Jump to content

సఖి

వికీపీడియా నుండి
సఖి
దర్శకత్వంమణిరత్నం
తారాగణంఆర్. మాధవన్,
షాలిని
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

సఖి 2000 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం. ఇందులో మాధవన్, షాలిని, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించారు. తమిళ చిత్రం అలైపాయుదే చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఎ. ఆర్. రెహ్మాన్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంది. ఉత్తమ పరిచయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయగ్రాహకుడు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు దక్కాయి.

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

2000 సంవత్సరానికి ముందు దర్శకుడు మణిరత్నానికి ఇద్దరు, దిల్ సే రూపంలో రెండు పరాజయాలు ఎదురయ్యాయి. బైక్ పై వెళుతున్న ఒక ప్రేమ జంటను చూసిన మణిరత్నం ప్రేమలో ఉన్నపుడు అన్నీ బాగానే ఉంటాయి, పెళ్ళయ్యాకే అసలు కథ మొదలవుతుంది అనే ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ ఆధారంగా కథను రాసుకోవాలనుకున్నాడు. కొంతమంది షారుఖ్ ఖాన్ ఎంపిక చేసుకోమని కొంతమంది సూచించినా, ఈ కథలో అంతగా ప్రజాదరణ పొందని నటులను ఎంపిక చేసుకోవాలనుకున్నాడు. ఇద్దరు సినిమా ఆడిషన్ కు వచ్చి ఎంపిక కాలేకపోయిన మాధవన్‌ని కథానాయకుడుగా అనుకున్నాడు. గాయని వసుంధరా దాస్ ని మొదట కథానాయికగా అనుకున్నా తర్వాత ఓ చిత్రంలో షాలిని నటనను చూసి ఆమెను ఎంపిక చేశారు.[1]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారిన ఈ చిత్ర పాటలు సంగీతాభిమానులను సంగీతసాగరంలో ఓలలాడించాయి.

  • సఖియా చెలియా
  • అలై పొంగెరా కన్నా (గాయని: కల్పనా రాఘవేంద్ర)
  • కాయ్ లవ్ చెడుగుడు
  • కలలై పొయెను నా ప్రేమలు (గాయని: స్వర్ణలత)
  • స్నేహితుడా స్నేహితుడా
  • సెప్టెంబరు మాసం సెప్టెంబరు మాసం
  • ఏడే ఏడే వయ్యారి వరుడు

మూలాలు

[మార్చు]
  1. "25 Years of Sakhi: నిరాశ తర్వాత హీరోగా మాధవన్‌.. నో చెప్పిన విక్రమ్‌: 25 ఏళ్ల 'సఖి' విశేషాలివీ". EENADU. Retrieved 2025-04-14.
"https://te.wikipedia.org/w/index.php?title=సఖి&oldid=4512272" నుండి వెలికితీశారు