ఛాలెంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛాలెంజ్ చిత్రంలో సన్నివేశం

చిత్ర కథ[మార్చు]

గాంధీ అనే యువకుడు ( చిరంజీవి ) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్ మోహన్ రావు ( రావు గోపాలరావు ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ చాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే " ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ".ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదయినా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ చాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి.ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం.

ఛాలెంజ్
(1984 తెలుగు సినిమా)
Challenge.jpg
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం కె.యస్.రామారావు
కథ యండమూరి వీరేంద్రనాధ్
చిత్రానువాదం సాయినాథ్
తారాగణం చిరంజీవి,
సుహాసిని,
విజయశాంతి,
రావుగోపాలరావు,
గొల్లపూడి మారుతీరావు,
రాజేంద్ర ప్రసాద్,
సాయికుమార్,
కృష్ణ చైతన్య,
ప్రసన్న కుమార్,
సిల్క్ స్మిత
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం యస్.పీ.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
నృత్యాలు తార
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
సంభాషణలు జి.సత్యమూర్తి
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కళ భాస్కరరాజు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  • మామా, ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
  • ఇందువదన కుందనదన మందగమన మధురవచన
  • సాయంకాలం సాగరతీరం
"https://te.wikipedia.org/w/index.php?title=ఛాలెంజ్&oldid=3717975" నుండి వెలికితీశారు