వినయ విధేయ రామ
వినయ విధేయ రామ | |
---|---|
దర్శకత్వం | బోయపాటి శ్రీను |
స్క్రీన్ ప్లే | బోయపాటి శ్రీను |
కథ | బోయపాటి శ్రీను |
నిర్మాత | డి.వి.వి. దానయ్య |
తారాగణం | రాం చరణ్ తేజ, వివేక్ ఒబెరాయ్, ముకేష్ రిషి, కియారా అద్వానీ |
ఛాయాగ్రహణం | రిషి పంజాబీ ఆర్థర్ ఎ విల్సన్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మరాజు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | డివివి స్టూడియో |
విడుదల తేదీ | 11 జనవరి 2019 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹47.7cr [1] |
వినయ విధేయ రామ 2019 జనవరి 11 న విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా.
కథ
[మార్చు]నలుగురు అనాథ పిల్లలు చెత్తకుప్పల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాలకు అనుకోకుండా ప్రమాదం ఏర్పడుతుంది. వారు చనిపోతామని అనుకుంటున్న సమయంలో ఓ చిన్నపిల్లాడు ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు విన్నవారికి చనిపోవాలనే ఆలోచన పోయి.. బ్రతకాలనుకుంటారు. తమకు దొరికిన పిల్లవాడికి రామ్ అనే పేరు పెడతారు. అలా నలుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్నల కోసం రామ్ తన చదువు మానుకుని వారి చదువు కోసం పాటు పడతాడు. క్రమంగా రామ్ సహా అందరూ పెరిగి పెద్దవుతారు. రామ్(రాంచరణ్)కు దూకుడు ఎక్కువ. ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడోనని అతని పెద్దన్న భువన్ కుమార్(ప్రశాంత్) .. ఎవరితో గొడవ పడొద్దు అంటూ మాట తీసుకుంటాడు. విశాఖపట్నం లోని రామ్ అన్నయ్య ఉప ఎన్నికలలో పందెం పరుశురాం(ముకేష్ రిషి) బావ మరిది బల్లెం బలరాం(హరీష్ ఉత్తమన్) ఎదురు నిలిచి ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తాడు. భువన్‌కు ఎదురు వవ్చిన పరుశురాం మనుషులను రామ్ చితగ్గొడతాడు. పగబట్టిన పరుశురాం ఎస్పీ సహకారంతో అందరనీ ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటాడు. అక్కడకు రామ్ కూడా వస్తాడు. అయితే అనుకోకుండా బీహర్ నుండి వచ్చిన రాజుభాయ్(వివేక్ ఒబెరాయ్ ) మనుషులు రామ్ కుటుంబాన్ని చంపాలని చూస్తే.. రామ్ అందరినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్యమంత్రి( మహేష్ మంజ్రేకర్) వచ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భయపడి పారిపోతాడు. ఇంతకు రామ్‌ను కలవడానికి బీహార్ ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అసలు రాజుభాయ్ వల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? రామ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.[2]
తారాగణం
[మార్చు]- రాం చరణ్ తేజ
- కియారా అద్వానీ
- వివేక్ ఒబెరాయ్
- ఆర్యన్ రాజేష్
- ముకేష్ రిషి
- హరీశ్ ఉత్తమన్
- ప్రియదర్శిని రామ్
పాటల జాబితా
[మార్చు]- రామా లవ్స్ సీతా, రచన: శ్రీమణి, గానం. సింహా, ప్రియ హిమేస్
- అమ్మా నాన్న, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కాలభైరవ
- తందానే తందానే, రచన: శ్రీమణి, గానం. ఎం. ఎల్. ఆర్. కార్తీకేయన్
- ఏక్ బార్ , రచన: శ్రీమణి, గానం.దేవీశ్రీ ప్రసాద్, రనినరెడ్డి
- తస్సాదియ్యా , రచన: శ్రీమణి, గానం. జస్ప్రీత్ జాస్, ఎం ఎం మనసి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం - బోయపాటి శ్రీను
- నిర్మాత - డి.వి.వి దానయ్య
- ఛాయాగ్రహణం: రిషి పంజాబి, అర్థర్ ఎ.విల్సన్
- మాటలు: ఎం.రత్నం
- కళ: ఎ.ఎస్.ప్రకాష్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్ రావు, తమ్మిరాజు
- పోరాటాకు : కనల్ కణ్ణన్