మగమహారాజు
మగమహారాజు | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
రచన | ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (కథ), కాశీవిశ్వనాథ్ (మాటలు), వేటూరి (పాటలు) |
నిర్మాత | మాగంటి రవీంద్రనాథ చౌదరి |
తారాగణం | చిరంజీవి , సుహాసిని |
ఛాయాగ్రహణం | ఎం. వి. రఘు |
కూర్పు | కె. సత్యం |
సంగీతం | కృష్ణ చక్ర |
నిర్మాణ సంస్థలు | శ్యాంప్రసాద్ ఆర్ట్స్, లక్ష్మీ ఫిలింస్ |
సినిమా నిడివి | 145 ని |
భాష | తెలుగు |
మగ మహారాజు 1983 లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మించిన తెలుగు చిత్రం.[1] చిరంజీవి, సుహాసిని మణిరత్నం, రావు గోపాలరావు, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.
కథ
[మార్చు]రాజు ఒక నిరుద్యోగ యువకుడు. రాజుకు కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. అతనికి ఒక పెళ్ళి కాని చెల్లెలు ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళు అతను ఓ గౌరవప్రదమైన ఉద్యోగంలో స్థిరపడి తమను బాగా చూసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులలో, రాజు మంచి కుటుంబానికి చెందిన సుహాసిని అనే యువతిని కలుస్తాడు. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. రాజు, డబ్బు సంపాదించడానికి, సైకిల్ రేసులో పాల్గొంటాడు, సైకిల్ నడుపుతాడు, పగలు, రాత్రి 8 రోజులు నాన్స్టాప్, డబ్బును గెలుస్తాడు. తరువాత, సుహాసిని అతన్ని వివాహం చేసుకుని అతని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
నటీనటులు
[మార్చు]- రాజుగా చిరంజీవి
- సుహాసిని
- ఉదయ్‌కుమార్
- రాళ్ళపల్లి
- నిర్మలమ్మ
- రావు గోపాలరావు
- రోహిణి
- అన్నపూర్ణ
- బాలాజీ
- తులసి
- హేమ సుందర్
- నూతన్ ప్రసాద్
- ధమ్
- కమలాకర్
- హరి
- అనూరాధ
- కె. విజయ
- పి. ఆర్. వరలక్ష్మి
- ఆనంద్ మోహన్
- బౌనా
- పొట్టి ప్రసాద్
- సత్తిబాబు
- రమణ
- మాస్టర్ చిట్టిబాబు
- ఆకెళ్ల
- మల్లిఖార్జునరావు
- అల్లు రామలింగయ్య (అతిథి పాత్ర)
పాటలు
[మార్చు]ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతం అందించారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, పి. సుశీల, ఎస్. జానకి, వాణీ జయరాం, ఎస్. పి. శైలజ, రమణ పాటలు పాడారు.
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "నీదారి పూలదారి" | ||
2. | "అన్నలో అన్న" | ||
3. | "సీతే రాముడి కట్నం" | ||
4. | "నీలాలు నిండే" | ||
5. | "మా అమ్మ చింతామణీ" |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ tollymasala.com. "Megastar Chiranjeevi Hits And Flops - Tollywood News- tollymasala.com updates". Archived from the original on 2021-02-09. Retrieved 2020-08-20.