సురభి ప్రభావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురభి ప్రభావతి
Surabhi Prabhavathi.jpg
జననం (1980-06-27) 1980 జూన్ 27 (వయస్సు: 39  సంవత్సరాలు)
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తినటి
తల్లిదండ్రులురేకందార్ కుమార్ బాబు, కమలమ్మ
బంధువులునాగేష్ (భర్త)

సురభి ప్రభావతి ప్రముఖ రంగస్థల నటి.

జననం[మార్చు]

వీరు 1980, జూన్ 27న శ్రీమతి కమలమ్మ, రేకందార్ కుమార్ బాబు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

బాలనటిగా గుణసుందరి నాటకంలో నటించి 2003 లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన ప్రభావతి, ఇప్పటివరకు సుమారు 500 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించింది. విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం, మృత సంజీవని, గణపతి మహత్యం, శశిరేఖా పరిణయం, నరకాసుర నాటకాల్లో ఈవిడ ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకుంది.

రచ్చబండ నాటికలోని దృశ్యం

నటించినవి[మార్చు]

నాటకాలు[మార్చు]

 1. మదన కామరాజు
 2. విప్రనారాయణ
 3. శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం
 4. మృత సంజీవని
 5. గణపతి మహత్యం
 6. శశిరేఖా పరిణయం
 7. నరకాసుర
 8. యజ్ఞం
 9. కవయిత్రి మొల్ల
 10. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
 11. బాపూబాట
 12. రాణి రుద్రమ

నాటికలు[మార్చు]

 1. రచ్చబండ
 2. సైకతశిల్పం
 3. త్యాగం
 4. పంపకాలు
 5. మాతృక[1]

సినిమాలు[మార్చు]

 1. బతుకమ్మ
 2. మహాత్మ

సీరియళ్లు[మార్చు]

 1. పూతరేకులు
 2. మాయాబజార్
 3. సరస్వతీ వైభవం

అవార్డులు[మార్చు]

ఈవిడ నంది, గరుడ (ఆయుష్మాన్‌భవ, నరకాసుర, విప్రనారాయణ) అవార్డులతోపాటు అనేక పరిషత్తుల నుండి ఎన్నో బహుమతులు అందుకుంది.

 1. ఉత్తమ నటి - మూడోదరి - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012 (2012)
 2. ఉత్తమ నటి - రాణి రుద్రమ - శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్, శ్రీకాళహస్తి (2018)[2]
 3. ఉత్తమ నటి - రైతేరాజు -అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5[3]

పురస్కారాలు[మార్చు]

 • మహిళారత్న పురస్కారం
 • తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (ఉత్తమ నటివిభాగంలో 2013) [4]
 • వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌) [5]

మూలాలు[మార్చు]

 1. నమస్తే తెలంగాణ. "ముగిసిన రంగస్థల సంబురాలు". Retrieved 27 June 2017. Cite news requires |newspaper= (help)
 2. జాతీయ పద్య నాటక పోటీల్లో రాణి రుద్రమకు ద్వితీయ బహుమతి, ఆంధ్రజ్యోతి, వరంగల్ అర్బన్ ఎడిషన్, 08.04.2018, పుట 7.
 3. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. మూలం నుండి 7 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 August 2019.
 4. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
 5. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Retrieved 17 January 2017. Cite news requires |newspaper= (help)
 • సురభి ప్రభావతి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 56.