Jump to content

కాశ్మీరా పరదేశి

వికీపీడియా నుండి
కాశ్మీరా పరదేశి
విద్యాసంస్థనేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ముంబై)
వృత్తినటి, మోడల్[1]
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

కాశ్మీరా పరదేశి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. తెలుగులో నర్తనశాల (2018), తమిళంలో శివప్పు మంజల్ పచ్చై (2019)లలో తొలిసారిగా నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కాశ్మీరా పరదేశి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించింది.[2] పూణేలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను పూర్తిచేసింది.[3] ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ చదివింది.[4]

కళారంగం

[మార్చు]

సినీరంగంలోకి రావడానికి ముందు కాశ్మీరా పరదేశి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. 2018లో నాగశౌర్య హీరోగా తెలుగులో వచ్చిన నర్తనశాల సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[5] 2019లో మిషన్ మంగళ్ అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ -సంజయ్ కపూర్ కుమార్తెగా నటించింది.[6][2] రవి జాదవ్ తీసిన రాంపట్ (2019)తో మరాఠీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[7][3] జివి ప్రకాష్ కుమార్ సరసన శివప్పు మంజై పచ్చై (2019) తమిళ సినిమాలో నటించింది.[8] 2021లో, కాశ్మీరా పరదేశి నిఖిల్ కుమార్ సరసన రైడర్ (2021)తో కన్నడ సినిమారంగలోకి ప్రవేశించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2018 నర్తనశాల మానస తెలుగు
2019 రాంపట్ మున్నీ మరాఠీ
మిషన్ మంగళ్ అన్యా షిండే హిందీ
శివప్పు మంజల్ పచ్చై కవిన్ తమిళం
2021 రైడర్ సౌమ్య "చిన్ను" కన్నడ
2022 అన్బరివు కయల్ తమిళ్ [9]
వరలారు ముక్కియం యమునా తమిళ్ [10]
2023 వసంత ముల్లై \ వసంత కోకిల నీలా తమిళ్ \ తెలుగు [11]
వినరో భాగ్యము విష్ణుకథ తెలుగు
పరంపోరుల్ తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [12]
పీటీ సార్ తమిళ్ [13]

మూలాలు

[మార్చు]
  1. Tanmayi, Bhawana. "Narsthanshala to launch a new heroine". Telangana Today.
  2. 2.0 2.1 "Kashmira Pardeshi will make her Bollywood debut with 'Mission Mangal' - Times of India". The Times of India.
  3. 3.0 3.1 "Never expected to debut with a Ravi Jadhav film: Kashmira Pardeshi - Times of India". The Times of India.
  4. Adivi, Sashidhar (31 July 2018). "Kashmira Pardeshi to make Tamil debut". Deccan Chronicle.
  5. kavirayani, suresh (4 September 2018). "A hat-trick of flops for Naga Shaurya". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 13 March 2022.
  6. Adivi, Sashidhar (9 November 2018). "It's a dream Bollywood debut: Kashmira Pardeshi". Deccan Chronicle.
  7. "'Rampaat': Character poster of Kashmira Pardeshi as 'Munni' unveiled! - Times of India". The Times of India.
  8. "I have a Tamil tutor now, says Kashmira - Times of India". The Times of India.
  9. "It's a wrap for Hiphop Tamizha Adhi's rural drama 'Anbarivu' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 October 2021.
  10. "Jiiva's Varalaru Mukkiyam gets a release date". Cinema Express. 21 November 2022.
  11. "Watch: Teaser of Bobby Simha's 'Vasantha Mullai' is eerie and intriguing". The News Minute (in ఇంగ్లీష్). 27 June 2021. Retrieved 22 April 2022.
  12. "Sarath Kumar, Amitash Pradhan, and Kashmira Pardeshi team up for a new film". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 8 January 2022.
  13. "Kashmira Pardeshi reunites with Hiphop Tamizha for HHT 7". CinemaExpress. Retrieved 2023-01-09.

బయటి లింకులు

[మార్చు]