Jump to content

అడవి దివిటీలు

వికీపీడియా నుండి
అడవి దీవిటీలు
(1990 తెలుగు సినిమా)
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర
భాష తెలుగు

అడవి దివిటీలు 1990 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించబడింది.[1]

రాజకీయ సామాజిక సమస్యలను లోతుగా పరిశీలిస్తూ వాటి చుట్టూ అల్లిన ఇతివృత్తాలను వెండితెరపై చూపగలిగే వాస్తవ గధా చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. దోపిడీ వ్యవస్థపై అసంతృప్తితో ఆవేశంతో తిరగబడే యువతీ యువకుల మనోభావాలను స్నేహచిత్ర పిక్చర్స్ "ఆదవి దివిటీలు" పేరుతో కథా చిత్రంగా రూపొందించారు.

ఒక నక్సలైట్ నాయకుడు తన అనుచరులతో కలసి అడవులలో లోయలలో సంచరిస్తూ ఉంటాడు. గిరిజనుల భూములను ఇతరులు కబ్జా చేయడం అడ్డుకుంటాడు. ఆ కృషిలో గుర్నాధం అనే ఎం.ఎల్.ఏకు బద్ద శత్రువవుతాడు. హోం మంత్రి కుమారుడు దినేశ్ ఆ ప్రాంతంలో నివసించే కొండారెడ్డి కుమార్తె పద్మను చెరుస్తాడు. నలుగురికి భయపడి ఆమెను పెళ్ళాడుతాడు. కానీ ఉంపుడు గత్తెగా చూస్తానంటాడు. ఆమె అతన్ని ఎదుర్కొంటుంది. నక్సల్ నాయకుడు ఆమెకు అన్నగా అండగా నిలుస్తాడు. దినేశ్ ను అన్నలు కాల్చి చంపేస్తారు. గుర్నాథం హోం మంత్రి అండ చూసుకొని ఎన్నో అక్రమాలు సాగిస్తాడు. ఫలితంగా హత్య చేయబడుతాడు. విక్రం అనే ఎస్.పి. తన బలగంతో వచ్చి పడతాడు గిరిజనులపైకి. గూడెం తగలబెట్టిస్తాడు. కాని ఆ నక్సలైట్లలో తన కొడుకు కూడా ఉన్నాడని గుర్తిస్తాడు. అయినా కర్తవ్యం అతన్ని బద్ధుడ్ని చేస్తుంది. అతని కొడుకు కూడా ఉద్యమానికి ప్రాముఖ్యతనిస్తాడు. అతను పట్టుబడి చిత్రహింసలననుభవిస్తాడు. పద్మ ఈ అరాచకాలకు భయపడి గిరిజనులను రక్షించాలని భావించి అన్నల రహస్య స్థావరాలు పోలీసులకు చెప్పేస్తుంది. రెండు లక్షల రూపాయలతో తిరిగి వస్తుంది. తన పల్లె బాగుచేద్దామని. కాని ఆమెకు పరాభవమే ఎదురవుతుంది. చివరికి బల్లెం పోటుకు గురై మరణిస్తుంది. పోలీసులతో జరిగే పోరాటంలో చాలా మంది "అన్న"లు పోలీసులు ప్రాణాలు కోల్పోతారు. హోం మంత్రిని విక్రం స్వయంగా మంటలలోకి విసిరివెస్తాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Adavi Dhivitilu (1990)". Indiancine.ma. Retrieved 2020-08-05.
  2. "జజ్జనకరి జనారే". m.eenadu.net. Retrieved 2020-08-05.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]