అభిషేకం (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిషేకం
Abhishekam Serial Title Card.jpeg
అభిషేకం (ధారావాహిక) టైటిల్
తరంకుటుంబ కథ
దర్శకత్వందాసరి నారాయణరావు, హరిచరణ్, లక్ష్మి శ్రీనివాస్, వెంకట్ శ్రీరామోజు
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య3380 ఎపిసోడ్స్ (సెప్టెంబరు 14, 2019)
ప్రొడక్షన్
Producerదాసరి పద్మ
నడుస్తున్న సమయం22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీసౌభాగ్య మీడియా లిమిటెడ్[1]
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ
వాస్తవ విడుదల2008 డిసెంబరు 22 (2008-12-22) –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
Website

అభిషేకం 2008, డిసెంబరు 22న ఈటీవీలో ప్రారంభమైన ధారావాహిక.[2][3][4] సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం ప్రసారం చేయబడింది.[5]

కథా సారాంశం[మార్చు]

కుటుంబ సంబంధాలు, మానవ విలువల కథలో అభిషేకం ధారావాహిక సాగుతుంది. నరసింహం, సుశీలకు వినయ్, సుమతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యసపరుడై తన తల్లిన వేధిస్తుంన్నందుకు వినయ్ తండ్రిని ద్వేషిస్తాడు. నరసింహం కారణంగా సుమతి చనిపోతుంది. దాంతో వినయ్ తన ఇంటిని వదిలివెళ్ళి ఒక గ్రామంలోని మస్టారు కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు.

అలా వినయ్ మాస్టారుతో 12 సంవత్సరాలు ఉంటాడు, ఆ సమయంలో మాస్టారు కుమార్తె రేఖ, వినయ్ ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. రేఖ నానమ్మకు ఇది ఇష్టం లేకపోవడంతో వినయ్, రేఖను దూరంగా ఉంచుతాడు. ఆ తరువాత వినయ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా మారి తన యజమాని కుమార్తె స్వాతిని కలుసుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇంతలో, వినయ్ అనుకోకుండా తన తల్లి, మాస్టారులను కలుస్తాడు.

ఆసుపత్రిలో ఉన్న రేఖ పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కువకాలం బతకదని వినయ్ తెలుసుకుంటాడు. తన తల్లి కోరిక మేరకు, రేఖ చివరి కోరికను తీర్చడానికి రేఖను వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత రేఖ కోలుకొని వినయ్ ఇంటికి వస్తుంది. ఈ పరిస్థితిలో వినయ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, భార్య స్వాతి విషయంలో తన ప్రవర్తన ఎలా ఉంటుందనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

 • రవి కిరణ్
 • సతీష్
 • మౌనిక
 • సమీరా షెరీఫ్ (స్నేహ)
 • చిన్న
 • అనన్య
 • సైమంత
 • శ్యామలదేవి
 • బెంగుళూరు పద్మ
 • సాయిమిత్ర
 • దిలీస్ తేజ[6]
 • హరితేజ
 • సాయినాధ్[7]
 • కౌశిక్
 • మధుబాబు
 • విష్ణు ప్రియ
 • కారుణ భూషణ్
 • శిరీష నులు (అర్చన)
 • సిద్ధార్థ వర్మ
 • సీత మహాలక్ష్మి
 • మిర్చి మాధవి
 • వందన
 • హనుమండ్ల ప్రణయ్
 • దేవి శ్రీ

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: దాసరి నారాయణరావు, హరిచరణ్, లక్ష్మి శ్రీనివాస్, వెంకట్ శ్రీరామోజు
 • నిర్మాత: దాసరి పద్మ
 • ప్రొడక్షన్ సంస్థ: సౌభాగ్య మీడియా లిమిటెడ్

మూలాలు[మార్చు]

 1. "Abhishekam 200 Episodes Celebration". Retrieved 15 March 2020.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
 2. "More spellbinding soap gathas". Outlook. Archived from the original on 2 February 2020. Retrieved 15 March 2020.
 3. "never-ending-longest-running-tv-serials-in-india-telugu-tops". ap7am. Archived from the original on 28 మార్చి 2019. Retrieved 15 March 2020.
 4. "Abhishekam serial 2500 episodes Celebrations". Archived from the original on 25 ఫిబ్రవరి 2017. Retrieved 15 March 2020.
 5. "Abhishekam ( అభిషేకం )". www.etv.co.in. Archived from the original on 2 ఫిబ్రవరి 2020. Retrieved 15 March 2020.
 6. "Dileep Teja, a film star in the making". The Hindu. Archived from the original on 2 February 2020. Retrieved 15 March 2020.
 7. "nandi-tv-awards-for-2014-2015-and-2016-announced-here-are-the-winners". timesofindia.com. Archived from the original on 2 February 2020. Retrieved 15 March 2020.

ఇతర లంకెలు[మార్చు]