బెంగుళూరు పద్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంగుళూరు పద్మ
Bangalore Padma.jpg
జననంపద్మ
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తిరంగస్థల, చలనచిత్ర నటి మరియు నృత్యకారిణి
క్రియాశీలక సంవత్సరాలు1977 – ప్రస్తుతం
మతంహిందూ
బంధువులుఅరుణ్ కుమార్ (భర్త), అప్పలస్వామి (తండ్రి), సుశీలా రాణి (తల్లి), శ్రీనివాస్ ప్రసాద్ (కుమారుడు), గాయత్రీరావు (కూతురు)

బెంగుళూరు పద్మ రంగస్థల, చలనచిత్ర నటి మరియు నృత్యకారిణి.[1] అనేక సినిమా లలో సహాయ నటిగా నటించింది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈవిడ అప్పలస్వామి, సుశీలా రాణి దంపతులకు కృష్ణా జిల్లా, విజయవాడ లో జన్మించింది. తండ్రి రైల్వే ఉద్యోగి అవడంతో బదిలీపై హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లోనే పద్మ బాల్యం గడిచింది. ఎం.ఎ (హిస్టరీ) చదివింది.

వివాహం[మార్చు]

ప్రముఖ రచయిత, నటుడైన అరుణ్ కుమార్ తో పద్మ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అబ్మాయి శ్రీనివాస్ ప్రసాద్, అమ్మాయి గాయత్రీరావు[2] లు కూడా నటులే. గాయత్రీరావు హ్యాపీ డేస్[3], ఆరెంజ్‌[4], గబ్బర్ సింగ్, ఏకలవ్య వంటి సినిమాలలో నటించింది.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

నాలుగు సంవత్సరాల వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించి, ఆలుమగలు చిత్రంలో అల్లు రామలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించింది. ఆతర్వాత బొమ్మరిల్లు అనే చిత్రంలో బాలనటిగా నటించింది. చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో చరణ్‌రాజ్ కి సహాయనటిగా చేసింది. అలా 150పైగా చిత్రాల్లో నటించింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

 1. 2007 - హ్యాపీ డేస్
 2. 2007 - మధుమాసం
 3. 2006 - మాయాబజార్
 4. 2003 - మిస్సమ్మ
 5. 2003 - దొంగరాముడు అండ్ పార్టీ
 6. 2002 - ఆది
 7. 1997 - ప్రేమించుకుందాం రా
 8. 1991 - కూలీ నెం.1
 9. 1977 - ఆలు మగలు

మూలాలు[మార్చు]

 1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స బ్లాగ్. "బెంగుళూరు పద్మ,Bangalore Padma". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 21 May 2017.
 2. టాలీవుడ్ టైమ్స్. "GAYATRI RAO". www.tollywoodtimes.com. Retrieved 21 May 2017.
 3. తెలుగు ఫిల్మీబీట్. ""సంక్రాంతి దాకా హవా నడుస్తుంది"". http://telugu.filmibeat.com/box-office/happydays-succes-311007.html. Retrieved 21 May 2017. External link in |website= (help)
 4. విశాలాంధ్ర. "ఆరెంజ్‌". Retrieved 21 May 2017. Cite news requires |newspaper= (help)