మసూద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మసూద
మసూద సినిమా పోస్టర్
దర్శకత్వంసాయికిర‌ణ్
నిర్మాతరాహుల్ యాదవ్ నక్కా
తారాగణంసంగీత‌
తిరువీర్‌
కావ్య కళ్యాణ్ రామ్
శుభలేఖ సుధాకర్
ఛాయాగ్రహణంనగేష్‌ బానెల్‌
కూర్పుజెస్విన్ ప్రభు
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీs
18 నవంబరు 2022 (2022-11-18)(థియేటర్)
21 డిసెంబరు 2022 (2022-12-21)(ఆహా ఓటీటీ)
సినిమా నిడివి
160 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మసూద, 2022 నవంబరు 18న విడుదలయిన తెలుగు సినిమా.[1] స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హార‌ర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాలో సంగీత‌, తిరువీర్‌, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించగా ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు.[2][3] ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమయింది.[4]

కథా సారాశం

[మార్చు]

17 ఏళ్ళ అమ్మాయి విచిత్రంగా ప్రవర్తించడం, ఆమె ఒంటరి తల్లి ఆ అమ్మాయిని రక్షించడానికి పిరికివాడైన పొరుగింటి అబ్బాయిని సహాయం కోరడమనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

ప్రచారం

[మార్చు]

2020 డిసెంబరు 4న ఈ సినిమా పేరును, ప్రధాన నటసాంకేతికవర్గం పేర్లను తెలియజేస్తూ సినిమా యూనిట్ ఒక పోస్టర్ ను విడుదలచేసింది.[9] 2022 ఆగస్టు 2న సినీనటుడు నాని, ఈ సినిమాకు సంబంధించిన 84 సెకన్ల టీజర్‌ను లాంచ్ చేశాడు.[10] 2022 నవంబరు 11న ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ త‌మిళ భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌లచేయనున్నట్టు నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ప్ర‌క‌టించి, తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించాడు.[11] అయితే, తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు ద్వారా ఈ సినిమా నవంబరు 18న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.[12]

2022 నవంబరు 12 శనివారం రోజున సినీ నటుడు విజ‌య్ దేవరకొండ, ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.[13]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

 1. దాచీ దాచీ (రచన: చైతన్య పింగళి, గానం: సిద్ శ్రీరామ్)
 2. చుక్కల్ని తాకే (రచన: శ్రీ సాయికిరణ్, గానం: అభయ్ జోధ్‌పుర్కర్)
 3. దాచీ దాచీ (రచన: చైతన్య పింగళి, బాంబే జయశ్రీ)

విడుదల, స్పందన

[మార్చు]

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సిని నిర్మాణ సంస్థ నుండి ఈ సినిమా 2022 నవంబరు 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు యుఎస్ఏలో విడుదలయింది.[14] ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ₹1.30 కోట్లకు అమ్ముడయ్యాయి.[15] ఈ సినిమాలో గోపీ పాత్రలో తిరువీర్ తన గత సినిమాల్లో కంటే పూర్తిభిన్నంగా కనిపించగా, తల్లి పాత్రలో నటి సంగీత, ఎమోషనల్ సీన్స్‌లో తన సీనియారిటీతో మెప్పించింది. కావ్యా కళ్యాణ్‌ రామ్‌, బాంధవి, సత్యం రాజేష్‌, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్‌ వంటి ప్రధాన పాత్రధారుల నటన కూడా ఆకట్టుకుంది.[16] 2022 నవంబరు 25న ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చెన్నైలో కూడా విడుదలయింది. 2022 డిసెంబరు 21న ఆహా ఓటిటిలో విడుదలయింది.[17]

రేటింగ్

[మార్చు]
 • టైమ్స్ ఆఫ్ ఇండియా: 3/5[18]
 • ఎన్ టివి: 3/5[19]
 • తెలుగు హిందుస్తాన్ టైమ్స్: 3/5[20]
 • జీ న్యూస్ ఇండియా: 3/5
 • సాక్షి: 3/5[21]

బాక్సాఫీస్

[మార్చు]

థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి, మసూద ₹6.26 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌తో ప్రపంచవ్యాప్తంగా ₹11.72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.[22]

మూలాలు

[మార్చు]
 1. Dundoo, Sangeetha Devi (2022-11-18). "'Masooda' movie review: Thiruveer, Sangitha shoulder a middling horror drama". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 2. "పాన్‌ ఇండియా చిత్రంగా 'మసూద'". Sakshi. 2022-09-30. Archived from the original on 2022-09-30. Retrieved 2022-10-04.
 3. telugu, NT News (2022-10-01). "హారర్‌ డ్రామా 'మసూద'". Namasthe Telangana. Archived from the original on 2022-10-01. Retrieved 2022-10-04.
 4. "Year Ender 2022". News18 Telugu. Retrieved 31 December 2022.
 5. The Hindu (18 November 2022). "'Masooda' movie review: Thiruveer, Sangitha shoulder a middling horror drama" (in Indian English). Archived from the original on 19 November 2022. Retrieved 19 November 2022.
 6. Namasthe Telangana (30 November 2022). "విలక్షణ నటుడు అనిపించుకోవాలి". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 నవంబరు 2022 suggested (help)
 7. "Thiruveer, Kavya Kalyanram's 'Masooda' title poster out; gives an insight into the concept of movie - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-07-31. Archived from the original on 2022-07-30. Retrieved 2022-10-05.
 8. Sakshi (3 April 2023). "వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్". Archived from the original on 4 April 2023. Retrieved 4 April 2023.
 9. TeamIH (2020-12-24). "Swadharm Entertainment's Production No 3 Titled As "MASOODA"". IndustryHit.Com. Archived from the original on 2022-10-05. Retrieved 2022-10-05.
 10. "Natural star Nani launches the teaser of 'Masooda' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-08-02. Archived from the original on 2022-08-02. Retrieved 2022-10-05.
 11. Velugu, V6 (2022-09-30). "నవంబర్ 11న 'మసూద' రిలీజ్". V6 Velugu. Archived from the original on 2022-09-30. Retrieved 2022-10-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 12. "అతని సినిమాలకు నేను అభిమానిని.. దిల్ రాజు కామెంట్స్ వైరల్". Sakshi. 2022-11-09. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
 13. "'Masooda' trailer review: The Sangitha starrer promises to be an engaging horror thriller - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-11-13. Archived from the original on 2022-11-13. Retrieved 2022-11-14.
 14. ABN (2022-11-18). "Masooda Film Review: కొత్తగా అనిపించిన 'మసూద'". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 15. "Masooda: కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఉండదు.. 'మసూద' సక్సెస్ మీట్‌లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు." News18 Telugu. 2022-12-07. Retrieved 2022-12-08.
 16. "Masooda Movie Review : మసూద రివ్యూ.. భయపెట్టిన దెయ్యం". Zee News Telugu. 2022-11-18. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 17. Sakshi (15 December 2022). "ఓటీటీకి 'మసూద' చిత్రం.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే..!". Retrieved 15 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 18. Masooda Movie Review: This one's for the horror fanatics, archived from the original on 2022-11-18, retrieved 2022-11-18
 19. Telugu, ntv (2022-11-18). "Massoda Movie Review: మసూద". NTV Telugu. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 20. Kumar, Nelki Naresh. "Masooda Movie Review: మ‌సూద మూవీ రివ్యూ - హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా భ‌య‌పెట్టిందా". Hindustantimes Telugu. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 21. "Masooda Review: 'మసూద' మూవీ రివ్యూ". Sakshi. 2022-11-18. Archived from the original on 2022-11-18. Retrieved 2022-11-18.
 22. "Year Ender 2022: RRR సహా 2022లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్టైన చిత్రాలు ఇవే." News18 Telugu. 2022-12-30. Retrieved 2022-12-31.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మసూద&oldid=4202709" నుండి వెలికితీశారు