Jump to content

ఆనాటి వాన చినుకులు

వికీపీడియా నుండి
ఆనాటి వాన చినుకులు
పుస్తక ముఖచిత్రము
కృతికర్త: వంశీ
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సంకలనం
ప్రచురణ: ఎమెస్కో
విడుదల: 2003

ఆనాటి వాన చినుకులు 23 కథలను చేర్చి ముద్రించిన పుస్తకము.

దీని రచయిత... వంశీ

వంశీ అనగా!?

అవును. నిజమే. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల రచయిత.

ఆనాటి వానచినుకులు పుస్తకాన్ని ఎమెస్కో వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో ఆనాటి వానచినుకులు అనే పేరుతో 2008లోద్వితీయ ముద్రణ చేశారు.పుస్తకము అట్ట మీది బొమ్మలను బాపు గారు గీయ్యగా, లోపలి కథలకు అన్వర్ , ఎన్.వి.వివేక్‍ఆనంద్ లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా అంటూ శ్రీ వేమూరి బలరామ్, శ్రీ వేమూరి సత్యనారాయణ గార్లకు అంకితమిచ్చాడు.తిరిగి అక్టోబరు 2010లో మరికొన్ని కథలను చేర్చి 32కథలతో ఆకుపచ్చని జ్ఞాపకం అనే పేరుతో ముద్రణ చేశారు

వంశీ రాసిన ఈ కథల గురించి..అంటూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు చక్కని ముందుమాటలను రాసారు.

ఇంద్రగంటి గారి మాటలలో వంశీ....

ఎలాచూడాలో.ఎక్కడచూడాలో,ఎందుకు చూడాలో,చూపించడం మంచిరచనకు,మంచి రచయితకు ప్రమాణమనుకుంటాను......ఇన్ని వాక్యాల నాఘోష సారాంశం,పాండిత్య ప్రగల్భతకంటె ప్రత్యక్ష జీవితానుభవ ప్రగల్భత ఎప్పుడూ గొప్పదని.ఇందుకే యీ కథలరచయిత,వంశీ అంటే గౌరవము.ఇంకొందుకు కూడా ఈయన కథలపట్ల గౌరవము.ఇవి ఆరుబయళ్లలలో,కొండ కోనల్లో,గోదావరి వడిలో,పల్లెల వీథుల్లో,వెన్నెల్లో.వానల్లో తిరిగినవి,తడిసినవి,తనిసినవి.....ఈయనకు జీవితంలోని రాగవైరాగ్యాలు,అందాలు,వికారాలు పుష్కలంగా తెలుసు.మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించడం తెలుసు.వెన్నెల వర్షం,గోదావరి,అంతగా అనుభవించి పలవరించడం బహుశా చాలా కొద్ది మంది రచయితలు చేసి వుంటారు.....సంగీతమంటే ప్రాణంపెట్టె వంశీ,కవిత్వం జోలికి-పోనీ,కవిననిపించుకుందామనే కోరిక జోలికి-పోయిన జాడలు కనిపించవు......వంశీ,కవిత్వహృదయంతో కథలు చెపుతారని మీకు యీ కథలు చెపుతాయి.ఈ కథల్లో ముఖ్యమైన ఆకర్షించే బలం,ఈ రచయిత ఆయా మనుష్యుల్ని చూపిస్తూ చిత్రించే వాతావరణం.ఈ DETAIl వీటి ప్రాణం.వంశీలో ఒక ECENTRIC భావుకత్వం(UNCONVENTIONAL AND STRANGEఅని నా ఉద్దేశం)'శిల,'బొత్తిగా అర్థంకాని మనిషికల వంటి కథల్లో పై చెయ్యిగా కన్పిస్తుంది.ఈయన వెల్లడించే వర్షాలు, రాత్రులు, వెన్నెల, గోదావరి రేవులు, ఇసుక బయళ్ళు PICTURESQUE గా వుండి, కవిత్వానుభవాన్ని పంచి పెడతాయి.మట్టినీ, గాలినీ ప్రేమింపజేస్తాయి.ఒక్కొక్కసారి, కథను పాత్రలు నడిపితే, ఒక్కొక్కసారి అనుభవాల వత్తిడిలోనుంచి కోలుకునే ప్రయత్నంగా, తన నుంచి తన్ను విముక్క్తం చేసుకోవడానికా!అన్నట్లుగా, వంశీ తానే కథను నడుపుతాడు.జీవితాన్ని అన్ని రకాల ఒడిదుడుకులతో ప్రేమించే కథలంటే నాకిష్టం.బహుశా చాలా మంది కిష్టం.వంశీ అటువంటి, ఇటువంటి కథలు రాసినందుకు నాకిష్టం.

ఇందులోని కథలు 1975నుండి 2007 వరకు వ్రాసినవి.ఈ కథలలో మూడు, నాలుగు కథలు తప్ప మిగిలినవన్ని ఆంధ్రజ్యోతి, స్వాతి వారపత్రిక లలో అచ్చయ్యినవ్వే.

ఈ పుస్తకంలోని కథలు

[మార్చు]

1. కరైకుడి నాగరాజన్; 2. బాచి; 3. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం; 4. అలా అన్నాడు శాస్త్రి; 5. సీరియల్ రాత్రులు; 6. ధారావహికం; 7. ఒక అనుబంధం-ఒక ప్రారంభం; 8. ది ఎండ్; 9. బొత్తిగా అర్ధం కాని మనిషి; 10. యానం ఏటిగట్టు మీద; 11. శిల; 12. బాబురావు మేష్టారు; 13. ఆకుపచ్చని జ్ఞాపకం; 14. ఎర్రశాలువా; 15. నల్లసుశీల; 16. ఆనాటి వాన చినుకులు; 17. ఒకశిథిలమైన నగరం; 18. కాకినాడలో రైలు బండెక్కి కోటిపల్లి వెళ్ళాం; 19. ఉప్పుటెరుమీద ఒక ఊరు; 20. రాజమండ్రిలో కైలాసం; 21. సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి; 22. రాజహంసలు వెళ్లిపోయాయి, 23. కల

ఈ కథల్లో 'కారైకుడి నాగరాజన్', 'శిల', 'బాబూరావు మేష్టారు'అనే మూడు సంగీతము ఇతివృత్తంగా నడిచిన కథలు. 'అలా అన్నాడు శాస్త్రి', 'ఆనాటి వాన చినుకులు' అనేవి కవిత్వపు నేపథ్యంలో పుట్టినవి. 'ది ఎండ్', 'బొత్తిగా అర్థం కాని మనిషి', 'ఒక అనుభవం ఒక ప్రారంభం' అనే కథలు వ్యక్తిగత సదసత్సంశయాల్లోంచి ఆవిర్భవించినవి. 'ఒక శిథిలమైన నగరం అనే కథ-శిథిల హంపి గురించి, 'రాజహంసలు వెళ్ళిపోయాయి'అను కథ యానాం-ఎదుర్లంక మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ నేపథ్యంలో రాసినది. ఇక 'సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి' అనే కథ నేపథ్యం-కొత్తగా పెళ్ళైన ఒక యువజంట తమ హనీమూన్ ను సీతారామా లాంచిలో రాజమంద్రి నుండి పాపికొండల వరకు ప్రయాణిస్తూ జరుపుకోవడం, ఆ సమయంలో లాంచీవారితో పరిసరగ్రామ వాసులతో వారి సంబంధాలను మనోహరంగా వర్ణిస్తూ సాగుతుంది. ప్రస్తుతం చర్చలో వున్న పోలవరం డ్యాము నిర్మిస్తే, లాంచీలను నమ్ముకు బ్రతుకుతున్నవారి బ్రతుకులు ఎలా కకలావికలమవ్వుతాయో, గోదావరి వడ్డునున్న ఎన్ని గిరిజన గ్రామాలు నీటమునిగి, అక్కడి ప్రజలు వలసపొయ్యే స్ధితిని, కలిగే నష్టాన్ని కన్నులకు కట్టెటట్లు రాసేడు వంశీ. మిగిలిన కథలన్నీ మనుష్యుల్నీ, జీవిత మర్మాల్నీ, పరిశీలించిన అనుభవాలనుండి పుట్టినవి. ఈ కథలలోని పాత్రలు మన జ్ఞాపకాలలో వెంటాడుతునే వుంటాయి.

కరైకుడి నాగరాజన్

[మార్చు]

కారైకుడి నాగరాజన్:చిన్నప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడో, అల్లరిచేసినప్పుడో 'ఏడ్చావంటే పిల్లొస్తుందనీ, బూచాడొస్తాడై, లేదా దయ్యమొస్తుందనీ భయపెట్టి వూరుకో బెడతారు.అదుగో!అప్పుడు మొదలైన భయం పెద్దయినా చిన్నప్పుడు నాటుకుపోయిన ఆభయాలు వాళ్లనుంచి దూరంకావు, అసలు భయమంటే ఏమిటో మనమే వాళ్లలో కల్గిస్తాం.నాగరాజుకు పాము భయం. 35 ఏళ్ల నాగరాజు నాగస్వరం వూదే విద్వాంసుడు.సినిమా ఆర్కెస్ట్రాలో నాగస్వరం వూది సంపాదిస్తుంటాడు.నాగరాజు పుట్టినప్పుడు తనకి నాగ గండముందని చెప్పడంతో తల్లి తండ్రులు నాగరాజు అని పేరు పెట్టారు.చిత్రంగా నాగగండమున్న నాగరాజుకు నాగస్వరముదటమే జీవనం.నాగరాజు పెద్దవుతున్నా నాగగండం భయం పోలేదు, సరికదా భయం రెట్టింపు అవ్వడం మొదలైనది.పాము పేరెత్తితేచాలు గడగడ వణకిపోయేవాడు.దేన్నైతే మర్చిపోయి బతకాలనుకుంటున్నాడో అదే తనచుట్టూ అల్లుకుని క్షణంక్షణం తనని బలంగా కౌగిలించుకుని, తడీపెదవుల్తో మురద్దాడుతూ మరీ తనకి జీవితం ఇవ్వడం జరుగుతుంది.చివరికి తన స్థితి ఎలా వచ్చిందంటే దాని జ్ఞాపకంలోక్షణంకూడా బతకలేడు.కానీ, అది తనలో లేకపోతే అసలు బతుకే లేదు .ఈ పాము భయంనుండి దూరంగా పారిపోదామంటే వీలుకాని భార్య-బంధం.పోనీ చేసేపనిలో పూర్తిగా లీనమై మర్చిపోదామని ప్రయత్నిస్తే తను వాయించేది నాగస్వరం.అలాంటి నాగరాజు, ఒకరాత్రివేళ ఇంటివద్ద పామును తొక్కుతాడు.ప్రాణ భయం పట్తుకొంటుంది నాగరాజుకు.అయితే చివరకు ఆభయం నుండి బయట పడ్తాడు నాగరాజు.అదే?ఎలా? .......క్యాసెట్టు అయిపోయింది.నాగస్వరం ఆగిపోయింది.తన్మయత్వంతో ఆడిన పాము అక్కడ నిశ్శబ్బం ఏర్పడేసరికి 'బుస్స్ స్స్..'మని టేపురికార్డరు మీద మూడు కాట్లువేసింది.అప్పటికీ నాగస్వరం వినిపించకపోవడంతో, దగ్గరలో వున్న నాగరాజును ఏమి చెయ్యకుండా తనదారిన తను శరవేగంతో వెళ్ళిపోతుంటే మిడిగుడ్లతో ఆ పామునే చూస్తూవుండిపోయినాతడు.ఇక జన్మలో పామంటే భయపడలేదు.అలా ఆ నాగుపాము తన శరీరం మీద కాకుండా తనభయం మీద కాటు వేయడంతో ఈ జన్మకి పాము అంటే భయం పోయింది నాగరాజ్‍కి .

బాచి

[మార్చు]

బాచి:బాచి రచయితకు మిత్రుడు.బాచి తత్వమేమిటో వూర్లో వారికే కాదు, రచయితకు కూడా పూర్తిగా తెలియదు.అతడుచేసే పనులు అలాంటివి.ఒకసారి నిద్రపోతున్న వాళ్ల నాయనమ్మ బంగారపుమురుగుని సబ్బుబిళ్లరుద్ది లాగేసి ద్రాక్షారామమ్లోని బేబి అనే టీచరుకిచ్చాడు.ఆమేకు భర్తలేడు.ఇద్దరు పిళ్లలు.పేళ్ళాడతానని కొన్నాళ్ళు వెంటతిరిగాడు.మరోసారి ఆదిరెడ్డిగారి కోడలికి దయ్యం పవిడిపించటానికొచ్చిన భూతవైద్యుని పళ్ళూడకొట్టాడు.మురమళ్ళలోని బాలింతరాలికి కాంపు కష్టమైతే రాజమండ్రి తీసికెళ్లి వైద్యం చేయించాడు.మరోసారి చిట్తిపంతులుగారింటి వెనుక పడిపోయిన గోడలలో పాము చేరితే దాన్ని పట్తుకొని, సాయంత్రం వరకు గుడి అరుగు మీద ఆడించి ఆతరువాత వూరిచివర సమాధి వద్ద వదలి వేశాడు.వూరివాళ్ళ దృష్టిలో తింగర మనిషి.బాచి స్నేహితుడు/రచయిత మద్రాసు వెళ్ళిపోయి, 20 సంవత్సరాల తరువాత ఆ వూరువచ్చినప్పూడు బాచి గురించి ఆరా తీస్తాడు.కపాలేశ్వరుడు గుడి వుద్యోగి చెల్లెల్తో ఊరువిడచి వెళ్ళిపోయడని వూర్లోజనంచెప్తారు.ఆలా ఎందుకు చేసాడని అడగగా 'ఆ మదపిచ్చోడి గురించి చెప్పెదేముందంటారు.ప్రస్తుతం బాచి యానాం రేవుకు పదిమైళ్ల దూరంలోని పిచ్చుకల లంకలో వుంటున్నట్లు తెలుసుకొని రచయిత అక్కడికి వెళ్తాడు.అక్కడ తిప్ప అంచున వుంది బాచి ఇళ్లు. రచయిత మాటల్లో....ఆ ఇసుక తిప్ప మధ్యలో నిలబడి ఎటుచూసినా గోదావరే కనిపిస్యున్నది.పచ్చి ఇటుకల గోడల్ని పేడతో అలికి సున్నం ముగ్గులు పెట్టి, పైన రెల్లు గడ్దితో నేసిన కుటీరం ఒకటి తిప్ప అంచుననే ఉంది.పచ్చి వెదుళ్లతో చుట్టూ కట్టిన దడికి ఒక మూల చుక్కుడుపాదూ, ఇంకోమూల పుచ్చ పాదూ పాకి వున్నాయికుటీరం వెనకాల తులసికోటా, దానికి కాస్త దూరంలో గోరింటాకు మొక్కా, కరివేరపూలమొక్క ఉన్నాయి.కుటిరంలో వున్న ఆడు మనిసి నల్లబోర్డరున్న బూడిదరంగు చీరకట్తుకుంది.అడ్డపాపిటతీసి, జడవేసుకొని పెద్ద కుంకుమ బొట్తు పెట్తుకునివుంది.ఆమెకు కుడికాలు లేదు.బాచి మిత్రున్ని సంతోషంగా ఆహ్వనించి అథితి సత్కారంచేసాకా, ఇలా ఎందుకు జరగిందని అడుగుతాడు.బాచీ జరిగింది చెప్పాడు.ఉళ్ళో కొవ్వూరి రాములు, సంఛారతెగకు చెందిన వెంకటలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, వాళ్ల పొలంలోని పాకలో వుంచి, బిడ్దపుట్టగా, ఆబిడ్డనోట్లో వడ్లగింజలు వేసి చంపగా, అదితెలుసుకున్న బాచీ పంచాయితి పెట్టించి, వెంకటలక్ష్మి మెళ్ళో రాములు చేత మూడు మూళ్లు వేయించాడు.ఆ విధంగా వూర్లోని అగ్ర కులాలవారి కోపానికి గురైనాడు.రెండు మూడ దపాలు చంపించాడానికి ప్రయత్నింఛారు.అదృష్టవశాత్తు ఆచి తప్పించుకున్నాడు.కపాలేశ్వరస్వామి దేవాలయంలో ఈ వుద్యోగి చెల్లెలికి షుగరు వ్యాధి వచ్చి కాలు తీసెస్తే భర్త వదిలేశాడమెని.బాచి మీద పగ పెంచుకున్న వూరిజనం ఏ ఆధారంలేని వుద్యోగి చెల్లెల్ని పెళ్ళిచేసుకొని దారి చూపించు అని బాచిని రెచ్చ గొట్టారు.ఆలోచించిన బాచి, ఆమెదగ్గరకు వెళ్లి మాట్లాడక, ఆమెను రాములవారి గుడికి తీకెళ్లి పెళ్ళి చేసుకున్నాడు.ఈ విషయం తెలిసిన ఇంటివాళ్లు వెలి వెయ్యగా, ఇక్కడకు వచ్చి, తనకు నచ్చిన వాతావరణన్ని నిర్మించుకుని వుంటున్నాని చెప్పుటాడు.రచయితకు మిత్రున్ని మనస్సెమిటో తెలుస్తుంది.రచయిత తిరుగు ప్రయాణమైతున్నప్పుడు

బాచీ"నాలాంటి వాణ్ణి చూడ్డానికి చాలా దూరం వచ్చావు నువ్వు"అంటాడు.

"నీలాంటి ప్రత్యేకమైన మనుషులు ఎక్కడున్నా వెళ్ళితీరాలి"అంటాడు రచయిత.

"నీ ఆపోహ గాకపోతే నా ప్రత్యేకమేమీటి"అనంటాడు బాచి.

"మహనుభావుల్తో పోల్చుకుంటే చాలా మాములు జీవితం నాది.చాలామంది మాములు మనుషుల జీవితంలో జరిగే సాదాసీదా సంఘటనలే నా జీవితంలోనూ జరుగుతూ వస్తున్నాయి.అయితే ఒ క్క విషయం.ఈ మధ్యఒక గ్రంథం చదివి దాంట్లో ఒక సత్యాన్ని జీర్ణం చేసుకున్నాను.ఆ సత్యాన్నే నేను అమలు పెట్టడం జరిగెతే భవిష్యత్తులో ఎప్పుడన్నా నన్ను చూడ్డానికి రావొచ్చు నువ్వు. అప్పుడీమాటన్నఒక అర్థం ఉంటుందేమో!"అంటాడు బాచి

"ఏంటా సత్యం"

"విశాలదృక్పథమే జీవితం"

"సంకుచితత్వమే మృత్యువు"

"స్వార్థపరత్వమే సర్వనాశనం"

"ఇదే జీవిత సత్యం"

ఆనాటి వాన చినుకులు

[మార్చు]

తనుతీసే సినిమాల్లాగే బ్రతికే మనిషీ పతంజలి.

జీవితంలో ఇతనికి అత్యంత ఇష్టమైంది ఒంటరితనం.స్నేహితులు, సన్నిహితులు లేరు.అత్త్యంత ఉన్నత సాహిత్యం తప్ప సాదాసీదా పుస్తకాలు ముట్టడు.పంక్షన్లకు, ప్రారంభోత్యవాల కెళ్ళడు.అభిమానులను కలవడు.వాళ్ళ వుత్తరాలు స్వయంగా చదవడు, ప్రత్యుత్తరం ఇవ్వడు.పతంజలికి కంపించే ప్రతిది పరిశుభ్రంగా వుండాలి.అందమైన అభిరుచితో, చక్కని భావుకతతో నిండిపోవాలి.

అలాజరగాలంటే మనిషి విన్సెంట్ వేంగో, ఎడ్మండ్ డ్యూలాక్, బోరిస్ వేలిగజోల లాంటి పాశ్చాత్య కళాకారుల వర్క్సు స్టడి చెయ్యాలి.ఒమర్‍ఖయ్యాము, పిల్లమర్రి చిన వీరభద్రుడు, ఖలీల్ జిబ్రాన్ లాంటి కవుల్నీ;'శిలాలోలిత'అనేకావ్యం రాసి ఆత్మహత్య చేసుకున్న 'రేవతిదేవి'లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్నీ జీర్ణం చేసుకోవాలి.పాల్ మారియట్'ఇన్నియో మొర్రికాన్ని', హ్యూగో మాంట్రిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్సు కంపోజిషన్స్‍ని ఔపోసన పట్టాలి.అప్పుడే జనానికి పరిశుభ్రత, సంస్కారం, అభిరుచి, భావుకత ఏర్పడుతాయి.అప్పూడే మాములు మనిషి కూడా మహాభావుకుడిగా మారుతాదని పతంజలి నమ్మకం, ప్రగాఢ విశ్వాసం.

కృష్ణారావు పతంజలి సెక్రెటరి.తూ.గో.జిల్లా.ఐనవరం మండలానికి చెందిన, మారు మూల గ్రామం గంధంవారి పాలెంకు చెందిన ఎస్.ఎస్.నారాయణరావుకు పతాంజలి అంటే వీరాభిమానం.పట్టు వీడక వుత్తరాలు రాసేవాడు. కృష్ణారావు ఎలాగోలా పతంజలిని ఒప్పించి ప్రత్యుత్తరం ఇప్పిస్తాడు.ఆవుత్తరం చూసిన గంధంవారి పాలెం ప్రజలు అబ్బురపడి, అందరు ముకుమ్మడిగా రాజమండ్రి వెళ్ళి, ఆయన తీసిన సినిమా చూసి, వూరంతా ఆయన అభిమానులై పోయి, పతంజలికి తమగ్రామంలో సన్మానం చేయాలని తీర్మానించి, ఆ అభ్యర్థనను, నారాయణరావు వుత్తరంద్వారా తెలియపర్చారు.వీలాంటి వాటికి దూరంగా వుండే పతంజలి మొదట నిరాకరించినప్పటికి, కృష్ణారావు బలవంతం మీద ఒప్పుకుంటాడు.గంధంవారిపాలెంకు నేరుగా రవాణా సౌకర్యం లేదు.రాజమండ్రి వరకు ఎక్సుప్రెసు రైలులో వచ్చి, అక్కడినుండి బలభద్రపురం వరకు ప్యాసింజరు రైలులో, అక్కడినుండిరాజానగరంవెళ్ళెబస్సులో కొంతదూరం వెళ్ళి, అక్కడినుండి మూడుమైళ్ళు మట్టిరోడ్దులో ప్రయాణిస్తేకాని గంధంవారి పాలెం చేరలేము.రాజమండ్రినుండి ఎర్రబస్సు దిగే వరకు పతంజలి ప్రయాణం అసౌకర్యంగా, అపరిశుభ్ర పరసరాలచుట్టు జరిగింది.ఇవన్ని చూసాకా పతంజలికి పరిశుభ్రత,భావుకతవిషయంలో తనకు మొదటినుండి వున్న అభిప్రాయమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేశాడు.బస్సు దిగిన తరువాత గంధం వారిపాలెంకు వెళ్ళటానికి ఎటు వంటి ఆటోలు, టాక్సీలు లేవు.ఒక రిక్షా తప్ప.

చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయికాళ్ళు,చలువ చేయించి కట్టుకొన్న ఖాకీ నిక్కారూ మోచేతుల దాకా మడచిపెట్టిన రంగు వెలసిన గళ్లచొక్కా,నున్నగా గీసుకున్న గడ్డం,నూనె రాసుకుని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాఫ్‍తో వున్నాడు రిక్షావాడు.పేరు గోపాలం.బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి శిరిపాదం వరకూ పరిశీలించి చూచిన పతంజలికి ఎంత స్వచ్చంగా వున్నాడీ మనిషి అనిపించింది.రిక్షాలో ముందు రెండు పెద్ద సూట్‍కేసులుండటం వలన, కాళ్ళు పెట్టుకొనుటకు ఇబ్బందిగా వుండటంతో, కాలినడకనే వెళ్ళుట మేలని ఎంచి, లగేజితో వున్న రిక్షాను ముందువెళ్ళమంటారు.రిక్షా వాళ్లను క్రాస్ చేసుకు వెళ్లుండగా, రిక్షా సైన్ బోర్డు పై రాసిన వాక్యం చదువుతాడు పతంజలి.

ఆనాటి వాన చినుకులు.

"ప్రాణమున్న శిల్పంలా నిలబడి పోయాడు పతంజలి....ఆ భాషలో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి.ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆవాన చినుకులు.ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆవాక్యాలు.ఏ ఉర్వశి నిర్ధయతో నిందింస్తే నిర్మింపబడ్దయో ఆవాన చినుకులు.ప్రకృతి పరవశించినప్పుడా?విరహం వికటించినప్పుడా?గజ్జెలు కట్టిన లేగదూడ ఘలం ఘలించినప్పుడా?

ఆనాటి వానచినుకులు-ఎన్ని అర్ధాలు నిక్షిప్తమైఉన్నాయి ఆ వాక్యంలో.ఎంతమంది బైరన్‍లూ, కృష్ణశాస్ర్తులూ దాక్కుని ఉనారు ఆ వాక్యంలో....ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లోంచి వెచ్చగా వెలుపకొచ్చిందా వాక్యం.

ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏవీ చదవక్కరలేదు.ఏదీ వినక్కరలేదు.భావుకుడు తయారుకాడు.జన్మిస్తాడు.మనిషిలో స్పందన.ప్రకృతిలో ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం.