ఒసేయ్ రాములమ్మా
స్వరూపం
(ఒసేయ్ రాములమ్మ నుండి దారిమార్పు చెందింది)
ఒసేయ్ రాములమ్మా (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | దాసరి నారాయణరావు , కృష్ణ , విజయశాంతి, రామిరెడ్డి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | దాసరి ఫిల్మ్ యూనివర్సిటి |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఒసేయ్ రాములమ్మా 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక విప్లవ చిత్రం. ఇందులో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళా నక్సలైట్ గా ఎలా మారింది అనేది కథాంశం. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ యాదవ్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడాడు.
తారాగణం
[మార్చు]- రాములమ్మగా విజయశాంతి
- దాసరి నారాయణ రావు
- రామిరెడ్డి
- రాంకీ
- కోళ్ళ అశోక్ కుమార్
- అతిథి పాత్రలో కృష్ణ
- తెలంగాణా శకుంతల
- నర్రా వెంకటేశ్వర రావు
- సంజీవి ముదిలి
పాటలు
[మార్చు]ఇందులో పాటలన్నీ దాదాపు ప్రజా కవులు రాసినవే. సంగీత పరంగా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
- ఓ ముత్యాల బొమ్మా., రచన: సి నారాయణ రెడ్డి గానం. వందేమాతరం శ్రీనివాస్
- ఓ చౌదరి గారూ! ఓ నాయుడు గారూ! రచన: గండవరపు సుబ్బారావు, గానం. వందేమాతరం శ్రీనివాస్
- రాములమ్మ ఓ రాములమ్మ ఓహో , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.వందేమాతరం శ్రీనివాస్
- లచ్చులో లచ్చన్నా , రచన: గూడ అంజయ్య, గానం. వందేమాతరం శ్రీనివాస్
- ఏ అసురుడు సృష్టించిన పంచమ వేదం , రచన: సి నారాయణ రెడ్డి, గానం. వందేమాతరం శ్రీనివాస్
- ఎరుపు రంగు ఏడ ఉంటే ఆడే ఉంటానంటినవి , రచన: దాసరి నారాయణరావు, గానం. చిత్ర
- రామ చక్కని , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.ఎం ఎం కీరవాణి , ఎం ఎం శ్రీలేఖ
- అద్దలోరి బుద్దయ్య , రచన: జయవీర్ , గానం.మనో
- ఇంటి ఈ ఇంటి , రచన: సుద్దాల అశోక్ తేజ గానం.వందేమాతరం శ్రీనివాస్
- పుల్లాల మంటివి గదరా, రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకీ.