సురేష్ రఘుతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ రఘుతు
జననం (1987-06-26) 1987 జూన్ 26 (వయసు 37)
ఖరాగపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తిసినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
తల్లిదండ్రులుజీవానందం రఘుతు, మణి రఘుతు

సురేష్ రఘుతు తెలుగు సినిమా రంగానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన చందమామ కధలు, గరుడవేగ , ఆకాశవాణి లాంటి పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సురేష్ రగుతు 26 జూన్ 1987లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఖరాగపూర్ లో జీవానందం రఘుతు, మణి రఘుతు దంపతులకు జన్మించాడు. సురేష్ తండ్రి రైల్వేస్ లో ఉద్యోగం కావడంతో ఆయన విద్యాభాస్యం అంత ఖరాగపూర్ లో సాగింది. ఆయన హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని జె.ఎన్.టి.యు లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ లో చేరి, సినిమాలపై మక్కువతో సినీరంగంలో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

సినీ జీవితం

[మార్చు]

సురేష్ రగుతు జె.ఎన్.టి.యు లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ లో చేరి, సినిమాలపై మక్కువతో సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆయన 2007లో కె.కె.సెంథిల్ కుమార్ వద్ద అసిస్టెంట్ కెమరామెన్ గా చేరి అరుంధతి , మగధీర , ఈగ , గోల్కొండ హైస్కూల్ వంటి సినిమాలకు పని చేశాడు. సురేష్ రఘుతు 2014లో విడుదలైన చందమామ కథలు సినిమా ద్వారా తొలిసారిగా సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.

సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు ఇతర విషయాలు
2014 చందమామ కథలు ప్రవీణ్ సత్తారు
2017 పిఎస్‌వి గరుడ వేగ ప్రవీణ్ సత్తారు [2]
2018 నన్ను దోచుకుందువటే ఆర్.ఎస్. నాయుడు
2021 థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ రమేష్‌ రాపర్తి
2021 తెల్లవారితే గురువారం మణికాంత్ జెల్లి
2021 ఆకాశవాణి అశ్విన్ గంగరాజు [3]
2021 భళా తందనానా చైతన్య దంతులూరి
2023 బబుల్‌గమ్ రవికాంత్ పేరేపు

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం వెబ్ సిరీస్ పేరు దర్శకుడు భాషా
2020 ఎక్స్‌పైరి డేట్ శంకర్ కే మార్తాండ్ తెలుగు
2021 ది బేకర్ అండ్ ది బ్యూటీ జొనాథన్ ఎడ్వర్ట్స్ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2 October 2018). "Suresh Ragutu's love for the lens" (in Indian English). Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
  2. The Hindu (26 December 2017). "Telugu cinema: Destination for DoPs" (in Indian English). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  3. Klapboard Desk (10 October 2020). "Akashavani is close to my heart: Suresh Raghutu". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.