మంచుపల్లకీ

వికీపీడియా నుండి
(మంచు పల్లకి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మంచు పల్లకి
(1982 తెలుగు సినిమా)
Manchupallaki.jpg
దర్శకత్వం వంశీ
నిర్మాణం ఎమ్. ఆర్. ప్రసాదరావు
కథ రాజశేఖర్
చిత్రానువాదం వంశీ
తారాగణం సుహాసిని (గీత),
చిరంజీవి (శేఖర్),
రాజేంద్ర ప్రసాద్ (హరి),
నారాయణరావు (వాసు),
సాయిచంద్ (కుమార్),
గిరీష్ (గాంధీ),
గీత తండ్రి (శేఖర్),
పి.ఎల్. నారాయణ (వాసు సహోద్యోగి),
భీమేశ్వరరావు (డాక్టర్)
దేవదాస్ కనకాల (వాసు సహోద్యోగి)
మాష్టర్ ఆలీ (వాసు తమ్ముడు)
అన్నపూర్ణ (శ్యామలమ్మ),
రాజారెడ్డి, మాధవీలత, పుష్యమి, లక్ష్మీ దేవదాస్, సోనియా, జయలత
సంగీతం రాజన్ నాగేంద్ర
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్. జానకి
గీతరచన శ్రీశ్రీ,
వేటూరి సుందరరామమూర్తి,
గోపి
సంభాషణలు యండమూరి వీరేంద్రనాధ్
ఛాయాగ్రహణం హరి అనుమోలు
కూర్పు అనిల్ దత్తాత్రేయ
నిర్మాణ సంస్థ అనీల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మంచుపల్లకీ చిరంజీవితో యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా మొట్టమొదటి సినిమా. సినిమా కథ ఐదుగురు మిత్రుల (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీష్)చుట్టూ తిరుగుంది. ఈ ఐదుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది సుహాసిని. ఆమె మంచితనాన్ని చూసి చిరంజీవి ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ ఐదుగురు మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది. సుహాసినిని వివాహం చేసుకోవాలనుకొన్న చిరంజీవి ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో నారాయణ రావు చెల్లెలు పెళ్ళి చెడిపోతుంది. చివరకు సుహాసిని కోరిక మేరకు చిరంజీవి మిత్రుడి చెల్లెల్ని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి-సుహాసిని కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. (మగమహారాజు, ఛాలెంజ్, కిరాతకుడు, రాక్షసుడు, ఆరాధన, మంచి దొంగ, మరణ మృదంగం)

ఇది పాలవైన చోలై అనే తమిళసినిమా పునర్నిర్మాణం. వంశీకి దర్శకునిగా, హరి అనుమోలుకు ఛాయాగ్రాహకునిగా మొదటి సినిమా.


పాటలు[మార్చు]

  • మనిషే మణిదీపం, మనసే నవనీతం - బాలు - వేటూరి
  • విష్‌యూ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్
  • మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం - జానకి - వేటూరి
  • పగలు రేయిలో జారకముందే, వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటాం - బాలు - శ్రీశ్రీ
  • నే కోసమే మేమందరం - బాలు, జానకి - గోపి

ఇవి కూడా చూడండి[మార్చు]


వనరులు, మూలాలు[మార్చు]