Jump to content

గాలికొండపురం రైల్వేగేటు

వికీపీడియా నుండి
(గాలికొండాపురం రైల్వే గేట్ నుండి దారిమార్పు చెందింది)
పుస్తక ముఖచిత్రం
(పుస్తకం డాట్ కాం నుండి)

గాలికొండాపురం రైల్వే గేట్ వంశీ వ్రాసిన ఒక నవల.

రచన నేపథ్యం

[మార్చు]

రచయిత వంశీ తెలుగు సినిమా రంగంలో పేరొందిన దర్శకులు. ఆయన ఒకసారి సంగీత దర్శకుడు ఇళయరాజాతో మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతుండగా, మధ్యలో ఇళయరాజా స్వగ్రామమైన పణ్ణయపురం వెళ్ళారు. ఆ ప్రయాణంలో దారిలో ఎక్కడపడితే అక్కడ ఇళయరాజా కోసం వచ్చే అభిమానుల వల్ల ప్రయాణం చాలా ఆలస్యమైంది. పణ్ణయపురం ఓ కొండకు ఆనుకుని ఉంటుంది, ఆ ప్రయాణంలోనే రైల్వేగేటు పడితే ఆగారు. సరిగా అదే సమయంలో గాలికొండాపురం రైల్వేగేటు కథకు బీజం తన మనస్సులో పడినట్టు వంశీ చెప్పారు.[1]

ఎత్తైన కొండలమధ్య ప్రకృతి ఒడిలో అందమైన పల్లెటూరు గాలికొండపురం. అక్కడ నివసించే రైల్వేఉద్యోగులు గిరిజనుల సమస్యలను తీరుస్తూ తల్లోనాలుకలా మెసలే ఓ తెలివైన టీచరు సుగుణ, ఆమె భర్త విశాఖపట్నంలో పని చేసే ఓ పోలీసాఫీసర్ పేరు మురళీకృష్ణ, గాలికొండాపురం రైల్వేగేట్ స్టేషను మాష్టరు మాలి, ఆ ఊరికి వచ్చిన టూరిస్ట్ లకు బలవంతంగా చుట్టుపక్కల ప్రాంతాలను చూపించే ఓ గైడ్ జగన్నాథం, స్టేషను ఎదురుగా ఉన్న హోటలు ఓనర్ కం సర్వర్ హరిబొంధూ, ఇవీ నవలలోని ముఖ్య పాత్రలు.

ఓ రోజు కొందరు కాలేజి టూరిస్టులతో కలిసి ఆ స్టేషను లో దిగిన కామిని చర్యలు అనుమానాస్పదంగా ఉంటాయి ఆమె ఆపల్లెలో తన స్మగ్లింగ్ ప్లాన్ సక్రమంగా అమలవ్వాలంటే అక్కడివారికి దిశానిర్దేశం చేసే సుగుణని తప్పించాలని తన హత్యకోసం పలువిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి ఓ ప్రయత్నంలో ఎదురు తిరిగిన సుగుణ కామిని ని కొట్టి కుర్చీకి కట్టేస్తుంది. ఆపై ఏంచేయాలో అర్ధంకాక సహాయం కోసం స్టేషను మాష్ట్రర్ మాలి ని తీసుకొచ్చేసరికి కామిని చనిపోయి ఉంటుంది. కామినిని తనే చంపాననుకున్న సుగుణ మాలి, జగన్నాథం, హరిబొంధూ సహాయంతో కామిని శవాన్ని లోయలో పడేస్తుంది. కామిని ముఠా స్మగ్లింగ్ కార్యకలాపాల గురించి ఇన్వెస్టిగేషన్ కోసం సుగుణ భర్త మురళీకృష్ణ అదే ఊరికి ట్రాన్స్ఫరై వస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సుగుణ వల్ల ఈ హత్య జరగలేదు అని నిరూపించి ఆపై ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు అన్నది మిగిలిన కథ.

మూలాలు

[మార్చు]
  1. వంశీ (1 మార్చి 2015). "వంశీ ఇళయరాజా". సాక్షి ఫన్‌డే. Archived from the original on 7 జూలై 2015. Retrieved 4 March 2015.

ఇతర లింకులు

[మార్చు]