Jump to content

రవికాంత్ పేరేపు

వికీపీడియా నుండి
రవికాంత్ పేరేపు
జననం
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
జీవిత భాగస్వామివిణా ఘంటసాల (వి. 2017)
పురస్కారాలునంది ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత

రవికాంత్ పేరేపు తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్.[1] 2016లో క్షణం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించిన రవికాంత్, అడివి శేష్ తోపాటు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు.

తొలి జీవితం

[మార్చు]

రవికాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో జన్మించాడు. తండ్రి పేరు నాగేశ్వరరావు. విశాఖపట్నంలోని కోశాక్ సేల్సియన్ స్కూల్ లో పాఠశాల విద్యను, మెగా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను చదివాడు. విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తెలుగు సినీ గాయకుడు ఘంటసాల మనవరాలు వీణా ఘంటసాలతో 2017, నవంబరు 11న రవికాంత్ వివాహం జరిగింది.[3]

సినిమారంగం

[మార్చు]

సహాయ దర్శకుడిగా

[మార్చు]

మణిరత్నం తీసిన సఖి సినిమా చూసిన రవికాంత్, తాను కూడా దర్శకుడిగా మారాలని అనుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా నటుడు అడివి శేష్ గురించి తెలుసుకొని, 2012లో హైదరాబాదుకు వచ్చాడు. 2013లో అడివి శేష్ దర్శకత్వం వహించిన కిస్ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

దర్శకుడిగా

[మార్చు]

2016లో తెలుగు వచ్చిన క్షణం అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరధ్వాజ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, సత్యదేవ్ కంచరాన తదితరులు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.[4][5] ఐడెల్ బ్రెయిన్ ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇచ్చింది.[6] ఈ చిత్రాన్ని సిబిరాజ్‌తో సత్య (2017) గా తమిళంలో రీమేక్ చేశారు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా విభాగం నటన పాత్ర గమనికలు
దర్శకుడు రచయిత ఎడిటర్ నటుడు
2016 క్షణం మార్వాడీ సేథ్
2020 కృష్ణ అండ్ హిజ్ లీల
భానుమతి & రామకృష్ణ భాను ప్రేమికుడు
2022 డీజే టిల్లు "నువ్వాలా" పాటకి సాహిత్యం
2023 మంత్ ఆఫ్ మధు
బబుల్‌గమ్ [7]

అవార్డులు

[మార్చు]
నంది అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "Ravikanth Perepu Interview to The Hindu". The Hindu. Retrieved 13 April 2021.
  2. "Facebook". www.facebook.com. Retrieved 13 April 2021.
  3. "Kshanam director Ravikanth Perepu gets married to dubbing artiste Veena Ghantasala". Hindustan Times. 2017-11-13. Retrieved 13 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "I am glad Kshanam broke all Tollywood stereotypes: Adah Sharma - Times of India". The Times of India. Retrieved 13 April 2021.
  5. "I'm kicked about the kudos Kshanam got: Adivi Sesh - Times of India". The Times of India. Retrieved 13 April 2021.
  6. "Kshanam review by jeevi - Telugu cinema review - Adivi Sesh, Adah Sharma & Anasuya Bharadwaj". www.idlebrain.com. Retrieved 13 April 2021.
  7. Prajasakti (23 December 2023). "'బబుల్‌గమ్‌' ప్రేమకథ : డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు – Prajasakti". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.

బయటి లింకులు

[మార్చు]