బుడుగు (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుడుగు
దర్శకత్వంమన్‌మోహన్‌
నిర్మాతభాస్కర్‌, సారికా శ్రీనివాస్‌
తారాగణంలక్ష్మీ మంచు, ఇంద్రజ, శ్రీధర్‌రావు
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుశ్యామ్‌ మేనగ
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
హైదరాబాద్‌ ఇన్నోవేటీస్‌ ప్రై. లిమిటెడ్‌
విడుదల తేదీ
2015 ఏప్రిల్ 17 (2015-04-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

బుడుగు 2015లో విడుదలైన తెలుగు సినిమా. హైదరాబాద్‌ ఇన్నోవేటీస్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్ ల పై భాస్కర్‌, సారికా శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమాకు మన్‌మోహన్‌ దర్శకత్వం వహించాడు. లక్ష్మీ మంచు, ఇంద్రజ, శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 ఏప్రిల్ 2015న విడుదలైంది.[1]

కథ[మార్చు]

పూజ (లక్ష్మీ మంచు), రాహుల్(శ్రీధర్ రావు) దంపతులకు ఇద్దరు పిల్లలు బన్ని(మాస్టర్ ప్రేమ్ బాబు) విద్య (బేబీ డాలీ). రాహుల్ తన ఉద్యోగరీత్యా పిల్లలతో సరిగా గడపాడు. ఈ గ్యాప్ వల్ల బన్ని సరిగా ఉండడం లేదని, అతను అల్లరి ఎక్కువ చేస్తున్నాడని తండ్రి రాహుల్ తనని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు. అక్కడ బన్ని చేసిన కొన్ని సంఘటనల వలన స్కూల్ లో వాళ్ళందరూ భయపడి తనని అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపేస్తారు. ఇంటికి తిరిగొచ్చిన అనంతరం బన్ని చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. దాంతో బన్నిని పూజ చిల్డ్రన్స్ సైకాలజిస్ట్ గీత రెడ్డి (ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు బన్నికి ఉన్న సమస్య ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

  • లక్ష్మీ మంచు - పూజ [4]
  • ఇంద్రజ - డా.గీత రెడ్డి
  • శ్రీధర్‌రావు - రాకేష్
  • మాస్టర్‌ ప్రేమ్‌బాబు - బన్నీ
  • ఇందు ఆనంద్
  • సన - శశి
  • శైలజావాణి - పనిమనిషి
  • వెన్నెల - దియా

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హైదరాబాద్‌ ఇన్నోవేటీస్‌ ప్రై. లిమిటెడ్‌
  • నిర్మాత: భాస్కర్‌, సారికా శ్రీనివాస్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మన్‌మోహన్‌
  • సంగీతం: సాయి కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు

మూలాలు[మార్చు]

  1. The Times of India (17 April 2015). "Budugu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. Indiaherald (17 April 2015). "బుడుగు : రివ్యూ". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. IB Times (17 April 2015). "'Budugu' Movie Review Roundup: Lakshmi Manchu Starrer is a Good Concept Gone Bad" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  4. The Times of India (15 January 2015). "Lakshmi Manchu's Budugu" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.