గజాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గజాలా
వృత్తినటి, ఇంటీరియర్ డిజైనర్
జీవిత భాగస్వామిఫైజల్ రజా ఖాన్
కలుసుకోవాలని.. సినిమాలో ఉదయ్ కిరణ్ జంటగా గజాల

గజాలా ఒక భారతీయ సినీ నటి.[1] తెలుగు తోబాటు కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. 2001 లో జగపతి బాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె తర్వాత స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని, తొట్టిగ్యాంగ్, అల్లరి రాముడు తదితర చిత్రాల్లో నటించింది. 2002 లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది. 2010 దాకా అడపా దడపా చిత్రాల్లో నటించిన ఈమె తర్వాత మస్కట్ లో ఉన్న తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. 2016 ఫిబ్రవరి 24 న హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.

నేపధ్యము[మార్చు]

ఈమె మస్కట్లో జన్మించింది. తండ్రి నిర్మాణరంగంలో వ్యాపారవేత్త. బొంబాయి జుహూ లోని విద్యానిధి పాఠశాలలో ప్రాథమికవిద్య పూర్తి చేసింది. 2001లో నాలో ఉన్న ప్రేమ చిత్రంద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది.[2] హిందీ టీవీ నటుడైన ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది.

ఆత్మహత్యా ప్రయత్నం[మార్చు]

జులై 22, 2002 హైదరాబాదులోని బంజారా హిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.[3] ఆమె సహ నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి గుర్తించి నిమ్స్ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె బ్రతికి బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు.[4]

గజాలా నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "I don't see films as a career: Gajala". timesofindia.indiatimes.com. 15 January 2017. Retrieved 28 November 2018.
  2. "గజాలా పెళ్లి భాజాలు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 23 February 2016. Retrieved 28 November 2018.[permanent dead link]
  3. "South Indian actress Gajala to tie the knot with TV actor Faisal Khan". DNA.
  4. "Suicide bid by actress Gajala". thehindu.com. The Hindu. 23 July 2002. Retrieved 28 November 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=గజాలా&oldid=3727370" నుండి వెలికితీశారు