గూఢచారి (2018 సినిమా)
| గూఢచారి | |
|---|---|
| దర్శకత్వం | శశి కిరణ్ తిక్క |
| రచన | అబ్బూరి రవి (మాటలు) |
| స్క్రీన్ ప్లే |
|
| కథ | అడివి శేష్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | శానియల్ దేవ్ |
| కూర్పు | గ్యారీ బిహెచ్ |
| సంగీతం | శ్రీచరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు |
|
| పంపిణీదార్లు | ఏకె ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 2018 ఆగస్టు 3 |
సినిమా నిడివి | 147 నిమిషాలు |
| దేశం | ఇండియా |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | ₹6 crore (US$7,50,000) |
| బాక్సాఫీసు | 30 కోట్లు (గ్రాస్) 10.5 కోట్లు (షేర్) |
అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం గూఢచారి 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]
కథ
[మార్చు]గోపి (అడివి శేష్) ‘రా’ అధికారి రఘువీర్ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్ చనిపోతాడు. రఘువీర్ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్ కుమార్ పేరు పెట్టి కడియపులంక వచ్చి అక్కడే పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్ రాదు.ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్ కొడుకుని అని మెన్షన్ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్ త్రినేత్ర 11గా అపాయింట్ అవుతాడు.అర్జున్ అపాయింట్ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద దుండగులు దాడి చేస్తారు. ఈ దాడిలో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్ కూడా మరణిస్తారు.ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్ బైక్ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆచారి మీద ఎటాక్ చేసిందిఎవరు.? అర్జున్ ఈ మిస్టరీని ఎలా చేదించాడు.? అన్నదే మిగతా కథ.[2]
తారాగణం
[మార్చు]- అడివి శేషు
- శోభితా ధూళిపాళ్ల
- ప్రకాష్ రాజ్
- సుప్రియ యార్లగడ్డ
- మధుశాలిని
- వెన్నెల కిశోర్
- జగపతి బాబు
- అనీష్ కురువిల్ల
- రాకేశ్ వర్రే
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "అనగనగా" | Ramesh Yadma | అంబికా శశిత్తల్ | 02:40 |
| 2. | "సఖియ" | Kittu Vissapragada | చరణ్ పాకాల యామిని ఘంటసాల | 03:30 |
| 3. | "హత" | Ramesh Yadma | లలిత చిలుకూరి | 02:42 |
| 4. | "గూఢచారి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్" | - | చరణ్ పాకాల | 02:57 |
| 7. | "రానా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్" | - | చరణ్ పాకాల | 00:57 |
| మొత్తం నిడివి: | 22:21 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Goodachari Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-04. Retrieved 2020-07-20.
- ↑ "'గూఢచారి' మూవీ రివ్యూ". Sakshi. 2018-08-03. Retrieved 2020-07-20.