Jump to content

వివేక్ ఒబెరాయ్

వికీపీడియా నుండి
వివేక్ ఒబెరాయ్
2016లో వివేక్ ఒబెరాయ్
జననం
వివేక్ ఆనంద్ ఒబెరాయ్

(1976-09-03) 1976 సెప్టెంబరు 3 (వయసు 48)
హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రియాంక అల్వా
(m. 2010)
పిల్లలు2
తల్లిదండ్రులు

వివేక్ ఒబెరాయ్ (జననం 1976 సెప్టెంబరు 3) ప్రముఖ బాలీవుడ్ నటుడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా కంపెనీ(2002) తో తెరంగేట్రం చేశారు వివేక్. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు, ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలను అందుకున్నారు. సాతియా, మస్తీ, యువ, ఓంకారా, గ్రాండ్ మస్తీ వంటి ఎన్నో పేర్కొనదగ్గ చిత్రాల్లో నటించారు. క్రిష్ 3 సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. జీవిత చరిత్రల ఆధారంగా తీసిన షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా, రక్త చరిత్ర, రాయ్ వంటి  సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

వివేక్ 1976 సెప్టెంబరు 3న హైదరాబాద్లో జన్మించాడు. అతని తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్. ఆయన పంజాబీ  హిందువు. తల్లి యశోధర ఒబెరాయ్  తమిళనాడుకు చెందినది.[1][2] నిజానికి పెళ్ళి సమయానికి సురేష్ నటుడు కాదు. వారి కుటుంబ వ్యాపారమైన ఔషధాల దుకాణాలను చూసుకునేవాడు. కానీ ఆ తరువాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు.[3] మొదట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్  లో చదువుకున్న వివేక్ ఆ తరువాత అజ్మెర్ లోని మయో కళాశాలలో చదువుకున్నాడు. తరువాత జుహులోని మితిబాయ్ కళాశాలలో చదివారు. లండన్ లో జరిగిన ఒక యాక్టర్స్ వర్క్ షాప్ కు హాజరైన వివేక్ ను న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన దర్శకుడు గుర్తించి న్యూయార్క్ తీసుకువెళ్ళి ఫిలిం నటనలో మాస్టర్స్ డిగ్రీలో చేర్చారు.[4] కొన్ని బాలీవుడ్ సినిమాలకు వివేక్ స్క్రిప్ట్ రచయితగా కూడా పనిచేశారు.[5]

కెరీర్

[మార్చు]

2002–2009

[మార్చు]
రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో  వచ్చిన రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవీంద్ర పాత్రలో వివేక్

రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కంపెనీ సినిమాతో  తెరంగేట్రం  చేశారు వివేక్.[6] ఆ సినిమాకు ఉత్తమ నటుడు డెబ్యూ, ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలు పొందారు ఆయన. ఆ తరువాత రోడ్, దమ్ వంటి సినిమాల్లో నటించారు.

2002లో షాహిద్ అలీ దర్శకత్వంలో సాతియా సినిమాలో నటించారు వివేక్. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆయనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్ కూడా లభించింది. 2004 లో కామెడీ సినిమా మస్తీలోనూ, యువ సినిమాలోనూ నటించారు. 2005లో కిస్నా: ది వారియర్ పొయెట్ సినిమాలో కిస్నా పాత్ర చేశారు వివేక్.

2006లో షేక్స్పియర్ నాటకం ఒథెల్లో ఆధారంగా తీసిన ఓంకారా సినిమాలో నటించారు వివేక్.[7] అసలు నాటకంలో మిచెల్ కాసియో పాత్రను కేసూ పాత్రగా వేశారు ఆయన. ఈ సినిమాలోని ఆయన నటనను చూసి దర్శక, రచయిత గుల్జార్ ఆయనను ఎంతగానో ప్రశంసించారు.[8]

2007లో షూట్ ఔట్ లోఖండ్ వాలా సినిమాలో గ్యాంగ్ స్టర్ మాయా డొలస్ పాత్రలో కనిపించారాయన.

2008లో అపూర్వ లఖియా దర్శకత్వంలో, ఏక్తా కపూర్ నిర్మాణంలో వచ్చిన మిషన్ ఇస్తాంబుల్ సినిమాలో నటించారు. ఈ సినిమాలోని అపున్ కే సాత్ పాటను అంతర్జాతీయ భారత ఫిలిం అకాడమీ అవార్డు ఫంక్షన్ లో ప్రదర్శించారు వివేక్.[9]

2009–ప్రస్తుతం

[మార్చు]
జయంతభాయ్ కీ లవ్ స్టోరీ సినిమా ప్రచారంలో వివేక్ ఒబెరాయ్ తో హీరోయిన్ నేహా శర్మ

2009లో కుర్బాన్ సినిమాలో సహాయనటునిగా కనిపించారు వివేక్. 2010లో ప్రిన్స్ సినిమాలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయినా, వివేక్ నటనకు ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి.[10][11] తెలుగు రాజకీయనాయకుడు పరిటాల రవి పాత్రను రాంగోపాల్  వర్మ దర్శకత్వం వహించిన రక్తచరిత్ర సినిమాలో పోషించారు వివేక్.[12]

మణిరత్నం నిర్మాణంలో షాహిద్ అలీ, శివల దర్శకత్వంలో బ్లడీ పాకీ సినిమాలో నటించారు వివేక్.[13] అక్టోబరు 2012లో ఆయన నటించిన  కిస్మత్ లవ్ పైసా దిల్ సినిమా ఫ్లాప్ అయింది.[14] 2011లో వాచ్ ఇండియన్ సర్కస్ సినిమాను నిర్మించారు వివేక్.[15] 16 నుంచి 40 ఏళ్ళ వయసులోపు ప్రేక్షకులు పాల్గొని ఉత్తమ సినిమాను ఎన్నుకునే 16వ బూసన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 380సినిమాలను ప్రదర్శించగా, ఈ సినిమాను ఉత్తమ సినిమాగా ఆడియన్స్ చాయిస్ అవార్డుకు ఎంచుకున్నారు ప్రేక్షకులు. ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఉన్న 16 ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ అవార్డును పొందిన ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. అప్పటికే ఈ సినిమా అంతర్జాతీయ విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి, పత్రికల నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది.[16] మే 2014లో విడుదలైన ది అమేజింగ్ స్పైడర్ మాన్-2 హిందీ డబ్బింగ్ సినిమాలో ఎలక్ట్రో పాత్రకు డబ్బింగ్ చెప్పారు వివేక్.

12 ఏళ్ళ తరువాత యశ్ చోప్రా ఫిలింస్ నిర్మించే సినిమా బ్యాంక్ చొర్ లో నటించనున్నారు వివేక్.

దాతృత్వం

[మార్చు]

సునామీలో కొట్టుకుపోయిన ఊరును తిరిగి నిర్మించేందుకు సహకరించిన వివేక్ ను 2006లో రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డుతో గౌరవించారు. ఆ సమయంలో తమిళనాడులో ఉన్న వివేక్ ప్రతిరోజూ 6 ట్రక్కులతో నిత్యావసర వస్తువులను సునామీ ప్రభావిత ప్రాంతలకు పంపేవారు. తమిళనాడు కడలూరు జిల్లాలోని సునామీ ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.[17] వీరి కుటుంబం యశోధర ఒబెరాయ్ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున వివేక్ పొగాకు వ్యతిరేక ప్రచారానికి అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నారు. చెన్నైలోనూముంబైలోనూ పలు సేవా  కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2004 సునామీ బాధితుల కోసం ప్రాజెక్ట్ హోప్ తో కలసి వివేక్ చేసిన కృషికి రోటరీ ఇంటర్నేషనల్ ఆయనను గుడ్ సమరిటన్ పురస్కారంతో  సత్కరించింది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ప్రాజెక్ట్ దేవి, కాన్సర్ పేషేంట్స్ ఎయిడ్ అసోసియేషన్, బన్ యన్ వంటి సేవా కార్యక్రమాల్లో ఎంతో కృషి చేశారు వివేక్. ఈ కార్యక్రమాలకు దాదాపు 30 లక్షలు విరాళం ఇచ్చారు వివేక్. మరో 250 లక్షల విరాళాన్ని సేకరించారు.[18]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఒబెరాయ్ కొన్నాళ్ళు నటి ఐశ్వర్య రాయ్ తో డేటింగ్ చేశారు. కానీ తరువాత వారు విడిపోయారు.]

29 అక్టోబరు 2010న కర్ణాటకకు చెందిన మంత్రి జీవరాజ్ ఆల్వా కుమార్తె ప్రియాంజా అల్వాను బెంగళూరులో వివాహం చేసుకున్నారు. వీరికి 2013 ఫిబ్రవరి 6న వారికి కుమారుడు వివాన్, 2015 ఏప్రిల్ 21న కుమార్తె అమేయా జన్మించారు.[19][20]

నటి కరీనా కపూర్ ప్రోత్సాహంతో తాను శాకాహారిగా మారానని చెప్తారు వివేక్. తరువాత కొన్నాళ్ళకు పెటా సంస్థ సెక్సీయెస్ట్ వెజిటేరియన్  జాబితాలో  కూడా చేరారు ఆయన.[21][22]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ & అవార్డులు
2002 కంపెనీ చంద్రకాంత్ "చందు" నగ్రే ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం
2002 రోడ్ అరవింద్ చౌహాన్
2002 సాతియా ఆదిత్య సెహగల్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
2003 దమ్ ఉదయ్ షిండే
2003 డర్న మనా హై అమర్
2004 యువ అర్జున్ బాలచంద్రన్
2004 క్యూం..! హో గయా నా అర్జున్ ఖన్నా
2004 మస్తి మీట్ మెహతా
2005 కాల్ దేవ్ మల్హోత్రా
2005 కిస్నా కిస్నా సింగ్
2005 దీవానే హుయే పాగల్ కథకుడు(సర్దార్) అతిథి పాత్ర
2006 హోం డెలివరి:ఆప్కో..ఘర్ తక్ సన్నీ చోప్రా
2006 ప్యారే మోహన్ మోహన్
2006 ఓంకారా కేసూ ఫిరంగీ
2006 నక్ష విక్కీ మల్హోత్రా
2007 షూట్ ఔట్ లోఖండ్ వాలా మయా డోల్స్ ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారానికి నామినేషన్
2007 ఫూల్ ఎన్ ఫైనల్ లక్కీ
2008 మిషన్ ఇస్తాంబుల్ రిజ్వాన్ ఖాన్
2009 లక్కీ బై చాన్స్ కార్తికేయ అతిథి పాత్ర
2009 కుర్బాన్ రియాజ్ మాసుద్
2010 ప్రిన్స్ ప్రిన్స్
2010 రక్త చరిత్ర I ప్రతాప్ రవి తెలుగు సినిమా
స్టార్ స్క్రీన్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారానికి నామినేషన్
2010 రక్త చరిత్ర II ప్రతాప్ రవి తెలుగు సినిమా
2010 రక్త సరిత్రం ప్రతాప్ రవి తమిళ్ సినిమా
2011 దేఖ్ ఇండియన్ సర్కస్ నిర్మాత
2012 కిస్మత్ లవ్ పైసా దిల్లీ లోకేష్ "లక్కీ" దుగ్గల్
2013 జిల్లా ఘజియాబాద్ సత్బిర్ గుజ్జర్
2013 జయంతిభాయ్ కి లవ్ స్టోరీ జయంతిభాయ్
2013 గ్రాండ్ మస్తీ మీట్ మెహతా
2013 క్రిష్ 3 కాల్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్
2016 గ్రేట్ గ్రాండ్ మస్తీ మీట్ మెహతా నిర్మాణ దశలో ఉంది
2016 బ్యాంక్ చోర్ అంజద్ ఖాన్(సి.బి.ఐ.ఆఫీసర్ నిర్మాణ దశలో ఉంది

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2013–2018 ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్ న్యాయమూర్తి 31 ఎపిసోడ్‌లు
2017–ప్రస్తుతం ఇన్‌సైడ్ ఎడ్జ్ విక్రాంత్ ధావన్ 28 ఎపిసోడ్‌లు
2022 ధారవి బ్యాంక్ జేసీపీ జయంత్ గవాస్కర్ 10 ఎపిసోడ్‌లు
2024 ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఐజీ విక్రమ్ బక్షి 7 ఎపిసోడ్‌లు[23]

అవార్డులు

[మార్చు]
అవార్డు సంవత్సరం క్యాటగిరి వర్క్ ఫలితం
ఫిలింఫేర్ పురస్కారాలు 2002 ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం కంపెనీ గెలిచారు
2002 ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం కంపెనీ గెలిచారు
2002 ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం సాతియా నామినేషన్
2007 ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారం షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా నామినేషన్
2013 ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం క్రిష్ 3 నామినేషన్
అంతర్జాతీయ భారత ఫిలిం అకాడమీ పురస్కారాలు 2008 ఐఫా ఉత్తమ విలన్ పురస్కారం షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా గెలిచారు
2010 ఐఫా గ్రీన్ గ్లోబల్ అవార్డు[24] - గెలిచారు
జీ సినీ అవార్డులు 2002 జీ సినీ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం కంపెనీ గెలిచారు
2002 జీ సినీ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం కంపెనీ గెలిచారు
2008 జీ సినీ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారం షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా నామినేషన్
స్టార్ స్క్రీన్ అవార్డు 2002 స్టార్ స్క్రీన్ అవార్డ్ మోస్ట్ ప్రాసిమింగ్ న్యూకమర్-మేల్ కంపెనీ గెలిచారు
2008 స్టార్ స్క్రీన్ అవార్డ్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారం షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా నామినేషన్
స్టార్ డస్ట్ అవార్డులు 2002 స్టార్ డస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-మేల్ సాతియా గెలిచారు
2003 స్టార్ డస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-మేల్ రోడ్ గెలిచారు
2004 స్టార్ డస్ట్ ఉత్తమ సహాయ నటుడు యువ గెలిచారు
2008 స్టార్ డస్ట్ స్టాండ్ ఔట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా గెలిచారు
2008 స్టార్ డస్ట్ ఉత్తమ ప్రతినాయకుడు షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా నామినేషన్
బాలీవుడ్ మూవీ అవార్డులు 2002 బాలీవుడ్ మూవీ అవార్డులు – బెస్ట్ మేల్ డెబ్యూ కంపెనీ గెలిచారు
2006 బాలీవుడ్ మూవీ అవార్డులు – ఉత్తమ సహాయ నటుడు ఓంకారా గెలిచారు
ఎ.ఎక్స్.ఎన్ యాక్షన్ అవార్డులు 2007 ఎ.ఎక్స్.ఎన్ యాక్షన్ ఉత్తమ ప్రతినాయకుడు అవార్డు షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా గెలిచారు

డబ్బింగ్ కెరీర్

[మార్చు]
చిత్రం నటుడు పాత్ర డబ్బింగ్ భాష అసలు భాష అసలు సినిమా విడుదలైన సంవత్సరం డబ్బింగ్ అయిన సినిమా విడుదలైన సంవత్సరం
ది ఎమేజింగ్ స్పైడర్ మేన్-2[25] జమయీ ఫాక్స్ ఎలక్ట్రో హిందీ ఇంగ్లీష్ 2014 2014

మూలాలు

[మార్చు]
  1. Vivek Oberoi surprises fans by speaking several languages[permanent dead link].
  2. history of theeran - THEERAN CHINNAMALAI GOWNDER http://theeranthiru.weebly.com/history-of-theeran.html
  3. "Suresh Oberoi, ek baar phir..." TOI. Times of India.
  4. Vivek Oberoi Biography Archived 2014-04-28 at the Wayback Machine
  5. Vivek Oberoi Biography Archived 2013-02-14 at the Wayback Machine
  6. "Vivek Oberoi as Chhota Rajan". Ibnlive.in.com. 2011-05-10. Archived from the original on 2010-07-24. Retrieved 2011-10-25.
  7. Friday Review Chennai – Othello with desi nuances: Omkara.
  8. Joginder Tuteja (2006-07-29). "Vivek has played nuances of his character with such great intellect that Gulzaar Saab after seeing his performance congratulated him". Archived from the original on 2007-02-19. Retrieved 2011-12-01.
  9. Elizabeth Gibson (2008-06-10). "Indian drama scoops Bollywood honors". China Post.
  10. "Box Office 2010". Archived from the original on 2013-12-09. Retrieved 2010-10-26.
  11. Vinod Mirani (2010-03-17). "Flops galore at the box office".
  12. Taran Adarsh (2010-10-22). "Rakht Charitra – I: Movie Review".
  13. "The Times of India, May 20, 2010". The Times of India. 2010-05-20. Archived from the original on 2012-11-04. Retrieved 2011-10-25.
  14. "Vivek Oberoi signed for 'Kismat Love Paisa Dilli'". Indian Express. 2011-10-13. Retrieved 2011-10-25.
  15. "Vivek Oberoi turns producer". Bollywoodhungama.com. 2011-10-19. Retrieved 2011-10-25.
  16. Bollywood Hungama News network (2011-11-24). "Watch Indian Circus or Dekh Indian circus won top honors at 16th Busan Film Festival".
  17. Menka Shivdasani (2005-03-25). "Bravehearts!". TheHinduBusinessLine.com. Retrieved 27 November 2011.
  18. Priyanka Jain (2011-06-28). "Vivek Oberoi makes it to 'philanthropy' list". Hindustan Times. Archived from the original on 2011-07-26. Retrieved 27 November 2011.
  19. "Just married". Hindustan Times. 2010-10-30. Archived from the original on 2010-11-01. Retrieved 31 October 2010.
  20. Hiren Kotwani (26 April 2015). "Vivek Oberoi still to decide on newborn daughter's name". The Times of India. Retrieved 24 April 2015.
  21. "Vivek Oberoi Left Meat Because of Kareena Kapoor," The Indian Express, 20 November 2009.
  22. Richard Bhatia, "Vivek, Vidya Take Early Leads in Hottest Vegetarian Contest", Times of India, 26 December 2011.
  23. "Indian Police Force: Vivek Oberoi Is "Most Experienced" Officer In Rohit Shetty's Squad". NDTV.com.
  24. Winners of the IIFA Awards 2010, Bollywood Hungama (2010-06-05).
  25. "Vivek is the Voice of Amazing Spider-Man 2 Villain". indiatimes.com. 2014-03-20. Retrieved 2014-03-30.