Jump to content

కీర్తి రెడ్డి

వికీపీడియా నుండి
కీర్తి రెడ్డి
కీర్తి రెడ్డి


వ్యక్తిగత వివరాలు

జననం (1978-11-17) 1978 నవంబరు 17 (వయసు 46)
Indiaహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
తల్లిదండ్రులు గడ్డం ఆనంద్ రెడ్డి [1]
నివాసం హైదరాబాద్
మతం హిందూ

కీర్తి రెడ్డి ప్రముఖ చలనచిత్ర నటి. ఈవిడ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది. గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి రెడ్డి, పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంద్వారా గుర్తింపు పొందింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

కీర్తి రెడ్డి 1978, నవంబరు 17న హైదరాబాద్లో జన్మించింది. కీర్తి రెడ్డి తల్లి డ్రస్ డిజైనర్, తాత గడ్డం గంగారెడ్డి నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం మాజీ ఎంపీ.[2] కీర్తిరెడ్డి బెంగుళూర్ లోని జిడ్డు కృష్ణమూర్తి యొక్క వ్యాలీ పాఠశాలలో చదువుకుంది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. కొంతకాలం హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ చదువుకుంది. ఉన్నత విద్యను ఆమె, కెనడా టొరంటో రఎర్సన్ విశ్వవిద్యాలయంలో చదివింది.[3]

వివాహం

[మార్చు]

2004లో కీర్తి రెడ్డి వివాహం ప్రముఖ నటుడు సుమంత్తో జరిగింది. వారు 2006 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014 లో లండన్లో సెటిలైన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.[3]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

1996లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన గన్ షాట్ చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు సినిమాలో నటించిన కీర్తి రెడ్డి, 1997లో తమిళంలో నటించిన దేవతై సినిమా కీర్తి రెడ్డికి విజయాన్ని అందించింది. 2004లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిలీంఫేర్ పురస్కారాన్ని అందుకుంది.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
1996 గన్ షాట్ తెలుగు
1997 దేవతై కాయల్ తమిళం
నందిని తమిళం
1998 జాలీ చెల్లెమ్మ తమిళం
ఇనియావలే మంజు తమిళం
తొలిప్రేమ అను తెలుగు
1999 నినైవిరుక్కుం వారై సంధ్య తమిళం
ప్రేమించే మనసు తెలుగు
రావోయి చందమామ రుక్మిణి తెలుగు
2000 తేరా జాదు చల్ గయా పూజా హిందీ
2001 ప్యార్ ఇష్క్ ఔర్ మొహబత్ ఈషా నాయిర్ హిందీ
2002 బదాయి హో బదాయి ప్లోరెన్స్ డిసౌజా హిందీ
సూపర్ స్టార్ దేవయాని కన్నడ
2004 అర్జున్ మీనాక్షి తెలుగు ఫిలింఫేర్, ఉత్తమ సహాయ నటి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 May 2021). "'తొలిప్రేమ' హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం". Sakshi. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  2. 2.0 2.1 Celebsunseens. "Keerthi Reddy Wiki, Height, Weight, Age, Affairs, Measurements, biography & More". www.celebsunseens.com. Archived from the original on 6 May 2017. Retrieved 3 May 2017.
  3. 3.0 3.1 టాలీవుడ్ టైమ్స్. "కీర్తి రెడ్డి". tollywoodtimes.com. Retrieved 3 May 2017.[permanent dead link]