సుహాని కలిత
సుహాని కలిత | |
---|---|
జననం | సుహాని కలిత 1991 డిసెంబరు 25 |
ఇతర పేర్లు | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1996–2004; 2007–ప్రస్తుతం |
సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహానీ, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది.[1]
2022 జూన్ మాసంలో మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో సుహాని నిశ్చితార్థం జరిగింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]సుహాని స్వస్థలం ముంబై. 1991 డిసెంబరు 25న హైదరాబాదులో జన్మించింది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాదులోనే చదివింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]సుహానీ, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని తెలుగు, ఒక హిందీ, ఒక బెంగాళీ సినిమాలలో బాలనటిగా నటించింది. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. బాలనటి గా 40 చిత్రాల, హీరోయిన్ గా 11 చిత్రాలలో నటించంది.[2] చివరిగా తెలుగులో 2010లో స్నేహగీతం చిత్రంలో ఆమె నటించింది.
ప్రచారకర్తగా
[మార్చు]నీరూస్, ఆర్.ఎస్. బ్రదర్స్, సామ్ సంగ్, సూరజ్ భాన్ జ్యూయలరీ, డిబి బ్రదర్స్, కాసం బ్రదర్స్, శరవణ స్టోర్స్, వీడియోకాన్, సిస్లే, ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్., కార్వీ ఫినన్న్స్ , ఐడియా సెల్లులార్ వంటి వాటికి ప్రచారకర్తగా చేసింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాషపేరు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1996 | బాల రామాయణం | తెలుగు | బాలనటి | |
1998 | గణేష్ | తెలుగు | బాలనటి | |
ప్రేమంటే ఇదేరా | తెలుగు | బాలనటి | ||
1999 | నా హృదయంలో నిదురించే చెలి | తెలుగు | బాలనటి | |
ప్రేమించేమనసు | తెలుగు | బాలనటి | ||
2000 | హిందుస్తాన్ - ది మదర్ | హరిణి | తెలుగు | బాలనటి, ఉత్తమ బాలనటిగా నంది పురస్కారం |
2001 | ఎదురులేని మనిషి | రాణి | తెలుగు | బాలనటి |
మనసంతా నువ్వే | యంగ్ అను | తెలుగు | బాలనటి | |
2002 | కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహీన్ | హిందీ | బాలనటి | |
2003 | ఎలా చెప్పను | తెలుగు | బాలనటి | |
మోనేరు మాజే తుమీ | బెంగాళీ | బాలనటి | ||
2004 | అనందమానందమాయే | తెలుగు | బాలనటి | |
2007 | సవాల్ | కీర్తన నరసింహం | తెలుగు | హీరోయిన్ గా మొదటిచిత్రం |
2007 | అనసూయ[3] | క్లబ్ డాన్సర్ | తెలుగు | |
2008 | కృషి[4] | ఐశ్వర్య | తెలుగు | |
2009 | శ్రీశైలం | లిఖిత | తెలుగు | |
2010 | స్నేహగీతం | మహాలక్ష్మీ | తెలుగు | |
ఇరందు ముగం | పవిత్ర | తమిళం | ||
2011 | అప్పవి | రమ్య | తమిళం | |
సుకుమార్ (సినిమా) | పూజా | తెలుగు | చిత్రీకరణ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 July 2021). "'మనసంతా నువ్వే' చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "సుహాని కలిత , Suhani kalita". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 March 2017. Retrieved 27 May 2017.
- ↑ జీ సినిమాలు. "జీ సినిమాలు ( 19th May)". www.zeecinemalu.com. Archived from the original on 21 మే 2017. Retrieved 27 May 2017.
- ↑ తెలుగు వెబ్ దునియా. "ప్రేమ కథాంశంతో "కృషి" ట్రెయిలర్ మీకోసం". telugu.webdunia.com. Retrieved 27 May 2017.