Jump to content

విజయనగర వీరపుత్రుని కథ

వికీపీడియా నుండి
విజయనగర వీరపుత్రుని కథ
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రట్టిహళ్లి నాగేంద్రరావు
తారాగణం ఆర్.ఎన్.సుదర్శన్,
బి.సరోజా దేవి,
ఆర్.నాగేంద్రరావు
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

విజయనగర వీరపుత్రుని కథ రట్టిహళ్లి నాగేంద్రరావు స్వీయదర్శకత్వంలో నిర్మించిన డబ్బింగ్ సినిమా. ఇది 1963, జనవరి 12న విడుదలయింది.[1]

నటీనటులు

[మార్చు]
  • ఆర్.ఎన్.సుదర్శన్
  • బి.సరోజా దేవి
  • ఆర్.నాగేంద్రరావు
  • కళ్యాణ్ కుమార్
  • ఉదయ్ కుమార్
  • సంధ్య
  • లక్ష్మీదేవి
  • రమాదేవి
  • బేబీ లక్ష్మి
  • బాలకృష్ణ
  • నరసింహరాజు
  • గణపతి భట్
  • హెచ్.ఆర్.శాస్త్రి
  • శ్యాంసుందర్
  • హనుమంతరావు
  • ఎం.జి.మరిరావు
  • ఉదయశంకర్
  • జి.ఎం.నంజప్ప
  • శాండో ప్రకాష్
  • హనీఫ్ కుమార్
  • శివాజీ రావ్
  • దేశరాజ్
  • హనుమంతాచార్
  • గుగ్గు
  • శంకరనారాయణ్
  • మహేశ్వరయ్య
  • గోపాల్ రావు
  • శకుంతల
  • శశి
  • కళ
  • మాల
  • లీల
  • జనార్దన్

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను శ్రీశ్రీ రచించగా జి.కె.వెంకటేష్ పర్యవేక్షణలో విశ్వనాథన్ - రామమూర్తి జంట సంగీతాన్ని అందించింది.[2]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట గాయనీ గాయకులు
1 మందార సుందర శృంగార మారుని మధురస యౌవ్వన చంద్రకళా
2 మాయలమల్లి మందులజల్లీ పిలిచేపిల్లా పలికేదెల్లా పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి
3 తన్మయమందె కదా చిన్మయరూప సుధా పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి
4 దారిని కాచితివేల ఓ దానయ్యా నీటికి పోయెద విడు దారి ధర్మయ్యా పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి
5 మధువనియే హృదయమను చపలతచే నిలిచి మాధవ మధుసూదన నీ మొగమును చూచితిని ఎస్.జానకి
6 మధురమోహన వీణావాదన మృదులకళా మిళిత జగాలకు సంతోష రససాధన పి.బి.శ్రీనివాస్
7 పత్తిపూవులవోలె పాలసంద్రమువోలె ఆకసము నిండె మేఘాలు పి.బి.శ్రీనివాస్

విజయనగర సామ్రాజ్యపు సామంతరాజులలో మారేపల్లి సంస్థానాధిపతి గురవరాయలు ముఖ్యుడు. గురువరాయలు తనకు కుమారుడు జన్మించాడన్న సంతోషంలో మైమరచి వస్తూ దారిలో బాబా అనే ఒక పేదకుటుంబీకుని కుమారుడైన విశ్రముని మీదికి రథాన్ని తోలి ఆ పిల్లవాని మరణానికి కారణమౌతాడు. అది మనసులో పెట్టుకుని బాబా ఒక రాత్రి గురవరాయని కుమారుని ఎత్తుకుని పోయి విక్రముడు అని పేరుపెట్టి ఆ కుమారుడి చేతిలోనే తండ్రికి ప్రతీకారం చేయాలని నిశ్చయించుకుంటాడు. రాణి కుమారుడు కనిపించక పోవడంతో బెంగపెట్టుకుని మరణిస్తుంది. ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంది. బాబా విక్రముణ్ణి అన్ని విద్యలలోను మంచి నేర్పరిని చేస్తాడు. భార్య మరణంతోను, కుమారుని ఎడబాటుతోను గురవరాయలు కర్కోటకునిగా మారి ప్రజలను హింసిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయలవారిపట్ల గర్భశత్రుత్వాన్ని వహించి, రహస్యసభ ఏర్పాటు చేసి, కొందరు సామంతరాజులను రప్పించి వారిలో పాపరాయలవారి పెంపుడు బిడ్డడైన హేమగిరి రంగరాయలను కూడా పిలిపించి తాను మాత్రం తప్పుకుంటాడు. సభ సారాంశం తెలుసుకున్న రంగరాయలు, రాయలవారిపై ఎదురు తిరగమని చెప్పిన వాళ్ళతో పోరాడి గుండెలో తగిలిన ఈటె దెబ్బతో బయటపడతాడు. ఈలోగా గురవరాయలు దొంగపత్రాలను సృష్టించి రాయలవారి వద్దకు వెళ్ళి నేరమంతా రంగరాయలు మీద పెట్టి, కథనంతా మార్చి రంగరాయల మీద చాడీలు చెబుతాడు. ఆ సంగతి విన్న రాయలవారు రంగరాయలను సజీవంగా గాని, నిర్జీవంగా గాని తనకు అప్పగించవలసినదంటూ రాజ్యమంతటా చాటింపు వేస్తాడు. రంగరాయలు సోదరి హేమ అన్నను వెదుకుకుంటూ బయలుదేరి గురవరాయలు చేతిలో చిక్కుతుంది. ఆమెను విక్రముడు రక్షిస్తాడు. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమించుకుంటారు. రాజులు సంతకాలు చేస్తూ ఇచ్చిన పత్రాలను రంగరాయలు చెల్లెలికి ఇస్తూ రాయలవారికి చూపి తాను నిర్దోషినని నిరూపించమంటాడు. హేమ ఆ పత్రాలను తీసుకువెళుతూ దారిలో విక్రముణ్ణి కలుసుకోవడంలో వాటిని పోగొట్టుకుంటుంది. వాటిని గురవరాయలు తప్ప ఇంకెవ్వరూ తీసి ఉండరని చెప్పి విక్రముడు పత్రాలను తీసుకురావడానికి వెళ్ళి, గురవరాయలు చేతిలో బంధించబడతాడు. ఇది తెలుసుకున్న హేమ పత్రాలను తనే తీసుకువస్తానని గురవరాయలు దగ్గరకు వెళుతుంది. కామోద్రేకంతో గురవరాయలు తనను పెళ్ళాడమని హేమను నిర్బంధిస్తాడు. లేకుంటే సూర్యోదయంలోగా విక్రముని ఉరితీస్తానని బెదిరిస్తాడు. విక్రముడిని ఉరిశిక్ష మాట విన్న రంగరాయలు అతడిని రక్షించడానికి మారువేషంలో బయలుదేరతాడు. అయితే రంగరాయలు విక్రముని రక్షిస్తాడా? గురవరాయలు కపట నాటకం బయటపడి రాయలవారికి నిజం తెలుస్తుందా? హేమకు విక్రమునికి వివాహం జరుగుతుందా? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Vijayanagara Veeraputhruni Katha (R. Nagendra Rao) 1963". ఇండియన్ సినిమా. Retrieved 19 December 2022.
  2. 2.0 2.1 శ్రీశ్రీ (12 January 1963). Vijayanagara Veeraputhruni Katha (1963)-Song_Booklet (1 ed.). ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్. p. 12. Retrieved 19 December 2022.