ప్రియదర్శిని రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియదర్శిని రామ్
జననం
రామి రెడ్డి

(1955-10-24) 1955 అక్టోబరు 24 (వయసు 67)
వృత్తిసినిమా నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
పిల్లలుఇద్దరు కుమారులు గౌతం, వివేక్

ప్రియదర్శిని రామ్ (జననం 1955 అక్టోబరు 24) భారతీయ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్, తెలుగు చిత్రసీమలో నటుడు, దర్శకుడు, నిర్మాత. మనోడు చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయనను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1955 అక్టోబరు 24న తెనాలిలో రామి రెడ్డి జన్మించాడు. తన చిన్ననాటనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సంరక్షణలో ఆయన విద్యాభ్యాసం భిలాయ్, ఢిల్లీ, హైదరాబాదు నగరాలలో జరిగింది. 1980లో నిజాం కళాశాల నుండి డిగ్రీ పట్టభద్రుడయిన ఆయన జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ప్రవేశం పొందాడు.

కెరీర్[మార్చు]

అడ్వర్టైజింగ్[మార్చు]

కాలేజీ రోజుల్లోనే సృజనాత్మక రచనల వైపు మొగ్గిన రామ్ ప్రకటనల రంగంలోకి అడుగుపెట్టాడు. వివిధ భాషలలో ఆయన రూపొందించిన జాతీయ రాజకీయ నాయకుల ప్రకటనల ప్రచారాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఆయన స్థాపించిన ప్రియదర్శిని యాడ్స్ ఏజెన్సీని బహుళజాతి ప్రకటనల ఏజెన్సీ గ్రే అమెరికా(Grey America) ద్వారా కొనుగోలు ప్రతిపాదనను అందుకుంది. కానీ తల్లికి ఆసరాగా ఉండాలని హైదరాబాదులోనే స్థిరపడిన ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. 1990ల చివరలో మొదట ఆయన దూరదర్శన్ తెలుగు ఛానెల్‌ డిటెక్టివ్ సీరియల్‌లో తన నటన, దర్శకత్వంతో టీవీ కెరీర్ ని ప్రారంభించాడు.

సినిమా[మార్చు]

2006లో మనోడు, 2007లో టాస్ సినిమాలతో టాలీవుడ్‌లో ఫిల్మ్‌మేకర్‌గా ప్రియదర్శిని రామ్ ఎదిగాడు. నీలకంఠ దర్శకత్వం వహించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో రామ్ కనిపించాడు. ఆయన టాస్‌లో ఉపేంద్రకు గాత్రదానం(dubbing) కూడా చేశాడు.

మీడియా[మార్చు]

ప్రియదర్శిని రామ్ సాక్షి దినపత్రికలో ఫీచర్స్ (సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్) విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్నాడు. అప్పుడు 'లవ్ డాక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సాక్షి టీవీకి కొంతకాలం సీఈఓ గానూ వ్యవహరించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు 'రామ్ సలాం' కార్యక్రమం ద్వారా మరింత చేరువయ్యాడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2006 మనోడు నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత నంది స్పెషల్ జ్యూరీ అవార్డు - విజేత
2007 టాస్ దర్శకుడు, రచయిత
2015 బెంగాల్ టైగర్ నటుడు
2015 జ్యోతి లక్ష్మి నటుడు
2018 ఇదం జగత్ నటుడు
2019 వినయ విధేయ రామ నటుడు
2019 మార్షల్ నటుడు
2021 షాదీ ముబారక్ నటుడు