Jump to content

గన్ షాట్

వికీపీడియా నుండి
‌గన్‌షాట్
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్వీ కృష్ణారెడ్డి
నిర్మాతకె. అచ్చిరెడ్డి
తారాగణంఆలీ,
ప్రకాష్ రాజ్,
కీర్తి రెడ్డి
ఛాయాగ్రహణంశరత్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంఎస్వీ కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
మనీషా ఫిల్మ్స్
విడుదల తేదీ
1996
భాషతెలుగు

గన్‌షాట్ 1996 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, ఆలీ, కీర్తి రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కె. అచ్చిరెడ్డి మనీషా ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. శరత్ కెమెరామెన్ గా వ్యవహరించగా కె. రాంగోపాల్ రెడ్డి ఎడిటర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, సంగీతం కూడా ఎస్. వి. కృష్ణారెడ్డి అందించాడు. విచ్చలవిడిగా హత్యలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తిరిగే ఓ విలక్షణమైన హంతకుడి కథ ఇది. హంతకుడు ప్రకాష్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. కీర్తి రెడ్డి ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.[1]

రాంబాబు ( ఆలీ) డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు. ధనవంతుల ఇంటి బిడ్డైన హీరోయిన్ (కీర్తి రెడ్డి) ఓ సారి ఇంటి నుంచి పారిపోయి వచ్చి రాంబాబు దగ్గర తల దాచుకుంటుంది. అదే క్రమంలో అతన్ని ప్రేమిస్తుంది. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్ళిపోతారు. రాంబాబు హీరోయిన్ పంపిన డబ్బుతో ఓ కారు కొని ఆమెను కలుసుకుని పెళ్ళాడాలని విశాఖపట్నం బయలుదేరతాడు. మార్గమధ్యంలో అతనికి ప్రకాష్ తారస పడతాడు. ప్రకాష్ రాంబాబును కొడుకుగా దత్తత తీసుకుంటాడు. తరువాత అతను చేసే హత్యలన్నీ కళ్ళారా చూసి అతన్నించి తప్పించుకోవాలని పలుమార్లు ప్రయత్నిస్తాడు. కానీ మళ్ళీ పట్టుబడిపోతాడు. పోలీసుల విచారణలో రాంబాబు నిజంగా ప్రకాష్ కొడుకే అని తెలుస్తుంది. అంతే కాకుండా ప్రకాష్ అలా సైకోగా మారడానికి అతని చిన్నప్పుడు చూసిన హత్యలు కారణమని తేలుస్తారు. చివరికి ప్రకాష్ తన కొడుకు రాంబాబు చేతిలోనే చనిపోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కీర్తి రెడ్డి కి కలసిరాని తొలిప్రేమ బ్లాక్ బస్టర్". APHerald [Andhra Pradesh Herald]. Retrieved 2020-08-28.
"https://te.wikipedia.org/w/index.php?title=గన్_షాట్&oldid=4206371" నుండి వెలికితీశారు