Jump to content

హలో వరల్డ్

వికీపీడియా నుండి
హలో వరల్డ్
దర్శకత్వంశివ సాయివర్ధన్ జలదంకి
రచనశివ సాయివర్ధన్ జలదంకి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఎదురొలు రాజు
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంపీకే దండి
నిర్మాణ
సంస్థ
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
విడుదల తేదీ
12 ఆగస్టు 2022 (2022-08-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

హలో వరల్డ్ 2022లో విడుదలైన తెలుగు వెబ్‌ సిరీస్‌. జీ5' ఒరిజినల్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నీహారిక కొణిదెల నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ కు శివ సాయివర్ధన్ జలదంకి దర్శకత్వం వహించాడు. ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆగష్టు 12న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1]

పీపుల్ టెక్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. అందులో ఐటీ కంపెనీలోకి అడుగుపెట్టిన ఎనిమిది మంది యువకులు జీవితంలో తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉందని తెలుసుకుంటారు, 8 మంది వ్యక్తులు తమ సొంత కలలు కలిగి, చివరకు తమ కలలని నెరవేర్చుకోవడానికి ఎలా పోరాడారు అనేదే మిగతా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]
  • ఆర్యన్ రాజేష్ - రాఘవ్
  • సదా - ప్రార్ధన
  • రామ్ నితిన్ - సిద్దార్థ్
  • నయన్ కరిష్మా - మేఘన
  • సుదర్శన్ గోవింద్ - వరుణ్
  • నిత్య శెట్టి - ప్రవల్లిక
  • నిఖిల్ విజయేంద్ర సింహా - రాహుల్
  • అపూర్వ రావు - వర్ష
  • గీలా అనిల్ - సురేష్
  • స్నేహాల్ ఎస్.కామత్ - అమృత
  • రవి వర్మ - డేబాషిష్ సేనాపతి
  • జయప్రకాష్‌ - ఆనంద్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
  • నిర్మాత: నీహారిక కొణిదెల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ సాయివర్ధన్ జలదంకి
  • సంగీతం: పీకే దండి
  • సినిమాటోగ్రఫీ: ఎదురొలు రాజు
  • ఎడిటర్ : ప్రవీణ్ పూడి

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
  2. "హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?". 12 August 2022. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  3. Eenadu (12 August 2022). "హలో వరల్డ్‌ రివ్యూ". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.