వసంత కోకిల (2023 సినిమా)
Appearance
వసంత కోకిల | |
---|---|
దర్శకత్వం | రమణన్ పురుషోత్తమ |
రచన | రమణన్ పురుషోత్తమ |
నిర్మాత | రజనీ తాళ్లూరి రేష్మి సింహా రామ్ తాళ్లూరి |
తారాగణం | బాబీ సింహ కాశ్మీరా పరదేశి ఆర్య |
ఛాయాగ్రహణం | గోపి అమర్‌నాథ్ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | రాజేష్ మురుగేశన్ |
నిర్మాణ సంస్థలు | మధుర ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎస్.ఆర్.టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2023 ఫిబ్రవరి 10 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వసంత కోకిల 2023లో విడుదలైన తెలుగు సినిమా. తమిళ సినిమా ‘వసంత ముల్లై’ సినిమాను తెలుగులో ‘వసంత కోకిల’ పేరుతో మధుర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్.ఆర్.టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై రజనీ తాళ్లూరి, రేష్మి సింహా, రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహించాడు. బాబీ సింహ, కాశ్మీరా పరదేశి, ఆర్య, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి ఫిబ్రవరి 06న విడుదల చేయగా[1], సినిమా ఫిబ్రవరి 10న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది.[2][3] వసంత కోకిల సినిమా ఆహా ఓటీటీలో మార్చి 3న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- బాబీ సింహ
- కాశ్మీరా పరదేశి
- ఆర్య
- శరత్ బాబు
- కొచ్చు ప్రేమన్
- రమాప్రభ
- మోనా బెంద్రే
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మధుర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్.ఆర్.టీ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: రజనీ తాళ్లూరి, రేష్మి సింహా, రామ్ తాళ్లూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణన్ పురుషోత్తమ
- సంగీతం: రాజేష్ మురుగేశన్
- సినిమాటోగ్రఫీ: గోపి అమర్‌నాథ్
- పాటలు: చంద్రబోస్, రాకేందు మౌళి
- మాటలు: రాజేష్.ఏ.మూర్తి
- ఫైట్స్: సామ్ & స్టంట్ సిల్వా
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 February 2023). "'వసంత కోకిల' ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ NTV Telugu (30 January 2023). "మూడు భాషల్లో ఒకేసారి 'వసంత కోకిల'!". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ A. B. P. Desam (10 February 2023). "బాబీ సింహా 'వసంత కోకిల' ఎలా ఉంది? థియేటర్ల దగ్గర నిలబడుతుందా?". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ Eenadu (3 March 2023). "ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్ సిరీస్‌లు". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.