తుఫాన్ (సినిమా)
తుఫాన్ | |
---|---|
దర్శకత్వం | అపూర్వ లాఖియా (హిందీ) యోగి (తెలుగు)[1] |
స్క్రీన్ ప్లే | సురేష్ నాయర్ |
కథ | సలీం-జావిద్ |
నిర్మాత | అపూర్వ లాఖియా అమిత్ మెహ్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | గురురాజ్ జోయిస్ |
కూర్పు | చింటూ సింగ్ |
సంగీతం | అను మాలిక్ చింతన్ భట్ మీట్ బ్రదర్స్ దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్తైన్న్మెంట్ |
విడుదల తేదీ | మే 10, 2013 |
దేశం | భారత్ |
భాషలు | హిందీ తెలుగు |
తుఫాన్ 2013 లో విడుదదవనున్న తెలుగు చిత్రము. హిందీలో జంజీర్ పేరుతో ఈ చిత్రం ఏకకాలంలో నిర్మించబడింది.
నటవర్గం
[మార్చు]- రాం చరణ్ తేజ - విజయ్ ఖన్నా
- ప్రియాంక చోప్రా - మాలా
- శ్రీహరి - పఠాన్ షేర్ ఖాన్
- ప్రకాశ్ రాజ్ - రుద్రప్రతాప్ తేజ
- తనికెళ్ళ భరణి - జయదేవ్
- అంకుర్ భాటియా
- మహీ గిల్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు - అపూర్వ లాఖియా
- సంగీతం - అన్నూ మాలిక్
కథ
[మార్చు]హైదరాబాద్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న విజయ్ ఖన్నా… నడిరోడ్డు మీద ధర్నాకు దిగిన అధికారపార్టీ శాసనసభ్యుడి మీదే చెయ్యి చేసుకుంటాడు. దాంతో అతన్ని ముంబాయికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎ.సి.పి.గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ దృష్టి ఆయిల్ మాఫియా మీద పడుతుంది. కల్తీ ఆయిల్‌తో కోట్లు రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్న తేజ ఆటలు కట్టించడానికి విజయ్ నడుం బిగిస్తాడు. అందుకోసం షేర్ ఖాన్ సాయం తీసుకుంటాడు. తేజ అనుచరులు ఓ సబ్ కలెక్టర్‌ను సజీవ దహనం చేయడాన్ని ఎన్.ఆర్.ఐ. మాలా చూస్తుంది. ఆమెను సాక్షిగా కోర్టుకు హాజరు పరిచి తేజను అరెస్ట్ చేయాలనుకుంటాడు విజయ్. అయితే పోలీస్ కమీషనర్ అతన్ని విధుల నుండి తప్పిస్తాడు. సస్పెండ్ అయిన విజయ్ ఖన్నా ఆయిల్ మాఫియా ఆటల్ని ఎలా కట్టించాడు? తన తల్లిదండ్రుల మరణానికి కారకుడైన వ్యక్తిని ఎలా హతమార్చాడు? అన్నదే మిగతా కథ.[2]
పాటల జాబితా
[మార్చు]ఈ చిత్రంలోనీ అన్నిపాటలను చంద్రబోస్ రచన చేసినారు.
ముంబైకి హీరో, గానం. రాంచరణ్ , జస్ప్రీత్ జాస్, రోషిని బాప్టిస్ట్
పింక్లే , గానం.మమత శర్మ
ప్రేమించా , గానం.మైనంపాటి శ్రీరామచంద్ర , షల్మలి ఖోల్గడే
వెచ్చనైన , గానం: శ్వేతా పండిట్
షకీలా సెంటు , గానం.శ్రేయా ఘోషల్.
విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం యొక్క మూలమైన ప్రకాష్ మెహ్రా గారి జంజీర్ ని అప్పట్లో నందమూరి తారక రామారావు గారితో 1974లో నిప్పులాంటి మనిషి పేరుతో పునః నిర్మించారు.[3] ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.[4]
- నిప్పులాంటి మనిషి తర్వాత ఆ చిత్రం యొక్క తదుపరి తెలుగు మరియూ హిందీ పునః నిర్మాణం ఈ చిత్రం కావడం విశేషం.
- తెలుగులో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి పోషించగా హిందీలో సంజయ్ దత్ పోషించారు. రాం చరణ్ నటించిన మగధీరలో కూడా శ్రీహరి గారి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం గమనార్హం.
- 06-09-2003 లో విడుదలైన[5] అపురూపం తర్వాత ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కోసం ఆమె 9 కోట్ల పారితోషికం అందుకున్నది.[6]
విమర్శలు
[మార్చు]- ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులంతా ‘జంజీర్’తో పోల్చుతున్నారు. అమితాబ్ జీవం పోసిన విజయ్‌ఖన్నా పాత్రతోనే రామ్‌చరణ్ పాత్రనూ చూస్తున్నారు. దాంతో ఏ స్థాయిలోనూ ఈ సినిమా మాతృకకు సమఉజ్జీ కాదని తేల్చేస్తున్నారు. చంద్రబోస్ పాటలూ ఆకట్టుకోలేదు. ఏ రకంగానూ, ఏ స్థాయిలోనూ ఈ సినిమా ఇటు తెలుగువారిని, అటు ఉత్తరాది వారిని మెప్పించలేకపోయింది.[2]
వనరులు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-28. Retrieved 2013-03-26.
- ↑ 2.0 2.1 వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "ఉద్యమ సునామీలో తేలిపోయిన 'తుఫాన్'!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-08. Retrieved 2013-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-16. Retrieved 2013-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-10. Retrieved 2013-09-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-14. Retrieved 2013-03-26.