జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ |
విడుదల తేదీ | 3 జూన్ 2022 |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, హిందీ |
మేజర్ సినిమా 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు, కానీ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేశారు.[1]ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలైంది.[2]
తారాగణం
[మార్చు]- సందీప్ ఉన్ని కృష్ణన్ గా అడివి శేష్
- శోభితా ధూళిపాళ్ల[3]
- సాయి మంజ్రేకర్[4][5]
- కె.ఉన్నికృష్ణన్ గా - ప్రకాష్ రాజ్[6]
- ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ గా రేవతి (నటి) [6]
- మురళి శర్మ[6]
పాటల జాబితా
[మార్చు]- హృదయమా, రచన: కృష్ణకాంత్, వి ఎన్ వీ రమేష్ కుమార్ , గానం. సిద్ శ్రీరామ్
- ఓహ్ ఇష, రచన: రాజీవ్ భరద్వాజ్ , గానం. అర్మన్ మాలిక్, చిన్మయి
- జన గణ మన, రచన: రాజీవ్ భరద్వాజ్, గానం. టోజన్ తోబీ
- కన్నా కన్నా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కె ఎస్ చిత్ర.
చిత్ర నిర్మాణం
[మార్చు]అడివి శేష్ హీరోగా, శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను 2021 ఏప్రిల్ 12న విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ,మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (26 May 2021). "'మేజర్' వాయిదా.. రిలీజ్ డేట్‌పై నిర్మాతల క్లారిటీ". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
- ↑ Eenadu (31 May 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ "Sobhita Dhulipala lands a role in 'Major' opposite Adivi Sesh". The News Minute. 3 March 2020. Retrieved 29 March 2020.
- ↑ "Saiee Manjrekar set to relive 26/11 horrors in Hindi-Telugu bilingual Major based on Major Sandeep Unnikrishnan". Mumbai Mirror.
- ↑ Taneja, Parina (24 September 2020). "Saiee Manjrekar to star in Hindi-Telugu bilingual film on 26/11 horrors titled Major". IndiaTV News.
- ↑ 6.0 6.1 6.2 "Adivi Sesh-starrer 'Major' To Release On July 2". News 18. 29 January 2021. Retrieved 29 January 2021.
- ↑ News18 Telugu (12 April 2021). "Adivi Sesh Major: అడివి శేష్ 'మేజర్' టీజర్ కోసం రంగంలోకి మహేష్ బాబు, సల్మాన్ ఖాన్..." Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)