ఎస్. వి. కృష్ణారెడ్డి
ఎస్.వి.కృష్ణారెడ్డి | |
---|---|
జననం | సత్తి వెంకట కృష్ణారెడ్డి 1964 జూన్ 1 కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1991 - |
ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.[1] దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు.[2] కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.
వృత్తి
[మార్చు]మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు. కృష్ణారెడ్డి హైదరాబాదుకు రాగానే సినిమా తీయడం కోసం అనేక వ్యాపారాలు చేశారు.
సినిమాలు
[మార్చు]- కొబ్బరి బొండాం
- రాజేంద్రుడు-గజేంద్రుడు
- మాయలోడు
- నంబర్ వన్ (1994)
- యమలీల
- తక్దీర్ వాలా(హిందీ)
- శుభలగ్నం
- జుడాయి(హిందీ)
- టాప్ హీరో
- ఘటోత్కచుడు
- వజ్రం
- సంప్రదాయం
- మావిచిగురు
- వినోదం
- గన్ షాట్
- ఎగిరే పావురమా
- ఆహ్వానం
- ఉగాది
- ఊయల
- దీర్ఘ సుమంగళీ భవ
- పెళ్ళి పీటలు
- అభిషేకం
- మనసులో మాట (1999)
- ప్రేమకు వేళాయెరా
- కోదండ రాముడు
- సర్దుకుపోదాం రండి
- శ్రీ శ్రీమతి సత్యభామ
- సకుటుంబ సపరివార సమేతంగా
- బడ్జెట్ పద్మనాభం
- ప్రేమకు స్వాగతం
- పెళ్ళాం ఊరెళితే
- జాబిలి
- పెళ్ళాంతో పనేంటి
- అతడే ఒక సైన్యం
- లేత మనసులు
- ఒరేయ్ పండు
- హంగామా
- సరదా సరదాగా
- మాయాజాలం
- బహుమతి
- మస్త్
- యమలీల 2 (2014)
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)
- Yamaleela Etv series
మూలాలు
[మార్చు]- ↑ IVS. "Director S V Krishna Reddy Birthday Today". businessoftollywood.com. Business of Tollywood. Retrieved 18 October 2016.
- ↑ "స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 22 November 2017.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా సంగీత దర్శకులు
- 1964 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా గాయకులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా సంగీత దర్శకులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా దర్శకులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా రచయితలు