షాలినీ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాలినీ అజిత్ కుమార్, ప్రముఖ భారతీయ నటి. ఈమె బాల నటిగా చాలా సినిమాల్లో నటించారు. 3ఏళ్ళ వయసులో మలయాళం సినిమా  ఎంటె మమట్టిక్కుట్టియమ్మక్కుతో తెరంగేట్రం చేశారు షాలినీ. ఈ  సినిమా నవోదయా స్టూడియో నిర్మాణంలో విడుదలైంది. తెలుగు  సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) లో తన చెల్లెలు శామిలితో కలసి చిరంజీవి చేరదీసే అనాధ అమ్మాయి పాత్రలో నటించారు  షాలినీ. బేబీ షాలినీగా ఆమె ప్రసిద్ధి చెందారు. చాలా ఏళ్ళ తరువాత  ఆమె సినీ రంగానికి హీరోయిన్ గా తిరిగి వచ్చారు ఆమె. షాలినీ ప్రధాన పాత్రలో ఆమె నటించిన మొట్టమొదటి సినిమా అనియతి ప్రవు అతి పెద్దహిట్ గా నిలిచింది. ఆ తరువాత ఆమె మలయళం, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన కాదలుక్కు మరియధై (1997), నీరం (1999), అమర్ కలం (1999), అలైపాయుదే (2000), పిరియదా వరం వెండుం (2001) వంటి సినిమాలు ఆమె కెరీర్ లో  భారీ హిట్లుగా నిలిచాయి. 2000లో షాలినీ తమిళ సినిమా  నటుడు  అజిత్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు  పిల్లలు.

తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితం[మార్చు]

1979 నవంబరు 20న మలయాళీ కుటుంబంలో జన్మించారు.[1][2] ఆమె తండ్రి బాబు కేరళలోని కొల్లంకు, తల్లి అలైస్ చెన్నైకు చెందినవారు. నటుడవ్వాలనే కోరికతో ఆమె తండ్రి చెన్నైకు కుటుంబాన్ని మార్చారు. ఆయన సాధించలేకపోయినా, తన కుమార్తెల ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు.[3] చెన్నైలోని ఫాతిమా మాట్ హెచ్.ఆర్ సెక్ స్కూల్,  ఆదర్ష్ విద్యాలయ, చర్చ్ పార్క్ కాన్వెంట్లలో చదువుకున్నారు షాలినీ.  ఆమె అన్నయ్య రిచర్డ్ రిషి, చెల్లెలు షామిలీ కూడా సినీరంగంలోనే  స్థిరపడ్డారు. షాలినీ బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడతారు. ఆమె కొన్ని  రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఆడారు.[4][5]

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; mangalamvarika.com అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Ajith Shalini Marriage Ajith Kumar Wedding Photos Tamil Actor Details » Psyphil Celebrity Blog.
  3. http://www.mangalam.com/mangalam-varika/143728?page=0,1
  4. `Acting is a lot of responsibility'.
  5. Tamil Nadu / Tiruchi News : From a child artiste to badminton player. The Hindu: (15 September 2006). URL accessed on 2012-07-12.