మంచుపల్లకీ (నవల)
స్వరూపం
మంచుపల్లకి | |
మంచుపల్లకి నవల ముఖచిత్రము | |
కృతికర్త: | వంశీ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | నవభారత్ బుక్ హౌస్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ |
విడుదల: | నవంబర్ 1975 |
మంచుపల్లకీ తెలుగు సినీ దర్శకుడు వంశీ రచించిన నవల. ఇది వంశీ రాసిన మొట్టమొదటి నవల. ఈ పుస్తకంలో అతను రాసిన మొదటి వాక్యం “ఊహ కమ్మగా ఉంటుంది, వాస్తవం కటువుగా ఉంటుంది… నిజం” [1]
ఈ పుస్తకం మొత్తం వసుబాబు అనే పాత్ర ఆలోచనా విధానం గూర్చి నిండి ఉంటుంది. అతని జీవితపు మానసిక సంఘర్షణల ప్రయాణమంతా ఉంటుంది. ఈ ప్రయాణంలో అతనికి అర్థంకాని మనుషులూ, తనకు ఎదురైన భిన్నమైన మనస్తత్వాలు కల మనుషులతో తనకు ఇష్టం లేకపోయినా రాజీపడిన సందర్భాలు, బలహీనతల్ని పరిచయం చేసే వ్యక్తిత్వాలు ఎన్నో ఎదురవుతాయి. అతను జీవితంలో ఎవరి ప్రేమాభిమానాలనూ పొందలేక, ఏ నేరం చేయకపోయినా ప్రపంచంలో ప్రతీ జీవరాశికీ శత్రువవుతాడు. అతను ప్రతీ అడుగులోనూ ఓటమిని ఎదుర్కొంతూ ఉంటాడు. అతను ఎవరికీ అర్థంకాక అందరిచే అసహ్యించబడతాడు.
ఇతర విశేషాలు
[మార్చు]- ఈ నవల నవభారత్ వారి "నవలా ప్రియదర్శని" నవలా పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకొన్నది.
మూలాలు
[మార్చు]- ↑ "సరికొత్త ప్రక్రియ - పొలమారిన జ్ఞాపకాలు -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-23. Retrieved 2021-04-14.