బొమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మ (Doll) అనేది ఒక మానవ నమూనా. మానవ నాగరికత ఆరంభం నుంచి బొమ్మలు ఉన్నాయి. రాయి, మట్టి, చెక్క, ఎముక, వస్త్రం మరియు కాగితం నుంచి పార్సెలీన్, చైనా రబ్బరు మరియు ప్లాస్టిక్ వరకు అనేక రకాల పదార్థాలతో వీటిని రూపొందించడం జరుగుతుంది.

సాంప్రదాయికంగా బొమ్మలు పిల్లలకు ఆట వస్తువులుగా ఉన్నాయి, అయితే వీటిని యువకులు కూడా సేకరిస్తున్నారు, కుటుంబ వ్యామోహం, అందం, చారిత్రక ప్రాధాన్యత లేదా ఆర్థిక విలువ ఆధారంగా యువకులు వీటిని సేకరించడం జరుగుతుంది.[1] పురాతన కాలంలో, బొమ్మలను ఒక దేవతకు ప్రతిరూపాలకు ఉపయోగించేవారు, మతపరమైన కార్యక్రమాలు మరియు సంప్రదాయాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ప్రాణంతో ఉన్నట్లుగా కనిపించే లేదా శరీరనిర్మాణ సంబంధమైన బొమ్మలను వివిధ ఆరోగ్య ప్రక్రియలు లేదా పిల్లల యొక్క లైంగిక వేధింపుల కేసులను దర్యాప్తు చేసేందుకు ఆరోగ్య నిపుణులు, వైద్య పాఠశాలలు మరియు సామాజిక కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు కళాకారులు మానవ రూపాన్ని గీయడంలో అనుసంధానం చేసిన చెక్క నమూనాలను ఉపయోగిస్తారు. మహావీరుల (సూపర్‌ హీరోలు) ను ప్రతిబింబించే కదిలే ప్రతిమలు మరియు వాటి పూర్వగాములైన కదిలే బొమ్మలు బాలల్లో బాగా ప్రాచుర్యం కలిగివున్నాయి.[2]

చరిత్ర[మార్చు]

1870వ దశకానికి చెందిన బిస్క్యూ తల బొమ్మ

అతి పురాతన ఆటవస్తువుకు మొదటి ఉదాహరణగా బొమ్మలే ఉన్నాయని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి, ఈజిప్టు సమాధుల్లో సుమారుగా 2000 BCE కాలానికి చెందిన బొమ్మలను గుర్తించారు. ఈజిప్టులతోపాటు, గ్రీసు మరియు రోమ్‌లలో కూడా పిల్లల సమాధుల్లో ఎక్కువగా బొమ్మలు కనిపించాయి. వీటిలో ఎక్కువ బొమ్మలు చెక్కతో తయారు చేయబడ్డాయి, సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలతో మృణ్మయ బొమ్మలను కూడా సమాధి చేశారు. కదిలే అవయవాలు మరియు దుస్తులు మార్చేందుకు వీలున్న బొమ్మలను 200BCE కాలంలో గుర్తించారు.

రోమన్ బొమ్మల-తయారీదారులు ఈజిప్షియన్‌లు మరియు గ్రీకులు అభివృద్ధి చేసిన ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగించారు, అయితే తమ సంస్కృతిలో కళా స్పందనకు అనుగుణంగా, వారు ఎప్పటికప్పుడు మరింత లలితమైన మరియు అందమైన బొమ్మలు తయారు చేసేందుకు ప్రయత్నించారు. రోమ్‌లోని ప్రాతీ సమీపంలో దొరికిన ఒక బొమ్మను దంతంతో తయారు చేశారు, దీనిని పద్దెనిమిదేళ్ల వయస్సులో చనిపోయిన యజమానితో కలిపి సమాధి చేశారు. ఈ బొమ్మ పక్కన ఒక చిన్న పెట్టె ఉంది, దీనిని కూడా దంతంతోనే తయారు చేశారు, దీనిలో చిన్న దువ్వెనలు మరియు ఒక వెండి అద్దం ఉన్నాయి. బొమ్మ చేతి వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి, పెట్టెను తెరించేందుకు ఉపయోగించే ఒక చిన్న తాళాన్ని ఈ బొమ్మ పట్టుకొని ఉంది. ఈరోజు పిల్లలు మాదిరిగా, రోమన్ నాగరికతలో బాలలు కూడా వారి బొమ్మలకు దుస్తులు వేయడం మరియు మార్చడం చేసేవారు, తాజా ధోరణులకు అనుగుణంగా ఈ బొమ్మల జట్టును మరియు వేళ్లను అలంకరించేవారు.

ఐరోపా తరువాత బొమ్మల తయారీ కేంద్రంగా మారింది. వాల్ గార్డెనాకు చెందిన దుస్తులు మార్చగల పెగ్ వుడెన్ డాల్ (మేకులతో కలిపిన చెక్క బొమ్మ) బాగా ప్రసిద్ధి చెందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పౌర యుద్ధం తరువాత 1860వ దశకంలో బొమ్మల తయారీ ఒక పరిశ్రమగా మారింది.[3] రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్లాస్టిక్‌లు అభివృద్ధి చేయడం కొత్త రకాల బొమ్మల తయారీకి దారితీసింది, అంతేకాకుండా దీనితో వాటి ధరలు తగ్గిపోయాయి.

ప్రస్తుతం ఇంటర్నెట్ కాల్పనిక బొమ్మలను పరిచయం చేసింది, వెబ్‌సైట్‌లలో వీటిని తయారు చేయడం, దుస్తులు అలంకరించడం మరియు ఆడుకోవడం జరుగుతుంది, స్టార్‌డాల్ అనే ఇటువంటి ఒక వెబ్‌సైట్‌లో 17 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

ప్రతి సాధ్యనీయ పదార్థంతో కొన్ని యుగాలుగా బొమ్మలు తయారు చేయబడుతున్నాయి: బిస్క్యూ, సెల్యులాయిడ్, చైనా, మట్టి, వస్త్రం, మొక్కజొన్న పొత్తులు, కాగితం, ప్లాస్టిక్, పాలీమర్ క్లే, పార్సెలీన్, రెసిన్, రబ్బరు, వినైల్, మైనం, చెక్క, ఎముక, దంతం, పాపీర్-మాచే, చర్మం, మరియు ఇతరాలను బొమ్మల తయారీకి ఉపయోగించారు.

లింగ భేదాలు[మార్చు]

పశ్చిమ సమాజంలో, ఆటవస్తువుల ఎంపికలో ఒక లింగ భేదాన్ని గుర్తించడం మరియు దానిపై అధ్యయనం చేయడం జరిగింది. సాంప్రదాయిక పురుష చిహ్నాలకు ప్రాతినిధ్యం వహించే కదిలే బొమ్మలు మగ పిల్లల్లో ప్రాచుర్యం కలిగివున్నాయి, సాధనాలు, రవాణా, గ్యారేజ్‌లు, యంత్రాలు మరియు సైనిక పరికరాలకు సంబంధించిన బొమ్మలను ఎక్కువగా బాలురు ఎంచుకునేవారు. స్త్రీ లక్షణాలకు సంబంధించిన బొమ్మలను బాలికలు ఎంచుకునేవారు, వస్త్రాలు, వంటగది ఉపకరణాలు, వంటపాత్రలు, గృహోపకరణాలు, ఆభరణాల సంబంధిత బొమ్మలను బాలికలు ఎక్కువగా ఇష్టపడేవారు.[4][5][6]

బొమ్మ ఆస్పత్రులు[మార్చు]

బొమ్మల పునరుద్ధరణ లేదా మరమత్తులో ప్రత్యేకత కలిగివున్న ఒక పనిప్రదేశాన్ని బొమ్మల ఆస్పత్రిగా పరిగణిస్తారు.[7]

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బొమ్మల ఆస్పత్రులను గుర్తించవచ్చు. [8] అతి పురాతన బొమ్మల ఆస్పత్రిని పోర్చుగల్‌లోని లిస్పాన్‌లో 1830లో ఏర్పాటు చేశారు,[8] మరోదానిని మెల్బోర్న్‌లో స్థాపించారు, ఆస్ట్రేలియాలో మొట్టమొదటి బొమ్మల ఆస్పత్రిగా ప్రాచుర్యం పొందిన ఈ కేంద్రాన్ని 1888లో ఏర్పాటు చేశారు.[7] అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక డాల్ డాక్టర్స్ అసోసియేషన్ ఉంది.[9] 43 సంవత్సరాలుగా ఈశాన్య ప్యారిస్‌లో తన షాపులో బొమ్మలు మరమత్తు చేస్తున్న హెన్రీ లౌనే తన వృత్తిజీవితంలో 30,000లకుపైగా బొమ్మలను పునరుద్ధరించానని చెప్పారు. అతని ఖతాదారుల్లో ఎక్కువ మంది పిల్లలు కాకుండా, 50 మరియు 60 ఏళ్ల వయస్సులోని వయోజనులు ఉన్నారు.[10]

అమెరికన్ గర్ల్ మరియు మేడమ్ అలెగ్జాండర్ వంటి కొన్ని బొమ్మల తయారీదారులు తమ బొమ్మలకు బొమ్మల ఆస్పత్రులను నిర్వహిస్తున్నాయి.

సేకరణదారుల వస్తువులు[మార్చు]

పురాతన బొమ్మలు సేకరణదారుల వస్తువులుగా మారాయి. బ్రు మరియు జుమెయు వంటి ఫ్రెంచ్ తయారీదారులు సృష్టించిన 19వ శతాబ్దపు బిస్క్యూ బొమ్మలు ప్రస్తుతం సుమారుగా $22,000 ధర పలుకుతున్నాయి.[11]

కళగా బొమ్మలు[మార్చు]

బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల్లో ఎల్లప్పుడూ జానపద కళగా సృష్టించడం జరిగింది, 20వ శతాబ్దంలో బొమ్మలను ఒక ఉన్నత కళగా అంగీకరించడం మొదలైంది. కళాకారుడు హాన్స్ బెల్మెర్ జర్మనీలో ఒక సంపూర్ణ ఆర్య సంస్థగా నాజీ పార్టీ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా 1930వ మరియు 1940వ దశకాల్లో అధివాస్తవికత బొమ్మలను తయారు చేశారు.[12] ఈస్ట్ విలేజ్ కళాకారురాలు గ్రీర్ లాంక్టోన్ మాదకద్రవ్య బానిసత్వం, అగ్నిమాంద్యం మరియు ఉత్పరివర్తనను ప్రతిబింబించే బొమ్మలను సృష్టించడం ద్వారా 1980వ దశకంలో ప్రసిద్ధ వ్యక్తిగా మారారు.[13]

బొమ్మల్లో ముఖ్యమైన రకాలు[మార్చు]

width=45%
 • యాక్షన్ ఫిగర్
 • ఆఫ్రికన్ బొమ్మలు
 • బాల్-జాయింటెడ్ డాల్
 • బిస్క్యూ డాల్
 • నల్లని బొమ్మలు
 • బబుల్‌హెడ్ డాల్
 • సెలెబ్రిటీ డాల్
 • చైనా బొమ్మ
 • ఫ్యాషన్ డాల్
 • హోపీ కాచైనా డాల్స్
width=45%
 • ఇన్యుట్/ఎస్కిమో డాల్స్
 • జపనీస్ సాంప్రదాయిక బొమ్మలు
 • మాత్రియోష్కా డాల్
 • కాగితపు బొమ్మ
 • పారియన్ డాల్
 • పెగ్ వుడెన్ డాల్
 • రాగెడీ ఎన్ డాల్
 • రీబోర్న్ డాల్
 • వూడూ డాల్

పండగలు మరియు ప్రదర్శనలు[మార్చు]

 • హినామాట్సూరీ (జపాన్ బొమ్మల పండగ)

వీటిని కూడా చూడండి[మార్చు]

 • స్టఫ్డ్ యానిమల్
 • టెడ్డీ బేర్

సూచికలు[మార్చు]

 1. "ఇట్స్ ఎ డాల్స్ లైఫ్, ఏరియల్ హీర్ష్‌ఫెల్డ్, హారెట్జ్". మూలం నుండి 2009-08-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-13. Cite web requires |website= (help)
 2. ఓల్డ్ సోల్జర్స్ నెవర్ డై, న్యూయార్క్ టైమ్స్
 3. "ఎ హిస్టరీ ఆఫ్ డాల్స్". మూలం నుండి 2007-09-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 4. Servin, A (1999). "Sex differences in 1-, 3-, and 5-year-olds' toy-choice in a structured play session". Scandinavian Journal of Psychology. 40. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 5. Nelson, Anders (2005). "Children's Toy Collections in Sweden—A Less Gender-Typed Country?". Sex Roles. Springer Science+Business Media, Inc. 52 (1/2).
 6. Sobieraj, S. "Taking control: Toy commercials and the social construction of patriarchy". Masculinities and violence (L. Bowker సంపాదకులు.). Thousand Oaks, CA: Sage.
 7. 7.0 7.1 డాలింగ్ అవుట్ ట్రీట్‌మెంట్ యాక్సెస్డ్ 22-2-2010
 8. 8.0 8.1 లిస్బాన్ డాల్ హాస్పటల్ ట్రీట్స్ ఓనర్స్ బ్లూస్ టూ యాక్సెస్డ్ 22-2-2010
 9. డాల్ డాక్టర్స్ అసోసియేషన్ యాక్సెస్డ్ 22-2-2010
 10. "హెన్రీ లౌనీ, ఫ్రెంచ్ డాక్టర్ టు డాల్స్ - ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్". మూలం నుండి 2008-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-18. Cite web requires |website= (help)
 11. "హెన్రీ లౌనీ, ఫ్రెంచ్ డాక్టర్ టు డాల్స్ - ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్". మూలం నుండి 2008-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-18. Cite web requires |website= (help)
 12. "It's a Doll's Life, Ariel Hirschfeld, Haaretz". మూలం నుండి 2009-08-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-13. Cite web requires |website= (help)
 13. "Greer Lankton". మూలం నుండి 2009-10-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-10-25. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=బొమ్మ&oldid=2815648" నుండి వెలికితీశారు