వినరో భాగ్యము విష్ణుకథ
వినరో భాగ్యము విష్ణుకథ | |
---|---|
దర్శకత్వం | మురళీ కిషోర్ అబ్బురూ |
నిర్మాత | బన్నీవాసు |
తారాగణం | కిరణ్ అబ్బవరం కాశ్మీరా పరదేశి మురళి శర్మ |
ఛాయాగ్రహణం | డానియెల్ విశ్వాస్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చైతన్య భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | జీఏ2 పిక్చర్స్ |
విడుదల తేదీs | 17 ఫిబ్రవరి 2023(థియేటర్) 25 మార్చి 2023 (నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వినరో భాగ్యము విష్ణుకథ 2023లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహించాడు.[1] కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 29న విడుదల చేయగా, సినిమా ఫిబ్రవరి 17న విడుదలైంది.[2]
కథ
[మార్చు]విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతి కుర్రాడు. చాలా మంచోడు. దర్శన (కశ్మీరా) ఓ యూట్యూబర్. సెలబ్రిటీ కావాలని తపించే దర్శన నంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారా విష్ణు, మార్కేండేయ శర్మ (మురళీ శర్మ)లని కలిసి వీడియోలు చేస్తుంది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితిలో దర్శన ఓ హత్య కేసులో దోషిగా జైలుకి వెళుతుంది. ఆ కేసుని నుంచి దర్శనని విష్ణు ఎలా బయటికి తెస్తాడు ? సరదాగా యూట్యూబ్ వీడియోలో చేసుకునే దర్శన అసలు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది ? ఆ తరువాత ఏమి జరిగింది అనేది మిగతా కథ.[3]
నటీనటులు
[మార్చు]- కిరణ్ అబ్బవరం
- కాశ్మీరా పరదేశి
- మురళి శర్మ
- యశ్ శెట్టి[4]
- ఆమని
- దేవీ ప్రసాద్
- దయానంద్ రెడ్డి
- కేజీఎఫ్ లక్ష్మణ్
- శుభలేఖ సుధాకర్
- ప్రవీణ్
- శరత్ లోహితస్వా
- పమ్మి సాయి
- సురభి ప్రభావతి
పాటల జాబితా
[మార్చు]- వాసవా , సూహాస , రచన: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని , గానం.కారుణ్య
- ఒ బంగారం , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం. .కపిల్ కపిలాన్
- దర్శన , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం . అనురాగ్ కులకర్ణి
- చుక్కలెట్టు కొండలే , రచన: కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, గానం అనురాగ్ కులకర్ణి
- ప్రవాసాన్ని, రచన: కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, గానం. హైమత మొహమ్మద్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీఏ2 పిక్చర్స్
- నిర్మాత: బన్నీవాసు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బురూ
- సంగీతం: చైతన్య భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: డానియెల్ విశ్వాస్
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 July 2022). "చూడరో భాగ్యము.. విష్ణుకథ". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Namasthe Telangana (30 October 2022). "ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము విష్ణుకథ'". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Eenadu (18 February 2023). "రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
- ↑ The New Indian Express (14 April 2022). "Yash Shetty makes his Tollywood entry with Vinaro Bhagyamu Vishnukatha" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.