రామ్ చరణ్ తేజ
| రామ్ చరణ్ తేజ | |
మే 2015లో ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో చరణ్ | |
| జన్మ నామం | రామ్ చరణ్ తేజ |
| జననం | 1985 మార్చి 27 |
| ఇతర పేర్లు | చెర్రీ |
| భార్య/భర్త | ఉపాసన |
| పిల్లలు | క్లింకారా[1], శివరామ్, అన్వీరా దేవి |
| వెబ్‌సైటు | http://www.cherryfans.com/ |
| ప్రముఖ పాత్రలు | చరణ్ (చిరుత) బ్రూస్ లీ - ది ఫైటర్ కార్తీక్/బ్రూస్ లీ |
రామ్ చరణ్ తేజ భారతీయ సినిమా నటుడు. ఆయన indian cinema ప్రముఖ నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారత సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనరు, మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు[2].
రామ్ చరణ్ తేజకు వేల్స్ యూనివర్సిటీ 2024 ఏప్రిల్ 13న చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌ను అందించింది.[3][4]
రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చి 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు.[6] ఈ దంపతులకు 20 జూన్ 2023న మొదటి సంతానం కుమార్తె క్లిన్ కార జన్మించింది.[7] వారికీ 31 జనవరి 2026న కవలలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించారు.[8][9][10] అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టినట్లు ఫిబ్రవరి 11న రామ్ చరణ్ తేజ మీడియాకు వివరించాడు.[11]
ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునే ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికిగాను నాట్‌హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది.[12]
సినీ జీవితం
[మార్చు]చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత (సినిమా) చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.
ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది.ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రేండింగ్ లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ (సినిమా) చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి ఎవడు (సినిమా) చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ (సినిమా) చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్ కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు.2015 లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ లో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.2016 లో వచ్చిన ధృవ చిత్రం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు.2018 లో వచ్చిన రంగస్థలం చిత్రం లో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు ఆ చిత్రం విజయం తో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది.2019 లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలోవినయ విధేయ రామ చిత్రంలో నటించారు.
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయిక | ఇతర విశేషాలు | మూలం |
|---|---|---|---|---|---|
| 2007 | చిరుత | చరణ్ | నేహా శర్మ | విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం |
|
| 2009 | మగధీర | కాలభైరవ/హర్ష | కాజల్ అగర్వాల్ | విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము - ఉత్తమ నూతన నటుడు
విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం |
|
| 2010 | ఆరెంజ్ | రాం | జెనీలియా | ||
| 2011 | రచ్చ | "బెట్టింగ్" రాజ్ | తమన్నా | ||
| 2013 | నాయక్ | చరణ్
సిద్దార్థ్ నాయక్ |
కాజల్ అగర్వాల్ | ||
| 2013 | తుఫాన్ (జంజీర్) | విజయ్ | ప్రియాంక చోప్రా | తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్‌గా అనువదించబడింది | |
| 2014 | ఎవడు | సత్య
చరణ్ |
శృతి హాసన్ | ||
| 2014 | గోవిందుడు అందరివాడేలే | అభిరామ్ | కాజల్ అగర్వాల్ | ||
| 2014 | బ్రూస్ లీ - ది ఫైటర్ | కార్తీక్/బ్రూస్ లీ | రకుల్ ప్రీత్ సింగ్ | ||
| 2016 | ధృవ | ధ్రువ | రకుల్ ప్రీత్ సింగ్ | ||
| 2017 | ఖైదీ నెంబర్ 150 | అతిథి పాత్ర | అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు | ||
| 2018 | రంగస్థలం | చిట్టిబాబు | సమంత అక్కినేని | ||
| 2019 | వినయ విధేయ రామ | రామ | కైరా అద్వానీ (నటి) | ||
| 2022 | ఆర్‌ఆర్‌ఆర్ | అల్లూరి సీతారామరాజు | ఆలియా భట్ | ||
| ఆచార్య | |||||
| 2025 | గేమ్ చేంజర్ | రామ్ నందన్ | కైరా అద్వానీ | ||
| 2026 | పెద్ది | విజయ్ | జాహ్నవి కపూర్ |
నిర్మాతగా
[మార్చు]| సంవత్సరం | చిత్రం | తారాగణం | బాష | దర్శకుడు |
|---|---|---|---|---|
| 2017 | ఖైదీ నెంబర్ 150 | చిరంజీవి, కాజల్ అగర్వాల్ | తెలుగు | వి. వి. వినాయక్ |
| 2018 | సైరా నరసింహారెడ్డి | చిరంజీవి, నయన తార | తెలుగు | సురేందర్ రెడ్డి |
గాయకునిగా
[మార్చు]| సంవత్సరం | పాటలు | చిత్రం | సంగీత దర్శకుడు | బాష | Singer(s) |
|---|---|---|---|---|---|
| 2013 | "Mumbai Ke Hero" | తుఫాన్ (సినిమా) | Chirantan Bhatt | తెలుగు | రాం చరణ్,
Jaspreet Jasz, Roshni Baptist |
పురస్కారాలు
[మార్చు]- 2018: ఉత్తమ నటుడు - రంగస్థలం
వనరులు
[మార్చు]- ↑ TV9 Telugu (30 June 2023). "రామ్ చరణ్, ఉపాసన కూతురి పేరు ఇదే.. ట్వీట్ చేసిన చిరంజీవి." Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ https://web.archive.org/web/20140528005740/http://maatv.com/corporate#tabs-3
- ↑ Chitrajyothy (12 April 2024). "హీరో రామ్ చరణ్‌కు 'గౌరవ డాక్టరేట్' | 'Honorary Doctorate' for Hero Ram Charan". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Chitrajyothy (13 April 2024). "వేల్స్ యూనివర్సిటీ నుంచి రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
- ↑ https://www.thehansindia.com/cinema/tollywood/ram-charan-and-junior-ntr-are-over-joyed-with-oscars-2023-win-and-shared-their-excitement-with-heartfelt-posts-787585
- ↑ "Ram Charan marries Upasana Kamineni". The Times of India. Archived from the original on 2013-10-04.
- ↑ "Ram Charan and Upasana become parents to a baby girl" (in ఇంగ్లీష్). India Today. 20 June 2023. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు". Eenadu. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "'Blessed to be mother of three': Upasana, Ram Charan open up on birth of twins, hope to raise kids aware of privilege" (in ఇంగ్లీష్). Hindustan Times. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "Ram Charan and Upasana welcome twins: 'Thankful to all our fans, loved ones and well-wishers'". The Times of India. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
- ↑ "కవలల పేర్లు వెల్లడించిన రామ్ చరణ్". Eenadu. 13 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకి - 'నాట్ హెల్త్ సీఎస్ ఆర్' అవార్డ్". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-30. Archived from the original on 2022-07-07. Retrieved 2022-03-30.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాం చరణ్ పేజీ
- ఫేస్బుక్ లో రాం చరణ్