అమ్మదొంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మదొంగ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం కృష్ణ,
సౌందర్య,ఆమని
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ మౌళి క్రియేషన్స్
భాష తెలుగు
  • సినిమా సంగీతం: కోటి. రాజ్-కోటి జంట విడిపోయిన తరువాత 'కోటి' ఒంటరిగా సంగీతం అందింఛిన తొలి సినిమా 'అమ్మ దొంగ'.
  • దీనికి కథ: సత్యమూర్తి; మాటలు: వినయ్; కూర్పు: గౌతంరాజు; కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి; ఆర్ట్: బాబ్జీ.

సినిమా పాటలు[మార్చు]

  • 1. తహతహ తాకిడి...
  • 2. నీతో సాయంత్రం...
  • 3. పిల్ల అదరహో...
  • 4. ఏదో మనసుపడ్డాను గానీ..
  • 5. బోలో కృస్ణా ముకుందా...

సంక్షిప్త సినిమా కథ[మార్చు]

చక్రధర్ (కృష్ణ), తన చెల్లెలితో పాటు మరో ఇద్దర్ని హత్య చేసిన నేరమ్మీద జైలుకెల్లడంతొ కథ మొదలవుతుంది. శిక్ష పూర్తయి, విడుదలై వస్తుండగా సౌందర్య కలిసి అతనితో పాటు కోటిపల్లి వెళుతుంది. అక్కడ రఛ్ఛబండ దగ్గర తనను అన్యాంయంగా జైలుకు పంపిన నలుగురు విలన్లనీ ఇప్పుదు హత్య చేసి తప్పింఛుకుంటానని చెబుతాడు కృ ష్ణ. అక్కడి ఇన్స్పెక్టర్ చరణ్ రాజ్ కృష్ణ మిత్రుడే కానీ కర్తవ్య బధ్ధుడు. ఒక విలన్ కూతురు కృష్ణ మరదలు, ఆమని. ఇక రెండు హత్యలు చేస్తాడు కృష్ణ. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కథానాయిక సౌందర్య ఆశ్ఛర్య పరుస్తుంది. ఇక రెండో భాగంలో కృష్ణ గతం వివరించడంతో సౌందర్య నిజం తెలుసుకుంటుంది. తన అన్నను ఛంపింది కృష్ణ కాదని. స్స్ గతం లోనూ ఆమనికి పోటీగా ఇంద్రజ ఉందని...చరణ్ రాజ్ నుండి కృష్ణని కాపాడడంలో ఇద్దరు కథానాయికలూ పోటీ పడతారు. కృష్ణ తన శపథం నిలబెట్టుకుంటాడు. పగ, ప్రతీకారం కథలో ముగ్గురమ్మాయిల మధ్య కృష్ణ దాగుడు మూతలు, చచ్చిపోయిన ముగ్గురు విలన్లూ దయ్యాలై ఛేసే హాస్యమూ సినిమాని రక్తి కట్టంఛాయి... ఇదీ 'అమ్మ దొంగా!' కథా సారాంశం.