కొండవీటి దొంగ
కొండవీటి దొంగ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి[1] |
నిర్మాత | టి. త్రివిక్రమరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ), యండమూరి వీరేంద్రనాథ్ (చిత్రానువాదం) |
నటులు | చిరంజీవి, రాధ, విజయశాంతి |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల | మార్చి
9, 1990 [2] |
భాష | తెలుగు |
కొండవీటి దొంగ 1990 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. పరుచూరి సోదరులు కథ నందించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం సమకూర్చాడు.
కథ[మార్చు]
కొండవీడు అనే గిరిజన గ్రామంలో రాజా అనే పిల్లవాడి తల్లిదండ్రులను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. వాళ్ళు రాజా తండ్రిని చంపేసి ఆ నేరాన్ని తల్లి మీద మోపి జైలుకు పంపుతారు. రాజాని మాత్రం గూడెం నాయకుడు కాపాడతాడు. రాజా పట్నం వెళ్ళి బాగా చదువుకుని వస్తాడు. ఇంతకాలం తర్వాత కూడా అక్కడి ప్రజలు మోసానికి గురవుతూ ఉండటం గమనిస్తాడు. ఆ మోసాలకు కారణమవుతున్న శరభోజి, కాద్రా, అతని బృందంపై ఎదురు తిరగాలనుకుంటాడు. కానీ తనను కాపాడిన గూడెం నాయకుడు మాత్రం కొండవీటి దొంగగా అవతారం ఎత్తమని సలహా ఇస్తాడు. అలా రాజా కొండవీటి దొంగ వేషంలో ధనవంతుల దగ్గర సొమ్ము దొంగిలించి పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటాడు.
తారాగణం[మార్చు]
- రాజా/కొండవీటి దొంగగా చిరంజీవి
- విజయశాంతి
- రాధ
- శాంభవిగా శారద
- శ్రీవిద్య
- శరభోజిగా రావు గోపాలరావు
- మోహన్ బాబు
- కాద్రాగా అమ్రిష్ పురి
- గూడెం నాయకుడుగా కైకాల సత్యనారాయణ
- రంగనాథ్
- నాగేంద్ర బాబు
- అల్లు రామలింగయ్య
- చలపతి రావు
- దివ్యవాణి
- కె. కె. శర్మ
పాటలు[మార్చు]
- జీవితమే ఒక ఆట, సాహసమే పూ బాట
- చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
- శుభలేఖా రాసుకొన్నా ఎదలో ఎపుడో
- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ఇవి కూడా చూడండి[మార్చు]
చిరంజీవి నటించిన సినిమాల జాబితా
మూలాలు[మార్చు]
- ↑ "'కొండవీటి దొంగ'కు 30 ఏళ్లు". సితార. Retrieved 2020-04-19.[permanent dead link]
- ↑ "కొండవీటి దొంగ". bharat-movies.com. Archived from the original on 20 సెప్టెంబర్ 2017. Retrieved 16 October 2017. Check date values in:
|archive-date=
(help)