ఒక చిన్నమాట
స్వరూపం
| ఒక చిన్నమాట | |
|---|---|
![]() ఒక చిన్నమాట సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
| రచన | దివాకర్ బాబు (మూటలు) |
| స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
| కథ | భూపతి రాజా |
| దీనిపై ఆధారితం | చరణ దాసి (1956) ది వ్రెక్ (నవల) |
| నిర్మాత | బి. శివరామకృష్ణ |
| తారాగణం | జగపతి బాబు, ఇంద్రజ |
| ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
| కూర్పు | కోలా భాస్కర్ |
| సంగీతం | రమణీ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1997 మే 27 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
ఒక చిన్నమాట 1997, మే 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఇంద్రజ జంటగా నటించగా, రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.[1][2] రవీంద్రనాథ్ టాగూర్ 1906లో రాసిన నౌకదుబి నవల ఆధారంగా 1956లో రూపొందించబడిన చరణదాసి సినిమా ప్రేరణతో ఈ చిత్రం తీయబడింది.[3]
కథా నేపథ్యం
[మార్చు]ఒక యువకుడు రైలులో ఒక అందమైన అమ్మాయిని కలుస్తాడు. తనకు కవల సోదరుడు ఉన్నాడని ఆమెకు చెప్తాడు. ఆ అమ్మాయి అతని ప్రేమలో పడుతుంది. కాని, అమ్మాయి ప్రేమను గెలవడంకోసం తన సొంత సోదరుడిగా నటించాడని అమెకి తెలుస్తుంది. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- జగపతి బాబు (చందు/చంటి)
- ఇంద్రజ (గీత)
- కైకాల సత్యనారాయణ (అబ్బాయి)
- రాజీవ్ రాజ్ (రాజీవ్)
- బ్రహ్మానందం (వర్తకుడు)
- బాబు మోహన్ (మూర్తి)
- మల్లికార్జునరావు (చంచల్ రావు)
- ఏవీఎస్ (మన్మధరావు)
- చలపతిరావు తమ్మారెడ్డి (చలపతిరావు)
- సుత్తివేలు (పరంధామయ్య)
- రఘునాథ రెడ్డి (అబ్బాయి బావ)
- గుండు హనుమంతరావు (మాలోకం)
- కళ్ళు చిదంబరం (ఫోటోగ్రాఫర్)
- తిరుపతి ప్రకాష్ (ఫోటోగ్రాఫర్)
- గౌతంరాజు (నటుడు)
- జూ. రేలంగి (రేలంగి)
- జెన్నీ
- రక్ష (శిరీష)
- అన్నపూర్ణ (శిరీష తల్లి)
- శ్రీలక్ష్మీ (చంచల్ రావు భార్య)
- బెంగుళూరు పద్మ (అమ్మాయి)
- రాగిణి (రాగిణి)
- పద్మజయంతి
- రమ్యశ్రీ (రత్తాలు)
- వై. విజయ (రేలంగి భార్య)
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- నిర్మాత: బి. శివరామకృష్ణ
- మాటలు: దివాకర్ బాబు
- కథ: భూపతి రాజా
- ఆధారం: చరణ దాసి (1956), ది వ్రెక్ (నవల)
- సంగీతం: రమణీ భరద్వాజ్
- పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎం.ఎం.శ్రీలేఖ
- ఛాయాగ్రహణం: వి. శ్రీనివాస రెడ్డి
- కూర్పు: కోలా భాస్కర్
- నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్
- విడుదల:27:05:1997.
పాటలు
[మార్చు]| ఒక చిన్నమాట | ||||
|---|---|---|---|---|
| పాటలు by రమణీ భరద్వాజ్ | ||||
| Released | 1997 | |||
| Recorded | 1997 | |||
| Genre | పాటలు | |||
| Length | 29:24 | |||
| Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
| Producer | రమణీ భరద్వాజ్ | |||
| రమణీ భరద్వాజ్ chronology | ||||
| ||||
ఈ చిత్రానికి రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "ఓ మనసా తొందర (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:00 |
| 2. | "కుర్రకారు పూజించే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:07 |
| 3. | "అబ్బో ఓయబ్బో (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | మనో, ఎం.ఎం. శ్రీలేఖ | 5:06 |
| 4. | "మధురము కాదా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె.ఎస్. చిత్ర | 4:07 |
| 5. | "ప్రతి ఒక్కరి తొలి వలపున (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:09 |
| 6. | "ఎవరిని చూస్తూ ఉన్నా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:55 |
| మొత్తం నిడివి: | 29:24 | |||
మూలాలు
[మార్చు]- ↑ https://www.imdb.com/title/tt1579844/fullcredits?ref_=tt_ov_st_sm
- ↑ "Archived copy". Archived from the original on 6 October 2014. Retrieved 14 August 2020.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Heading". IQLIK MOVIES.
